
– అమ్మ రాజశేఖర్
‘‘మన శరీరానికి తల ఎంత ముఖ్యమో... నాకు ఈ ‘తల’ సినిమా కూడా అంతే ముఖ్యం. డ్యాన్స్ మాస్టర్‌గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరిగారిని నేను దేవుడిలా భావిస్తాను. ఆయన నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అని డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తెలిపారు. అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు.
ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలానే ఉంటాను. ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఎస్తేర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ‘తల’లో నా పాత్ర ఉంటుంది’’ అని చె΄్పారు.
Comments
Please login to add a commentAdd a comment