‘‘బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ఉంది. ఓ బిగ్ హిట్ కోసం మరింత ఏకాగ్రతతో కష్టపడి పని చేస్తున్నాను. ‘చోర్ బజార్’ హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఆకాష్ పూరి. జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాష్ పూరి చెప్పిన విశేషాలు.
చదవండి: హెల్త్‌అప్‌డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు
⇔ ఈ సినిమాలో నేను బచ్చన్ సాబ్ అనే పాత్రలో కనిపిస్తాను. టైర్లను దొంగతనం చేయడం నా పని. దొంగతనాలు చేసి పేదవారికి సాయం చేస్తుంటాడు. సో... వారి దృష్టిలో బచ్చన్ సాబ్ హీరో. ‘చోర్ బజార్’ అనగానే అందరూ దొంగలు, క్రిమినల్స్ గురించే ఆలోచిస్తుంటారు. కానీ అక్కడ కూడా కుటుంబాలు, ఎమోషన్స్ ఉంటాయి. వీటినే మా ‘చోర్ బజార్’ సినిమాలో చూపించాం. నా కెరీర్‌లో డిఫరెంట్ అండ్ మంచి స్టైలిష్ యాక్షన్ డ్రామా ఇది. జీవన్‌రెడ్డిగారు కథ వినిపించినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా యాక్టర్‌గా నా ఇమేజ్‌ను పెంచుతుందనుకుంటున్నాను.
చదవండి: ఓటీటీకి అంటే సుందరానికి, స్ట్రీమింగ్ డేట్, టైం ఫిక్స్.. ఎక్కడంటే!
⇔ నాన్నగారు (పూరి జగన్నాథ్) ఇంకా ‘చోర్ బజార్’ చూడలేదు. కానీ ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. నా ప్రతి సినిమా కథను నాన్నకి వినిపించి ఆయన్ను డిస్ట్రబ్ చేయాలనుకోను. ‘సొంత నిర్ణయాలు తీసుకో.. నీ గట్ ఫీలింగ్‌పై వెళ్లు’ అని నాన్న చెబుతుంటారు. నా గత చిత్రం ‘రొమాంటిక్’ ప్రమోషన్‌లో నేను హీరోగా సక్సెస్ అయి నాన్న పేరు నిలబెడతానని కాలర్ ఎగరేశాను. కానీ అది ఒక సినిమాతో జరిగే పని కాదు. కొంత జర్నీ సాగాలి. ఇక నేను కొత్తగా మూడు సినిమాలు కమిటయ్యాను.
Comments
Please login to add a commentAdd a comment