Amma Rajasekhar Fires On Hero Nithin And Gets Emotional, Viral - Sakshi
Sakshi News home page

Amma Rajasekhar-Hero Nithin: స్టేజ్‌పైన ఎమోషనలైన అమ్మ రాజశేఖర్‌.. హీరో నితిన్‌పై ఫైర్‌

Published Mon, Jul 11 2022 3:01 PM | Last Updated on Mon, Jul 11 2022 3:49 PM

Amma Rajasekhar Fires On Nithin And Get Emotional - Sakshi

Amma Rajasekhar Fires On Nithin And Get Emotional: హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో నితిన్‌. ప్రస్తుతం నితిన్‌ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం' విడుదలకు సిద్ధంగా ఉ‍న్న విషయం తెలిసిందే. ఈ  సినిమా నుంచి ఇటీవల విడుదలైన రారా రెడ్డి అనే పాట యూట్యూబ్‌లో వైరల్‌ అయింది. ఈ పాటలో నితిన్‌ ‍అద్భుతంగా డ్యాన్స్‌ చేశాడని ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో నితిన్‌కు డ్యాన్సే రాదని ప్రముఖ కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌ ఫైర్‌ అయ్యారు. నితిన్‌ మాటిచ్చి హ్యాండిచ్చాడని, అది తనకు అవమానకరంగా ఉందని స్టేజ్‌పైనే ఎమోషనల్‌కు గురయ్యాడు. 

విషయంలోకి వెళితే.. అమ్మ రాజశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్‌'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఆదివారం (జులై 10) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నితిన్‌ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సినట్లు తెలుస్తోంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో నితిన్‌ హాజరు కానట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మ రాజశేఖర్.. పది రోజుల క్రితమే నితిన్‌ను ఈ ప్రోగ్రామ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించా. ఆయన వస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నమ్మి.. అన్నం కూడా తినకుండా కష్టపడి నితిన్‌ కోసం ప్రత్యేకంగా ఏవీ క్రియేట్‌ చేయించా. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు. ఆయనకు డ్యాన్స్ నేర్పించి, ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించా. 

చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్‌.. హీరోలకు కమ్‌బ్యాక్‌ హిట్‌.. యాదృచ్ఛికమా!

కానీ, ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్‌ చేస్తే జ్వరమని చెప్పాడు. దానికి నేను వీడియో బైట్‌ అయినా పంపమని కోరాను. అది కూడా ఇవ్వలేదు. నితిన్‌కే కాదు హీరోలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, జీవితంలో మనం ఏ స్థాయికి వెళ్లినా.. అందుకు సహాయపడినవారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. నితిన్‌.. నువ్ రాలేను అనుకుంటే రానని నేరుగా చెప్పేయాల్సింది. వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతో అవమానించారు. నాకెంతో బాధగా ఉంది. అని అమ్మరాజేశేఖర్ ఎమోషనల్‌ అయ్యారు. కాగా నితిన్‌ నటించిన 'టక్కరి' మూవీకి అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్‌ హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement