తాండూరు రూరల్: ఓ కార్మికుడు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు-రుక్మాపూర్ రైల్వేస్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. తాండూరు మండలం గుంతబాసుపల్లికి చెందిన వెంకటయ్య(49) కరన్‌కోట్ గ్రామ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి ఫ్యాక్టరీ సమీపంలోని క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతడు మానసిక వేధనకు గురవుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం వికారాబాద్‌లోని ఎల్‌ఐసీ కార్యాలయానికి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఆయన ఎంతకూ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా స్పందన లేదు. ఇదిలా ఉండగా, తాండూరు-రుక్మాపూర్ రైల్వేస్టేషన్‌ల మధ్యలో బుధవారం ఉదయం పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడిఉంది. గమనించిన రైల్వే కీమన్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వద్ద ఉన్న ఆధారాల ద్వారా అతడిని వెంకటయ్యగా గుర్తించారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి భార్య మణెమ్మ, ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వెంటకయ్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైలుకింద పడి కార్మికుడి ఆత్మహత్య
Published Wed, Jul 27 2016 6:59 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement