చిరంజీవితో సినిమా నా అదృష్టం: దర్శకుడు | Chiranjeevi Lucifer Remake Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

చిరంజీవి 'లూసీఫర్'‌ రీమేక్‌ ప్రారంభం

Published Wed, Jan 20 2021 4:59 PM | Last Updated on Wed, Jan 20 2021 5:57 PM

Chiranjeevi Lucifer Remake Movie Pooja Ceremony - Sakshi

మలయాళ సూపర్‌ హిట్‌ లూసీఫర్‌ తెలుగులో రీమేక్‌కు రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చేస్తున్న ఈ 153వ సినిమా చిత్రీకరణ బుధవారం ఉదయం ఫిలిం నగర్‌లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్  విక్కీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ‘ఆచార్య’ వీడియోని షేర్‌ చేసిన చిరంజీవి)

ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. "ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. ఇది మెగాస్టార్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది'' అన్నారు. ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా మాట్లాడుతూ- 'చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్‌లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్‌లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు. (చదవండి: గనిగా వరుణ్‌ తేజ్‌.. పంచ్‌ మాములుగా లేదుగా)

ఈ చిత్రానికి సమర్పణ : సురేఖ కొణిదెల, సంగీతం : ఎస్ ఎస్ తమన్, కెమెరా : నీరవ్ షా, రచయిత :  లక్ష్మి భూపాల్, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, లైన్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు, నిర్మాతలు : ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : మోహన్ రాజా, బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement