RB Chaudhary
-
నాకు తల చాలా ముఖ్యం
‘‘మన శరీరానికి తల ఎంత ముఖ్యమో... నాకు ఈ ‘తల’ సినిమా కూడా అంతే ముఖ్యం. డ్యాన్స్ మాస్టర్‌గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరిగారిని నేను దేవుడిలా భావిస్తాను. ఆయన నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అని డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తెలిపారు. అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలానే ఉంటాను. ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఎస్తేర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ‘తల’లో నా పాత్ర ఉంటుంది’’ అని చె΄్పారు. -
'చెప్పాలని ఉంది' మూవీ రివ్యూ
టైటిల్: చెప్పాలని ఉంది (ఒక మాతృభాష కథ) నటీనటులు: యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య, పృథ్వీరాజ్, తనికెళ్ల భరణి, అలీ, రాజీవ్ కనకాల, మురళి శర్మ, రఘుబాబు, సునీల్ నిర్మాణ సంస్థలు: సూపర్ గుడ్ ఫిల్మ్స్, హ్యామ్స్టెక్ ఫిల్మ్స్ నిర్మాత: ఆర్బీ చౌదరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అరుణ్ భారతి ఎల్ సంగీతం: అస్లాం కేయి విడుదల తేదీ: డిసెంబర్ 09, 2022 యశ్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటించిన చిత్రం 'చెప్పాలని ఉంది'. ఒక మాతృభాష కథ అనేది ఉపశీర్షిక. సూపర్ గుడ్ ఫిల్మ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి అరుణ్ భారతి దర్శకత్వ వహించగా.. ఆర్బీ చౌదరి నిర్మించారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. ఈ సినిమాలో హీరో యశ్ పూరి(చందు) ఓ టీవీ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. మాతృభాష అంటే చిన్నప్పటి నుంచి హీరోకు విపరీతమైన అభిమానం. కుటుంబం కోసం రిపోర్టింగ్‌తో పాటు బైక్ ట్యాక్సీ నడుపుతుంటాడు. అదే సమయంలో స్టెఫీ పటేల్(వెన్నెల) పరిచయమవుతుంది. హీరో ఆటిట్యూడ్ నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. ఓ రోజు చందు బైక్‌పై వెళ్తుంటే యాక్సిడెంట్‌కు గురవుతారు. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? చివరికి ఈ కథలో హీరో తన ప్రేమను గెలిచారా? యాక్సిడెంట్ తర్వాత కథ ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి. మాతృభాష విషయంలో డైరెక్టర్ చేసిన ప్రయత్నం ఫలించిందా? అన్నది సినిమాలో చూడాల్సిందే. ఎలా ఉందంటే... సినిమా ప్రారంభం నుంచి హీరో యశ్ పూరి(చందు) పనిచేసే టీవీ ఛానెల్ చుట్టే తిరుగుతుంది. టీఆర్పీ రేటింగ్ కోసం వాళ్లు పడే కష్టాలను సినిమాలో చూపించారు. ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీ, సత్య మధ్య కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. రిపోర్టింగ్ చేస్తూనే ఇంటి నుంచి తప్పిపోయిన చిన్న పిల్లలను సేవ్ చేయడం, అదే సమయంలో హీరోకు స్టేఫీ పటేల్ (వెన్నెల)తో పరిచయం తర్వాత కథ మలుపులు తిరుగుతుంది. ఏ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వని సత్యమూర్తి(మురళి శర్మ)ను చందు ఒప్పిస్తాడు. ఆ తర్వాత హీరోకు యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాతే జరిగే కథే సినిమాలో అసలైన ట్విస్ట్.ఆ ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సెకండాఫ్‌లో కథ మొత్తం హీరో మాట్లాడే భాష చుట్టే తిరుగుతుంది. ఎవరికీ అర్థం కానీ భాషలో మాట్లాడే హీరోను చూసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు. అసలు అతను మాట్లాడేది భాషేనా? లేక మానసిక వ్యాధినా? అనే విషయం చుట్టే సెకండాఫ్‌లో హైలెట్. ఆ విషయాన్ని తేల్చుకునేందుకు హీరోయిన్ వెన్నెల హిమాలయాలకు వెళ్లడం, రాజీవ్ కనకాల(డాక్టర్ కేశవ్), సత్య చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు అంతరించిన పోయిన భాష చుట్టే కథ మొత్తం నడిపించాడు. సినిమా మధ్యలో సునీల్ ఎంట్రీ, బాబాగా అలీ పాత్రలు అదనపు బలం. ఈ సినిమాలో ఒక్కమాటలో చెప్పాలంటే 'పరాయి భాషని గౌరవిద్దాం,.. మాతృభాషని ప్రేమిద్దాం' అనేలా ఉంది. తెలుగు భాషను కాపాడుకుందాం అనే సందేశాన్నిచ్చారు దర్శకుడు. ఎవరెలా చేశారంటే... రిపోర్టర్ పాత్రలో హీరో చందు ఆకట్టుకున్నాడు. అర్థం కానీ భాషను అవలీలగా మాట్లాడి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల పాత్రలో హీరోయిన్ స్టెఫీ పటేల్ మెప్పించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పృథ్వి, సత్య కామెడీ పాత్రలకు తగిన న్యాయం చేశారు. విలన్ పాత్రలో ఎమ్మెల్యే రామకృష్ణగా రఘు బాబు సత్యమూర్తిగా మురళి శర్మ, డాక్టర్ కేశవ్‌గా రాజీవ్ కనకాల, హీరోయిన్ తండ్రిగా తనికెళ్ల భరణి తమ నటనతో మెప్పించారు. అలీ, సునీల్ అతిథి పాత్రల్లో కనిపించి సందడి చేశారు. అస్లాం కేయి సంగీతం ఫరవాలేదు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఒక మాతృభాష కథ
‘‘సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం. ఇప్పుడు ‘చెప్పాలని ఉంది’ తో యష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. యూనిక్ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నిర్మాత ఆర్బీ చౌదరి అన్నారు. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రల్లో అరుణ్ భారతి ఎల్.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. ఆర్బీ చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలలో ఆర్బీ చౌదరి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే తీశాం. ఆ తర్వాత తమిళ్‌తో పాటు మిగతా భాషల్లో రీమేక్ చేస్తాం’’ అన్నారు. ‘‘యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాలున్న చిత్రమిది’’ అన్నారు యష్ పూరి. ‘‘ఈ సినిమా చూశాను.. చాలా బాగుంది’’ అన్నారు నిర్మాత వాకాడ అప్పారావు. ‘‘చెప్పాలని ఉంది’ కి ప్రేక్షకుల సహకారం ఇవ్వాలి’’ అన్నారు అరుణ్ భారతి. ఈ వేడుకలో హమ్స్ టెక్ ఫిలిమ్స్ యోగేష్, మాటల రచయిత విజయ్ చిట్నీడి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్పీ డీఎఫ్టీ, సంగీతం: అస్లాంకీ. -
విశాల్ ఫిర్యాదు బాధించింది: నిర్మాత ఎమోషనల్
నటుడు విశాల్ తనపై చేసిన ఫిర్యాదు ఎంతో బాధించిందని ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్.బి.చౌదరిపై స్థానిక టి.నగర్ పోలీసుస్టేషన్లో విశాల్ ఫిర్యాదు చేశారు. దీంతో విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరిలను వివరణ కోరుతూ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా విశాల్ ఫిర్యాదుపై నిర్మాత ఆర్.బి.చౌదరి స్పందించారు. విశాల్ తన నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఆయన ఇచ్చిన హామీ పత్రాలు, చెక్కులు దర్శకుడు శివకుమార్ వద్ద భద్రపరిచినట్లు చెప్పారు. ఆయన హఠాత్తుగా మరణించడంతో ఆ పత్రాలు కనిపించలేదని తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా విశాల్ తనపై ఫిర్యాదు చేసి ఉంటారని అన్నారు. అయితే ఈ విషయమై ఆయన తనతో మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ఇన్నేళ్ల తన సినీ జీవితంలో ఇలాంటి ఫిర్యాదును తాను ఎదుర్కోలేదన్నారు. విశాల్ చేసిన ఫిర్యాదు తనను ఎంతగానో బాధించిందన్నారు. విశాల్‌కు సంబంధించిన చెక్కులు, హామీ పత్రాలను శివకుమార్ ఎవరికైనా ఇచ్చివుంటే వాటిని తనకు లేదా విశాల్‌కు గాని, లేదా పోలీసులుకు అందించాలని విజ్ఞప్తి చేశారు. దుర్వినియోగం చేయాలని భావిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: దొంగతనం కేసులో ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్ యాక్టర్స్ అరెస్టు -
హీరో విశాల్, ఆర్బీ చౌదరికి సమన్లు
నటుడు విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరిలకు పోలీసులు శనివారం సమన్లు జారీ చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్బీ చౌదరిపై స్థానిక టి.నగర్ పోలీసుస్టేషన్లో విశాల్ ఫిర్యాదు చేశారు. తాను కథానాయకుడిగా నటించి నిర్మించిన ఇరుంబు తిరై చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత ఆర్.బి.చౌదరి నుంచి కొంత రుణం తీసుకున్నానని తెలిపారు. ఆయనకు డాక్యుమెంట్లు, చెక్కులను అందించినట్లు చెప్పారు. నగదు తిరిగి చెల్లించినా డాక్యుమెంట్లు, చెక్కులను ఇవ్వలేదని ఆరోపించారు. అడిగితే అవి మిస్ అయ్యాయని బదులిచ్చారన్నారు. విశాల్ ఆరోపణలపై స్పందించిన నిర్మాత ఆర్.బి.చౌదరి.. విశాల్ తనతో పాటు తిరుపూర్ సుబ్రమణ్యం వద్ద అప్పు తీసుకున్నారన్నారు. ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్, చెక్కుల వ్యవహారాలను ఆయుధ పూజ చిత్ర దర్శకుడు శివకుమార్ చూసుకునేవారన్నారు. ఇటీవల శివకుమార్ గుండెపోటుతో మరణించడంతో ఆయన భద్రపరచిన డాక్యుమెంట్లను తాము గుర్తించలేకపోయామన్నారు. విశాల్ అప్పు చెల్లించేశాడని..అయితే పత్రాలు లేకపోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని విశాల్ భయపడుతున్నారని ఆర్బీ చౌదరి వివరణ ఇచ్చారు. విశాల్ ఫిర్యాదు మేరకు టీ.నగర్ పోలీసులు స్టేషన్‌కు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నటుడు విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరికి శనివారం సమన్లు జారీ చేశారు. చదవండి: కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ... విక్రమ్ మరో ప్రయోగం.. ‘కోబ్రా’ నయా లుక్ వైరల్ -
ప్రముఖ నిర్మాతపై హీరో విశాల్ ఫిర్యాదు
చెన్నై: సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను తాకట్టు పెట్టాడు. ఇక అప్పు మొత్తం తీర్చినప్పటికీ తన పత్రాలు ఇవ్వకుండా ఆర్బీ చౌదరి తిప్పించుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేస్తూ విశాల్ ఇప్పుడు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. It’s unacceptable that Mr #RBChoudhary failed to return the Cheque Leaves,Bonds & Promissory Notes months after repaying the loan to him for the Movie #IrumbuThirai,he was evading giving excuses & finally told he has misplaced the documents We have lodged a complaint with Police — Vishal (@VishalKOfficial) June 9, 2021 కాగా, ఈ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం విశాల్ ‘ఎనిమీ’, ‘తుప్పరివాలన్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆర్బీ చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ్, మలయాళంలో సినిమాలు తీశాడు. ఆయన కొడుకులు జీవా, జతిన్ రమేశ్ ఇద్దరూ హీరోలే. చదవండి: విశాల్.. భగత్ సింగ్‌ను తలపించావ్ -
చిరంజీవితో సినిమా నా అదృష్టం: దర్శకుడు
మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగులో రీమేక్‌కు రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చేస్తున్న ఈ 153వ సినిమా చిత్రీకరణ బుధవారం ఉదయం ఫిలిం నగర్‌లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ‘ఆచార్య’ వీడియోని షేర్ చేసిన చిరంజీవి) ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. "ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. ఇది మెగాస్టార్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది'' అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ- 'చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు. (చదవండి: గనిగా వరుణ్ తేజ్.. పంచ్ మాములుగా లేదుగా) ఈ చిత్రానికి సమర్పణ : సురేఖ కొణిదెల, సంగీతం : ఎస్ ఎస్ తమన్, కెమెరా : నీరవ్ షా, రచయిత : లక్ష్మి భూపాల్, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, లైన్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు, నిర్మాతలు : ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : మోహన్ రాజా, బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ Megastar @KChiruTweets new film kickstarted with a Pooja today Presented by @KonidelaPro, @MegaaSuperGood1 & NVR Films 🎬 : @jayam_mohanraja 🎥: Nirav Shah 🎼 : @MusicThaman 🎨 : @sureshsrajan ✍️ : #LakshmiBhoopal Regular shoot commences from February 2021. #Chiru153 pic.twitter.com/qEgmv1FZfz — BARaju (@baraju_SuperHit) January 20, 2021 -
‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో
సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. ఆయన తనయులు రమేష్, జీవా తెలుగు, తమిళ భాషల్లో హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 'విద్యార్థి' చిత్రంతో తెలుగులో హీరోగా పరిచయమైన రమేష్ ఆ తర్వాత తమిళంలో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా రమేష్ తెలుగులో నటించిన సినిమా 'ఒకటే లైఫ్'. ఇప్పుడు హీరో రమేష్ 'నిరీక్షణ' చిత్రంలో మొదటిసారిగా మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిరోనక్, ఎనా సహా హీరోహీరోయిన్లుగా టేక్ ఓకే క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ మళ్ళ దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'నిరీక్షణ'. ఈ చిత్రంలో హీరో రమేష్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా శ్రద్ధా దాస్, సన స్పెషల్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్, మధుసూదన్, వేణు, హర్ష తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ పాటలను అందిస్తున్నారు. -
ఆర్బీ చౌదరి ఇంట్లో అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఇంట్లో పనిమనిషి కుమారుడి ఆత్మహత్య సంచలనం కలిగిచింది. ఆయన ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఆనంద్‌కుమార్ తనయుడు, చౌదరి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ కుమార్ కొన్నేళ్లుగా ఆర్బీ చౌదరి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నాడు. ఆయనతో పాటు తన కుమారుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటగదిలో ఆనంద్ కుమార్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు అనంతరం వంటగదిలోకి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆత్మహత్య దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సంగీతమూ అంతే ముఖ్యం
సినిమాకి కథ, కథనం ఎంత ముఖ్యమో సంగీతం, పాటలు కూడా అంతే ముఖ్యం. సంగీతంలో పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చక్కని సాహిత్యం కూడా వినిపించకుండా పోతోందని సాహితీప్రియులు ఆవేదన చెందటం చూస్తున్నాం. అలాంటిది నేను చేసే చిత్రాల్లో అన్ని పాటలు హిట్ అవ్వాలి. పాటలతో పాటు సంగీతం చిత్రానికి ప్లస్ కావాలి అంటున్నారు సంగీత దర్శకుడు సౌందర్యన్. సంగీత దర్శకుడిగా ఈయన అనుభవం రెండున్నర దశాబ్దాలు. ఇప్పటి వరకు చేసింది 42 చిత్రాలు. తొలి చిత్రమే సూపర్ హిట్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఆర్బి చౌదరి నిర్మించిన చేరన్‌పాండియన్. దర్శకుడు కేఎస్ రవికుమార్. ఇందులో పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ఆ తరువాత కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరుసగా ముదల్శీదనం, పుత్తంపుదు పయనం, ముత్తు కుళిక వారియాల్ అంటూ నాలుగు చిత్రాలు చేసిన ఘనత ఈయనదే. సంగీత రంగంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న సౌందర్యన్కు ప్రత్యేకంగా గురువంటూ ఎవరూ లేరట. బికామ్ పట్టభద్రుడయిన ఈయన సంగీతంపై ఆసక్తితో జగదీష్ అనే సంగీత మాస్టారు వద్ద గిటార్ నేర్చుకున్నారు. అలా సంగీత జ్ఞానాన్ని పెంపొందిచుకున్న సౌందర్యన్, దర్శకుడు కేఎస్ రవికుమార్ దష్టిలో పడ్డారు. ఆయన ద్వారా చేరన్‌పాండియన్ చిత్రంతో సంగీతదర్శకులయ్యారు. కుంజుమోన్ నిర్మించిన సింధూనదిపూ వంటి పలు తమిళ చిత్రాలతో పాటు తెలుగు, ఒరియా చిత్రాలకు సంగీతాన్ని అందించడం విశేషం. ఇటీవల ఈయన సంగీతం అందించిన నదిగళ్ ననైవదిలై ్ల చిత్రంలోని పాటలకు సంగీత ప్రియుల ఆదరణతో పాటు పరిశ్రమ నుంచీ ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందంటున్నారు ఈయన. తన 42 చిత్రాలలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినా నదిగళ్ ననైవదిలై ్ల లోని పాటలు తనకు సంతప్తినిచ్చాయన్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వద్ద పని చేయకపోయినా తనకు స్ఫూర్తి ఆయనే అంటున్న సౌందర్యన్ ప్రస్తుతం ఒళిచిత్రం, ననైయాదమళై, ఎన్నంపుదువన్నం తదితర చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాను రూపొందించిన సహస్ర గీతాలు బయట ప్రపంచంలో మారుమ్రోగాలన్నదే తన లక్ష్యం అంటారు ఈయన..