'ఆకాష్‌కి ఏంటి? పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ, మా నాన్న స్టార్ డైరెక్టర్ కాకముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. మా నాన్న నా పక్కన లేకుంటే నేను జీరో.. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహానా సిప్పీ జంటగా నటించిన చిత్రం చోర్ బజార్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ యూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 'చోర్ బజార్ బాగా తీస్తావనే నమ్మకం ఉంది. మా అబ్బాయి (ఆకాష్)తో మంచి సినిమా చెయ్ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'కలర్‌ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు' అని నిర్మాత వీఎస్ రాజు పేర్కొన్నారు.
చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ !
కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాష్ పూరీ
Comments
Please login to add a commentAdd a comment