మాస్ట‌ర్ అవుట్‌: మెహ‌బూబ్‌కు కెప్టెన్సీ, కానీ! | Bigg Boss 4 Telugu: Evicted Amma Rajasekhar Give Captaincy To Mehboob | Sakshi
Sakshi News home page

నీ కాళ్లు ప‌ట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా

Published Sun, Nov 8 2020 11:22 PM | Last Updated on Mon, Nov 9 2020 2:49 PM

Bigg Boss 4 Telugu: Evicted Amma Rajasekhar Give Captaincy To Mehboob - Sakshi

ఈసారి ప్రేక్ష‌కుల అంచ‌నా మిస్స‌వ‌లేదు. త‌న చేష్ట‌ల‌తో ఇంటి స‌భ్యుల‌ను బెంబేలెత్తించిన అమ్మ రాజ‌‌శేఖ‌ర్ బిగ్‌బాస్ హౌస్ నుంచి తొమ్మిదో వారం ఎలిమినేట్ అయ్యాడు. మ‌రోవైపు సుమ స్పెష‌ల్ గెస్ట్‌గా రావ‌డంతో శ‌నివారం రావాల్సిన దీపావ‌ళి వారం రోజుల ముందే వ‌చ్చిన‌ట్లైంది. స్టేజీ పైకి వ‌స్తూనే న‌వ్వుల బాణాల‌ను వదిలింది. అంద‌రినీ ఇరిటేట్ చేసే అరియానాను ఇమిటేట్ చేస్తూ, ప్ర‌తి ఒక్క‌రి మీదా జోకులు పేల్చే అవినాష్ మీద కామెడీ చేస్తూ కంటెస్టెంట్ల‌ను మారు మాట్లాడ‌నీయ‌కుండా చేసింది. మ‌రి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో తెలుసుకోవాల‌నుందా? అయితే వెంట‌నే ఈ స్టోరీ చ‌దివేసేయండి..

అఖిల్‌కు మోనాల్ చాక్లెట్లు, మ‌రి ఆమెకు?
దీపావ‌ళి సంద‌ర్భంగా ఇంటిస‌భ్యుల‌కు బ‌హుమ‌తులు వ‌చ్చాయ‌ని, వాటిని అందుకోవాలంటే కొన్ని చాలెంజ్‌లు పూర్తి చేయాల‌ని నాగార్జున తెలిపారు. మొద‌ట‌ సోహైల్ కోసం మెహ‌బూబ్ నేల మీద బౌల్‌లో ఉన్న‌ బిస్కెట్ల‌ను చేయితో ప‌ట్టుకోకుండా తినేశాడు. దీంతో సోహైల్‌కు త‌ను పంపిన బ్రేస్‌లెట్ గిఫ్ట్‌ను మెహ‌బూబ్ తొడిగాడు. త‌ర్వాత అఖిల్ కోసం అభిజిత్.. త‌ల మీద బుట్ట‌లో బంతులు వేసే ఆట ఆడాడు. దీంతో అఖిల్ గిఫ్ట్ ఓపెన్ చేయ‌గా మోనాల్ పంపించిన చాక్లెట్లు క‌నిపించాయి. అనంత‌రం అభిజిత్ కోసం అఖిల్‌ సోడాబుడ్డి క‌ళ్ళ‌ద్దాలు పెట్టుకుని బంతులు వేరు చేసే గేమ్ ఆడాడు. కానీ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో అభికి వ‌చ్చిన గిఫ్ట్ వెన‌క్కు వెళ్లిపోయింది. (చ‌ద‌వండి: మోనాల్ మాత్రం కోడ‌లిగా రాదు: అఖిల్ త‌ల్లి)

మాస్ట‌ర్‌కు, మోనాల్‌కు గిఫ్టులు పంపిన నాగ్‌
లాస్య కోసం హారిక న‌డుముకు టిష్యూ బాక్స్ క‌ట్టుకుని గెంతుతూ, అందులో నుంచి 20 బంతులు బ‌య‌ట ప‌డేలా చేయాల్సి ఉంటుంది. కానీ ఓడిపోవ‌డంతో లాస్య‌ బ‌హుమ‌తి పోగొట్టుకుంది.. మెహ‌బూబ్ కోసం అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ జ‌డ వేయించుకున్నారు. దీంతో మెహ‌బూబ్‌కు సోహైల్ కాఫీ క‌ప్పును అందించాడు. త‌ర్వాత అవినాష్ కోసం మాస్ట‌ర్, అరియానా కోసం మెహ‌బూబ్ గేమ్ ఆడారు. కానీ ఓడిపోవ‌డంతో వాళ్ల గిఫ్ట్ కూడా చేజారిపోయింది. హారిక కోసం.. అభిజిత్, లాస్య‌ బంతుల టాస్కు ఆడి గెలిచారు. దీంతో హారిక‌కు అభి నువ్వుండ‌లు, లాస్య డ్రెస్ పంపించింది. మిగిలిన‌ మోనాల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు ఎవ‌రూ గిఫ్టులు పంప‌కపోవ‌డంతో తానిస్తాన‌ని నాగ్ స్వ‌యంగా ముందుకొచ్చారు. మాస్ట‌ర్‌కు చేప‌ల కూర‌, మోనాల్‌కు అహ్మ‌దాబాద్ నుంచి స్వీట్లు తెప్పించారు. (చ‌ద‌వండి: నా గురించి మాట్లాడ‌కు అరియానా: అవినాష్‌ ఫైర్‌)

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ప్రాంక్‌
త‌ర్వాత సుమను సూప‌ర్‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని లోప‌ల‌కు ఆహ్వానించారు. కానీ అదంతా ప్రాంక్ అని కొన్ని క్ష‌ణాల్లోనే తేలిపోయింది. అయితే సుమ‌ కంటెస్టెంట్ల‌తో స‌హా నాగార్జున మీద కూడా పంచులు విస‌ర‌డం గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత ఇంటిస‌భ్యుల కోసం తెచ్చిన వ‌స్తువుల చిట్టాను ఏక‌రువు పెట్టింది. మోనాల్‌కు టిష్యూలు, అరియానాకు లాలీపాప్‌, లాస్య‌కు తెలుగు జోక్స్ పుస్త‌కం తెచ్చింది. దీంతో లాస్య జలుబు ముక్కుకే ఎందుకు చేస్తుంద‌ని ప్ర‌శ్నించింది. ఈ జోకును ప‌ట్టేసిన సుమ‌.. ఐస్ మ‌ధ్య‌లో ఉంటుంద‌ని జ‌వాబిచ్చింది. ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డం లేద‌ని అభితో గెంతులు వేయించింది. హారిక‌తో తెలుగు టంగ్ ట్విస్ట‌ర్‌, అవినాష్‌తో ఇంగ్లీష్ టంగ్ ట్విస్ట‌ర్ చెప్పించేందుకు ప్ర‌య‌త్నించింది కానీ వారి వ‌ల్ల కాలేదు. (చ‌ద‌వండి: రాజీవ్‌పై సుమ ఎమోషనల్‌ ట్వీట్‌.. వైరల్)

అవినాష్‌ నీ కాళ్లు ప‌ట్టుకుంటా..
త‌ర్వాత‌ అవినాష్‌కు బిస్కెట్లు, మాస్ట‌ర్‌కు ఫ‌స్ట్ ఎయిడ్ కిట్ తెచ్చాన‌ని చెప్తూ, అఖిల్‌కు ల‌వ్ లెట‌ర్ రాసేందుకు పెన్నూ పేప‌ర్ తేవ‌డం మ‌ర్చిపోయిన‌ట్లు తెలిపింది. అయితే ఆమె కోరిక మేర‌కు అఖిల్.. ఏమైపోయావే... అని పాట పాడి అంద‌రినీ బుట్ట‌లో వేసుకున్నాడు. నీకోసం ఎవ‌రైనా పాడారా? అని నాగ్ లాస్య‌ను అడ‌గ్గా.. పాడారు క‌నుకే రెండు జోల పాట‌లు పాడాన‌ని పంచ్ విసిరింది. ఇక హౌస్‌లోకి వెళ్ల‌మ‌న‌గానే గంగ‌వ్వ వ‌య‌సొచ్చాక వెళ్తానంటూ షో నుంచి జారుకుంది. అనంత‌రం మోనాల్ సేఫ్ అయిన‌ట్లు నాగ్ ప్ర‌క‌టించారు. దీంతో మాస్ట‌ర్‌, అవినాష్ డేంజ‌ర్ జోన్‌లో ప‌డ్డారు. పొర‌పాటున అవినాష్ వెళ్లిపోతాడేమోన‌ని అరియానా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఏం జ‌రిగినా నువ్వు ఎలాంటి అఘాయిత్యానికి పాల్ప‌డ‌వ‌ద్ద‌ని మ‌ద‌ర్ ప్రామిస్ వేయించుకుంది. 'నీ కాళ్లు ప‌ట్టుకుంటా, నాకోసం ఎదురు చూడు, నువ్వు బ‌తికుంటే చాలు' అంటూ ఎమోష‌న‌ల్ అయింది.

అభిజిత్ విల‌న్‌: అమ్మ రాజ‌శేఖ‌ర్‌‌
ఇంత‌లో డ‌బుల్ ఎలిమినేష‌న్‌కు ఛాన్స్ ఉందని చెప్ప‌డంతో అరియానా షాక్ తింది. కానీ అలాంటిదేమీ లేద‌ని కొన్ని క్ష‌ణాల్లోనే తేలిపోయింది. ఇక అవినాష్ సేఫ్ అయ్యాడు కానీ గుండాగినంత ప‌నైంది అని భోరున‌ ఏడ్చాడు. "మ‌ళ్లీ జీరోకు వ‌చ్చాను, బిగ్‌బాస్ వ‌ల్లే నాకు మ‌ళ్లీ లైఫ్ వ‌చ్చింది" అని చెప్పుకొచ్చాడు. అమ్మ రాజ‌శేఖ‌ర్‌ ఎలిమినేట్ అవ‌గా అత‌నితో గేమ్‌ ఆడించాడు. అందులో భాగంగా సోహైల్‌, లాస్య‌, అరియానా, మోనాల్, మెహ‌బూబ్, అవినాష్‌.. అస‌లు అని, అఖిల్‌ను హీరో అంటూ, అభిజిత్‌ను విల‌న్ అంటూ ఈ ఇద్ద‌రూ న‌కిలీ మ‌నుషులు అని తేల్చి చెప్పాడు. హారిక‌ను కూడా ఈ న‌కిలీ జాబితాలోనే చేర్చాడు. త‌న కెప్టెన్సీని మెహ‌బూబ్‌కు ఇచ్చేశాడు. అయితే ఇమ్యూనిటీ మాత్రం ల‌భించింద‌ని నాగ్ స్ప‌ష్టం చేశారు. బిగ్‌బాంబ్ లేక‌పోవ‌డం ఇంటిస‌భ్యుల‌కు ఊర‌ట క‌లిగించింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: నాగ్‌ వెనుక స్టైలిష్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement