Hero RAM Launched: Akash Puri Chor Bazaar Title Song Out Now - Sakshi
Sakshi News home page

Chor Bazaar: ఈ సినిమాతో ఆకాశ్‌ హిట్‌ కొడతాడు: హీరో రామ్‌

Published Sat, Feb 19 2022 10:59 AM | Last Updated on Sat, Feb 19 2022 11:29 AM

Akash Puri Chor Bazaar Title Song Out Now - Sakshi

Hero RAM Launched Akash Puri Movie Title Song: ఆకాశ్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో వీఎస్‌ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను హీరో రామ్‌ పోతినేని విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చోర్‌ బజార్‌’ టైటిల్‌ సాంగ్‌ చాలా ట్రెండీగా ఉంది, గల్లీ బాయ్స్‌ పాటలా అనిపించింది. ఈ సినిమాతో ఆకాశ్‌ హిట్‌ కొడతాడని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు.

‘మీకు దిల్‌ ఉన్నోళ్ల కథ చెప్పాలె.. దిల్‌ నిండా దమ్మున్నోళ్ల కథ చెప్పాలె.. ఇది చోర్‌ బజార్‌... ఆజా చోర్‌ బజార్‌..’ అంటూ సాగే ఈ పాటకు నవాబ్‌ గండ్, అసురన్‌ టీమ్‌ సంగీతం, ర్యాప్‌ అందించి, పాడారు. ‘‘లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మా సినిమా త్వరలో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ చీకటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, సహనిర్మాత: అల్లూరి సురేష్‌ వర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement