నిర్మాత ఆత్మహత్య.. వీడియోలో సీఎంకు విన్నపం | Producer Kapali Mohan Commits Suicide | Sakshi
Sakshi News home page

నిర్మాత ఆత్మహత్య.. వీడియోలో సీఎంకు విన్నపం

Published Tue, Mar 24 2020 10:40 AM | Last Updated on Tue, Mar 24 2020 10:47 AM

Producer Kapali Mohan Commits Suicide - Sakshi

యశవంతపుర : కన్నడ చిత్ర రంగానికి చెందిన నిర్మాత, పారిశ్రామిక వేత్త మోహన్‌ అలియాస్‌ కపాలి మోహన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గంగమ్మగుడి పోలీసుస్టేషన్‌ పరిధిలోని బసవేశ్వర కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో మోహన్‌ సుప్రీం అనే హోటల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి మోహన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటంఅందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతకు ముందు సదాశివనగరలో నివాసం ఉంటున్న మోహన్‌ తన స్నేహితుడు మంజునాథ్‌తో కలిసి భోజనం చేశాడు.

ఆదివారం అర్ధరాత్రి కొడుతో మాట్లాడారు. కొడుకును ఇంటికి పంపి, మంజునాథ్‌తో కలిసి హోటల్‌కు చేరుకున్నాడు. మంజునాథ్‌ నిద్రలో ఉండగా మోహన్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు వీడియోలో తాను చివరిగా మాట్లాడారు. సీఎం, డీసీఎం లక్ష్మణ సవదికి విన్నపం చేస్తూ తనకు హోటల్లో నష్టం వచ్చిందని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement