Chor Bazaar Movie
-
Gehna Sippy: కుర్రాళ్ల మనసులు చోరీ చేస్తున్న చోర్ బజార్ హీరోయిన్ గెహనా సిప్పి (ఫోటోలు)
-
మాస్ హీరోగా గుర్తింపు దక్కింది: ఆకాష్ పూరి
Akash Puri Emotional Speech In Chor Bazaar Success Meet: ''చోర్ బజార్' సినిమాతో మాస్ హీరోగా మెప్పించాననే పేరు నాకు దక్కింది. జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డిదే. నా గత చిత్రాల (మెహబూబా, రొమాంటిక్) కన్నా 'చోర్ బజార్' గ్రాండ్‌గా ఉందంటున్నారు. దానికి కారణం నిర్మాత వీఎస్ రాజు'' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 24) విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సమావేశంలో ''ఫస్ట్ టైమ్ 'చోర్ బజార్' వంటి ఒక కమర్షియల్ సినిమా చేశాను. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు'' అని డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. 'మా శ్రమకు మంచి ఫలితాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కు థ్యాంక్స్' అని నిర్మాత వీఎస్ రాజు తెలిపారు. చదవండి:👇 చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట? 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
బచ్చన్ సాబ్‌గా ఆకాష్ పూరి మెప్పించాడా ?.. 'చోర్ బజార్' రివ్యూ
టైటిల్: చోర్ బజార్ నటీనటులు: ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, అర్చన, సునీల్, సుబ్బరాజు తదితరులు దర్శకుడు: జీవన్ రెడ్డి నిర్మాత: వీఎస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి విడదల తేది: జూన్ 24, 2022 ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటుడిగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. 'రొమాంటిక్' మూవీతో నటనపరంగా మంచి మార్కులే తెచ్చుకున్నాడు. తాజాగా ప్రేక్షకులను అలరించేందుకు 'చోర్ బజార్' సినిమాతో మరోసారి సందడి చేశాడు. గెహనా సిప్పీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి 'జార్జ్ రెడ్డి'ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) అమితాబ్ బచ్చన్ అభిమానిగా నటించింది. శుక్రవారం (జూన్ 24)న విడుదైలన 'చోర్ బజార్' ప్రేక్షకుల మనసును చోరీ చేసిందో తెలియాలంటే ఈ రివ్యూ చూడాల్సిందే. కథ: హైదరాబాద్‌లోని మ్యూజియంలో రూ. 200 కోట్లు విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రం అపహరణకు గురవుతుంది. దొంగలను పట్టుకునే క్రమంలో ఆ వజ్రం చోర్ బజార్ అనే ఏరియాలో పడుతుంది. మరోవైపు చోర్ బజార్‌ను అన్ని తానై నడిపిస్తుంటాడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). దీంతో ఎలాగైన ఆ వజ్రాన్ని పట్టుకునేందుకు చోర్ బజార్లో కాపు కాస్తారు పోలీసులు. మరి ఆ వజ్రాన్ని పోలీసులు పట్టుకున్నారా ? చివరిగా అది ఎక్కడికి చేరింది ? బచ్చన్ సాబ్ ప్రేమించిన మూగ అమ్మాయి సిమ్రాన్ (గెహనా సిప్పీ)ని దక్కించుకున్నాడా? చోర్ బజార్‌ను శాశ్వతంగా మూయించాలనుకున్నా గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) ఏం చేశాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే 'చోర్ బజార్' చూడాల్సిందే. విశ్లేషణ: డైరెక్టర్ జీవన్ రెడ్డి 'జార్జ్ రెడ్డి'తో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన 'దళం' సినిమాకు ఒక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అయితే ఈ రెండు సినిమాల అనుభవం 'చోర్ బజార్' మూవీని తెరకెక్కించడంలో కనిపించలేదనే చెప్పవచ్చు. వజ్రాన్ని దొంగతనం చేసే సన్నివేశంతో ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు తర్వాత పూర్తిగా తడబడ్డారు. డైమండ్ చోరి తర్వాత వచ్చే సీన్లన్ని చప్పగా సాగుతాయి. డైమండ్ చోరీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో లవ్, చోర్ బజార్ మనుషుల కథ, ఉమెన్ ట్రాఫికింగ్, అమితాబ్ బచ్చన్ మీద అభిమానంతో ఇళ్లు వదిలేసి వచ్చిన యువతి కథ వంటి పలు ఉప కథలు గందరగోళానికి గురిచేస్తాయి. మరీ స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, గజిబిజి సీన్లతో నిండిన ఎడిటింగ్ ప్రేక్షకుల సహనానికి పరీక్షపెడతాయి. రెండు పాటలు, సురేష్ బొబ్బిలి సంగీతం పర్వాలేదనిపించింది. నటీనటులు మాట్లాడే తెలంగాణ యాస కొంత ఇబ్బందిపెడుతుంది. ఎవరెలా చేశారంటే? ఆకాష్ పూరి నటన ఇంతకుముందు చిత్రాల్లానే ఇందులో ఉంది. అలాగే పూరీ స్టైల్ హీరోగా కనిపిస్తాడు. ప్రతి సినిమాలో అలాగే కనిపించేసరికి రొటీన్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ పర్వాలేదనిపిస్తుంది. ఇక మూగ అమ్మాయిగా గెహనా సిప్పీ తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పవచ్చు. మూగ అమ్మాయిగా హీరోయిన్ ఎలివేట్ అయ్యే సన్నివేశాలు అంతగా లేకున్నా ఉన్నంతలో బాగానే నెట్టుకొచ్చింది. సీనియర్ నటి అర్చన (నిరీక్షణ ఫేమ్) బాగుంది. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ అంతగా వర్కౌట్ కాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'చోర్ బజార్'ను వీక్షించాలంటే మాత్రం ఎంతో ఓపిక కావాలి. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి
'ఆకాష్‌కి ఏంటి? పూరి జగన్నాథ్ కొడుకు అనుకుంటారు. కానీ, మా నాన్న స్టార్ డైరెక్టర్ కాకముందే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. మా నాన్న నా పక్కన లేకుంటే నేను జీరో.. ఏదో ఒకరోజు మా నాన్న స్థాయికి వెళ్లి, ఆయనతో కలిసి సినిమా చేస్తా' అని ఆకాష్ పూరి తెలిపాడు. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహానా సిప్పీ జంటగా నటించిన చిత్రం చోర్ బజార్. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ యూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 'చోర్ బజార్ బాగా తీస్తావనే నమ్మకం ఉంది. మా అబ్బాయి (ఆకాష్)తో మంచి సినిమా చెయ్ అని పూరి జగన్నాథ్ అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది' అని తెలిపారు. 'కలర్‌ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు' అని నిర్మాత వీఎస్ రాజు పేర్కొన్నారు. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాష్ పూరీ -
కొడుకు ఫంక్షన్‌కు వచ్చే టైం లేదా.. పూరీపై బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మందిని స్టార్ హీరోలుగా చేసిన పూరి జగన్నాథ్.. కన్నకొడుకు(ఆకాశ్ పూరీ) సినిమా ఫంక్షన్‌కి రాకపోవడం బాధగా ఉందన్నారు. ఆకాష్ పురి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈనెల 24న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన బండ్ల గణేశ్ పూరిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓ సామెత ఉంటుంది.. దేశం మొత్తం కల్లాపు చల్లాడు కానీ.. ఇంటి ముందు కల్లాపు చల్లడానికి టైం లేదనే పూరీని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది.ఎంతో మందిని స్టార్స్‌గా తయారు చేశాడు. డైలాగ్‌లు చెప్పడం రాని వాళ్లకి డైలాగ్‌లు నేర్పాడు. డాన్స్‌లు రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్‌కి మాత్రం రాలేదు. అదే నేనైతే నేను లండన్‌లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చేవాడిని. ఎందుకంటే నేను ఉన్నదే నా కొడుకు కోసం.. నా భార్య కోసం.. నా పిల్లల కోసం.. మా అన్న(పూరి జగన్నాథ్) ఎక్కడ ఉన్నాడో.. ఏం బిజీగా ఉన్నాడో.. ఈసారికి అయిపోయింది కానీ ఇంకోసారి ఇలాంటి పని మాత్రం చేయమాకు. ఎందుకంటే మనం ఏం చేసినా వాళ్ల కోసమే. మనం చస్తే తలకొరివి పెట్టాల్సింది వాళ్లే. మనం సంపాదిస్తే ఆస్తులు వాళ్లకే.. అప్పులు చేస్తే తీర్చేదీ వాళ్లే. ఆకాశ్ అంటే సన్నాఫ్ పూరీ జగన్నాథ్.. . ఎవర్నెవర్నో స్టార్లని చేశావ్.. నీ కొడుకు వచ్చేసరికి వెళ్లి ముంబాయిలో ఉన్నావ్.. ఇదెక్కడి న్యాయం అన్నా?.నువ్ నీ కొడుకుని స్టార్‌ని చేసినా చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు.. చోర్ బజార్ పెద్ద హిట్ అవుతుంది. నువ్ కూడా నీ కొడుకు డేట్స్ కోసం క్యూలో ఉండే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా రాస్కో.. నువ్ బ్యాంకాక్ పోయి కథ రాసుకుని.. ఆకాష్ కథ చెప్తా వినరా అని ఎదురుచూసే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో. అలా జరక్కపోతే నా పేరు బండ్ల గణేష్ కాదు. ఆరోజు వచ్చినరోజు.. ఆకాశ్ నువ్ డేట్లు ఇవ్వొద్దని చెప్తా’ అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. -
అప్పుడు కాలర్ ఎగిరేశా.. కానీ అంత ఈజీ కాదు: ఆకాశ్ పూరీ
‘‘బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఉంది. ఓ బిగ్ హిట్ కోసం మరింత ఏకాగ్రతతో కష్టపడి పని చేస్తున్నాను. ‘చోర్ బజార్’ హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆకాష్ పూరి. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాష్ పూరి చెప్పిన విశేషాలు. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ⇔ ఈ సినిమాలో నేను బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. టైర్లను దొంగతనం చేయడం నా పని. దొంగతనాలు చేసి పేదవారికి సాయం చేస్తుంటాడు. సో... వారి దృష్టిలో బచ్చన్ సాబ్ హీరో. ‘చోర్ బజార్’ అనగానే అందరూ దొంగలు, క్రిమినల్స్ గురించే ఆలోచిస్తుంటారు. కానీ అక్కడ కూడా కుటుంబాలు, ఎమోషన్స్ ఉంటాయి. వీటినే మా ‘చోర్ బజార్’ సినిమాలో చూపించాం. నా కెరీర్లో డిఫరెంట్ అండ్ మంచి స్టైలిష్ యాక్షన్ డ్రామా ఇది. జీవన్రెడ్డిగారు కథ వినిపించినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా యాక్టర్‌గా నా ఇమేజ్ను పెంచుతుందనుకుంటున్నాను. చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే! ⇔ నాన్నగారు (పూరి జగన్నాథ్) ఇంకా ‘చోర్ బజార్’ చూడలేదు. కానీ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. నా ప్రతి సినిమా కథను నాన్నకి వినిపించి ఆయన్ను డిస్ట్రబ్ చేయాలనుకోను. ‘సొంత నిర్ణయాలు తీసుకో.. నీ గట్ ఫీలింగ్‌పై వెళ్లు’ అని నాన్న చెబుతుంటారు. నా గత చిత్రం ‘రొమాంటిక్’ ప్రమోషన్లో నేను హీరోగా సక్సెస్ అయి నాన్న పేరు నిలబెడతానని కాలర్ ఎగరేశాను. కానీ అది ఒక సినిమాతో జరిగే పని కాదు. కొంత జర్నీ సాగాలి. ఇక నేను కొత్తగా మూడు సినిమాలు కమిటయ్యాను. -
నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు
‘‘చోర్ బజార్’ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్‌ఫుల్ ఫిల్మ్. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్) అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్‌కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. ‘చోర్ బజార్లో’ నాది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్ సాబ్. మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్‌లోనూ నటించనున్నాను’’ అన్నారు. -
నాకు సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడం రాదు: డైరెక్టర్
Director Jeevan Reddy Interesting Comments On Chor Bazaar Movie: ‘‘నాకు సక్సెస్‌ను క్యాష్ చేసుకోవడం రాదు. ‘జార్జ్ రెడ్డి’ తర్వాత ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోలేదని నా ఫ్రెండ్స్ అంటుంటారు. మనసుకు నచ్చిన కథలను తెరకెక్కిస్తుంటాను. లెక్కలు వేసుకోవడం రాదు.. సినిమాలు లేకపోతే ఊరెళ్లి వ్యవసాయం చేసుకుంటాను’’ అన్నారు డైరెక్టర్ జీవన్ రెడ్డి. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘చోర్ బజార్’ ప్రేమకథా చిత్రం అయినప్పటికీ కథనం ఒక విలువైన డైమండ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటూ కమర్షియల్‌గా సాగుతాయి. నేను అనుకున్న బచ్చన్ సాబ్ పాత్రకు ఆకాష్ వంద శాతం న్యాయం చేశాడు. ఈ చిత్రకథని పూరి జగన్నాథ్‌గారు వినలేదు.. మాపై అంత నమ్మకం ఆయనకు. ఇండస్ట్రీలో నాకు గురువు ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ). అయితే ప్రతి దర్శకుడితో స్నేహం ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి: స్టూడెంట్స్‌గా హీరోలు.. బాక్సాఫీస్ వద్ద పరీక్షలు సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు
సమ్మర్ హాలీడేస్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో పిల్లలు, యువత పుస్తకాలు తిరిగేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల సందడి తగ్గినట్లే కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పోటీపడలేక వాయిదాపడ్డ చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అంటూ బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ఈ క్రమంలో జూన్ నాలుగో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో ఓ లుక్కేయండి.. కొండా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం కొండా. కొండా మురళి- సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకుంది. సురేఖ పాత్రలో ఇర్రా మోర్, మురళి పాత్రలో త్రిగుణ్ నటించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. సమ్మతమే తన ప్రతి సినిమాకు తెలుగు టైటిల్స్‌నే పెట్టుకుంటూ వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగా సమ్మతమే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. గోపీనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి కథానాయిక. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. జూన్ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చోర్ బజార్ ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం చోర్ బజార్. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గెహాన సిప్పీ హీరోయిన్. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ జూన్ 24న రిలీజ్ కానుంది. 7 డేస్ 6 నైట్స్ తెలుగు చిత్రసీమకు ఎన్నో హిట్స్ అందించారు దర్శకనిర్మాత ఎంఎస్ రాజు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 7 డేస్ 6 నైట్స్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తుండగా మెహర్ చాహల్ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 24న రిలీజ్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ గంగరాజు లక్ష్ చదలవాడ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. వేదిక దత్ కథానాయిక. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. సదా నన్ను నడిపే లంకా ప్రతీక్ ప్రేమ్ హీరోగా వైష్ణవి పట్వర్దన్ హీరోయిన్గా నటించిన చిత్రం సదా నన్ను నడిపే. ఈ సినిమాకు హీరో ప్రతీకే దర్శకుడు కావడం విశేషం. జూన్ 24న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనుంది. ఇవే కాకుండా సాఫ్ట్వేర్ బ్లూస్, కరణ్ అర్జున్ సహా తదితర సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... అమెజాన్ ప్రైమ్ సర్కారువారి పాట - జూన్ 23 ఆహా మన్మథ లీల - జూన్ 24 సోనీ లివ్ నెంజుక్కు నీది (తమిళ్) - జూన్ 23 అవరోధ్ (హిందీ వెబ్ సిరీస్) - జూన్ 24 నెట్‌ఫ్లిక్స్ లవ్ అండ్ గెలాటో - జూన్ 22 మ్యాన్ వర్సెస్ బీ - జూన్ 24 కుట్టవుమ్ శిక్షాయుమ్ (మలయాళం) - జూన్ 24 గ్లామర్ గాళ్స్ - జూన్ 24 మనీ హెయిస్ట్ (కొరియన్)- జూన్ 24 హాట్‌స్టార్ డాక్టర్ స్ట్రేంజ్ - జూన్ 22 జీ5 ఫోరెన్సిక్ - జూన్ 24 చదవండి: హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు ‘విరాట పర్వం’ మూవీపై ప్రముఖ తమిళ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ -
హైదరాబాద్‌లో అది 400 ఏళ్లుగా ఉంది: నిర్మాత
Producer VS Raju About Akash Puri Chor Bazaar Movie: ‘‘హైదరాబాద్‌లో దాదాపు 400 సంవత్సరాలుగా ‘చోర్ బజార్’ ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ చోరీ చేసిన వస్తువులను అక్కడ విక్రయిస్తారని అంటుంటారు. ‘చోర్ బజార్’ సినిమాతో ఆకాష్‌కు మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత వీఎస్ రాజు అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘నాది భీమవరం. సినిమాలపై ఆసక్తితో రామ్‌గోపాల్ వర్మ ‘రక్ష’ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పని చేశాను. ‘గుండెల్లో గోదారి, జోరు...’ఇలా ఏడెనిమిది చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ‘రక్ష’ సమయంలోనే జీవన్ రెడ్డితో నాకు పరిచయం ఏర్పడింది. నేను దర్శకత్వ విభాగంలో పనిచేసినా ఈ సినిమా విషయంలో ప్రొడక్షన్ మాత్రమే చూసుకున్నాను. రాత్రి జరిగే కథ ఇది. హీరోయిన్ పాత్రను మూగగా ఎందుకు చూపించాం? అనేది ఆసక్తిగా ఉంటుంది. పృథ్వీ ఫైట్స్ బాగా డిజైన్ చేశాడు. సురేష్ బొబ్బిలి సంగీతం అదనపు ఆకర్షణ. మా జర్నీలో యూవీ క్రియేషన్స్ సంస్థ కలవడం మాకు మరింత ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
ఆకాశ్ పూరీ ‘చోర్ బజార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించాడు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటు మంచి హిట్ అయ్యాయి. ఇక బాలకృష్ణ ఇటీవల విడుదల ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో చోర్ బజార్ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. చదవండి: పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్ ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ నెల్ 24వ తేదీన సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా.. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్ -
చోర్ బజార్: మూగ అమ్మాయితో లవ్‌లో పడ్డ హీరో
ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించాడు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. 'నా పేరు బచ్చన్.. బచ్చన్ సాబ్.. దునియాల ప్రతివోనికీ ఏదో ఒక దూల ఉంటది. నాకు నా చేయి దూల' అంటూ ఆకాష్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. హీరోయిన్ మూగ అమ్మాయిగా నటించినట్లు తెలుస్తోంది. ఇక డైమండ్ ఎలాగైనా మ్యూజియంలో ఉండాలన్న సునీల్ మాటలను బట్టి దాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అసలీ డైమండ్ గోల తెలియాలన్నా, హీరో ప్రేమ గెలిచిందా? లేదా? అన్నది చూడాలన్నా సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్ వర్మ. చదవండి: ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ నాన్న సినిమా చేద్దామంటే కుదరదని చెప్పేశా: ఆకాశ్ పూరి -
సమంత చేతుల మీదుగా నూనుగు మీసాల సాంగ్ రిలీజ్
ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ కథానాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న "చోర్ బజార్" నుంచి సాంగ్స్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రంలోని 'నూనుగు మీసాల' లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు. హీరోయిన్ పాడుకునే సోలో సాంగ్ ఇది. ప్రియుడు తనను ఎలా ఆకర్షించాడు, అతని గురించి తానెంతగా ఎదురుచూస్తుందో ఈ పాట ద్వారా చెబుతుంది. "నూనుగు మీసాల పోరడు చూడు ఎదురుసూరీడే, నామీద నజర్ ఏసిండే, రంగుల డబ్బాల గుండెను ముంచి ఎత్తుకపోయిండే, వాని గుండెల్ల దాచిండే, వాని బొమ్మ గీసి, మాటా ముచ్చట చెప్పుకున్న గాలిలో, వాణ్ని చేరితే చాలయ్యో, మళ్లొస్తడాని బాట మీద కూసోనున్న ఎవరన్నా జెర చెప్పిపోండయ్యో" అంటూ సాగుతుందీ పాట. ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపర్చగా...కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. లక్ష్మీ మేఘన పాడారు. భాను కొరియోగ్రఫీ చేశారు. Noonugu Meesala from #ChorBazaar will make you fall in love ❤️https://t.co/BX2S8TrBSx All the best to team Chorbazaar 👍@ActorAkashPuri @gehna_sippy @GeorgeReddyG1 @VSRajuOfficial @IVProductions_ @sureshvarmaz @DopJagadeesh @sureshbobbili9 @GskMedia_PR @LahariMusic — Samantha (@Samanthaprabhu2) June 3, 2022 చదవండి: జవాన్ మూవీ.. మాస్ లుక్‌లో షారుక్ ఖాన్ బిగ్‌బాస్ 6లోకి సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్! -
'మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె'.. చోర్ బజార్ సాంగ్ విన్నారా?
Hero RAM Launched Akash Puri Movie Title Song: ఆకాశ్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. ‘దళం, జార్జ్ రెడ్డి’ చిత్రాల ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను హీరో రామ్ పోతినేని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్ చాలా ట్రెండీగా ఉంది, గల్లీ బాయ్స్ పాటలా అనిపించింది. ఈ సినిమాతో ఆకాశ్ హిట్ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు. ‘మీకు దిల్ ఉన్నోళ్ల కథ చెప్పాలె.. దిల్ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె.. ఇది చోర్ బజార్... ఆజా చోర్ బజార్..’ అంటూ సాగే ఈ పాటకు నవాబ్ గండ్, అసురన్ టీమ్ సంగీతం, ర్యాప్ అందించి, పాడారు. ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మా సినిమా త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్ వర్మ.