
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి ఇంట్లో పనిమనిషి కుమారుడి ఆత్మహత్య సంచలనం కలిగిచింది. ఆయన ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఆనంద్‌కుమార్ తనయుడు, చౌదరి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ కుమార్ కొన్నేళ్లుగా ఆర్‌బీ చౌదరి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నాడు. ఆయనతో పాటు తన కుమారుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటగదిలో ఆనంద్ కుమార్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు అనంతరం వంటగదిలోకి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆత్మహత్య దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.