Akash Puri Chor Bazaar Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Chor Bazaar Release Date: ‘చోర్‌ బజార్‌’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఎప్పుడంటే

Published Mon, Jun 13 2022 6:25 PM | Last Updated on Mon, Jun 13 2022 6:43 PM

Akash Puri Chor Bazaar Movie Releasing On June 24th - Sakshi

ఆకాశ్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘చోర్‌ బజార్‌’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో వీఎస్‌ రాజు నిర్మించాడు. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటు మంచి హిట్‌ అయ్యాయి. ఇక బాలకృష్ణ ఇటీవల విడుదల ఈ మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో చోర్‌ బజార్‌ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

చదవండి: పోస్ట్‌ వెడ్డింగ్‌ అంటూ ఫొటోలు షేర్‌ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్‌

ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ఈ నెల్‌ 24వ తేదీన సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కాగా ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించగా.. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు.

చదవండి: విజయ్‌, రష్మికల షూటింగ్‌ ఫొటోలు లీక్‌.. డైరెక్టర్‌ అప్‌సెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement