బుల్లితెరపై సందడి చేయడానికి బిగ్‌బాస్ 4 రెడీ అయింది. ఇక మిగిలింది కొన్ని గంటలు మాత్రమే. అల్రెడీ ఓపెనింగ్ డే షూటింగ్ కూడా పూర్తయిందట. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌లకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈసారి హౌస్‌లోకి ఇద్దరు డైరెక్టర్స్ ఎంట్రీ ఇచ్చేశారనేదే ఆ వార్త సారాంశం. వారిలో ఒకరు అమ్మ రాజశేఖర్, కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దర్శకుడుగా మారిన టెక్నీషి యన్. గోపిచంద్ రణం, రవితేజ ఖతర్నాక్, నితిన్ టక్కరి చిత్రాలకు దర్శకత్వం వహించారు అమ్మ రాజశేఖర్. ఆన్‌స్క్రీన్ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్ స్క్రీన్ మీద కూడా పాపులర్ అయ్యారు. మరి బిగ్‌బాస్ హౌజ్‌లో ఎలాంటి వివాదాలు సృష్టించి పాపులర్ అవుతారో చూడాలి.
(చదవండి : బిగ్‌బాస్-4: 15 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!)
ఇక బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్‌లో ఉన్న మరో దర్శకుడు సూర్యకిరణ్. తెలుగులో తొలి చిత్రం సత్యంతోనే మంచి హిట్ అందుకున్నారు. హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన ఖాళీగా ఉంటున్నారు. మరి బిగ్‌బాస్‌తో సూర్యకిరణ్ లైఫ్ టర్న్ అవుతుందో చూడాలి. ఇక పోతే బిగ్‌బాస్ హోస్‌లోకి వెళ్లాక ఎవరి వ్యూహాలు వారికుంటాయి. ఎవరి లెక్కలు వారికుంటాయి. ఎవరినీ ఎవరూ డైరెక్ట్ చేయనక్కర్లేదు. మరి ఈ ఇద్దరి దర్శకత్వ ప్రతిభకి మిగిలిన కంటెస్టెంట్స్ దొరికి పోతారా ? లేదా అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరోవైపు ఈ బిగ్‌బాస్‌లో వీరితో పాటు దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్), దేవి నాగవల్లి (యాంకర్), గంగవ్వ (యూట్యూబ్ స్టార్), ముక్కు అవినాష్ (జబర్దస్త్ ఫేం), మోనాల్ గుజ్జార్ (హీరోయిన్) కరాటే కళ్యాణి (నటి), నోయల్(సింగర్), లాస్య (యాంకర్), జోర్దార్ సుజాత (యాంకర్), తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం ఫేమ్), సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు),అరియానా గ్లోరీ (యాంకర్, జెమిని కెవ్వు కామెడీ యాంకర్), మెహబూబా దిల్ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్) కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment