NV Prasad
-
చంద్రబాబు సూపర్ సిక్స్ మీద నమ్మకం పోయింది.. టీడీపీపై NV ప్రసాద్ ఫైర్
-
ఊహించినదానికంటే ఎక్కువ కలెక్షన్స్: గాడ్ ఫాదర్ నిర్మాత
ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ''గాడ్ ఫాదర్'' విలేఖరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'గాడ్ ఫాదర్‌కు అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాను ఎవరికీ అమ్మలేదు. మేమే సొంతంగా విడుదల చేశాం. కలెక్షన్స్ మేము ఊహించినదాని కంటే అద్భుతంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాలలో 60 కోట్ల షేర్ వచ్చింది. మా బ్యానర్‌కు మైల్ స్టోన్ సినిమా. లూసిఫర్‌ను అందరూ చూశారు. ఆ సినిమాను రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పోన్నియిన్ సెల్వన్ అద్భుతంగా ఆడుతోంది. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాదర్ రిలీజ్‌ను ఆపుకున్నాం. అక్టోబర్ 14న గాడ్ ఫాదర్‌ను తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. రామ్ చరణ్ ఆలోచన వల్లే ఈ సినిమా మొదలైయింది. విడుదల తర్వాత ఆయన ఆనందం మాటల్లో చెప్పలేం. చరణ్ తన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు. గాడ్ ఫాదర్ లాంటి విజయం ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ వుంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి కూడా ఒక పండగలాంటి సినిమా గాడ్ ఫాదర్' అని చెప్పుకొచ్చాడు ఎన్వీ ప్రసాద్. చదవండి: నిన్ను చంపేస్తా.. నటుడి భార్యకు నటి వార్నింగ్ పంజాబీ నటితో సింగర్ డేటింగ్ -
హీరోగా మారిన సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్..
‘‘చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్‌పై ఆసక్తి ఉంది. కానీ మా లైఫ్‌స్టైల్, బిజినెస్ వేరు. బిజినెస్‌లో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు అవకాశం రావడంతో ఈ సినిమా చేశాను. నటనకు వయసు అనేది అడ్డంకి కాదని భావిస్తున్నాను’’ అని శరవణన్ అన్నారు. శరవణన్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ది లెజెండ్’. జేడీ–జెర్రీ ద్వయం తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా హీరోయిన్గా నటించారు. ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శరవణన్ మాట్లాడుతూ.. ‘‘ఓ కామన్‌మేన్ ఎలా లెజెండ్‌గా ఎదిగాడు ? జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు ? అన్నదే లెజెండ్ కథ’’ అని తెలిపారు. ‘‘శరవణన్‌గారు సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. అయితే ఒక నటుడిగా ఆయన కమిట్మెంట్ ఎంత బాగుందనేది స్క్రీన్‌పై చూస్తారు’’ అన్నారు దర్శకద్వయం జెడీ, జెర్రీ. ‘‘తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్‌ను ఎప్పుడూ ఆదరిస్తారు. ‘ది లెజెండ్’ కథ కొత్తది. ఒక సక్సెస్ఫుల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అని ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు. చదవండి: తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో.. అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
చిరంజీవి ఇమేజ్‌కి తగ్గట్టుగా...
చిరంజీవి తాజా చిత్రం ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై సురేఖ కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన సూపర్‌హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఫిబ్రవరిలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌ను తయారు చేశారు దర్శకుడు మోహన్‌రాజా’’ అన్నారు. మోహన్‌రాజా మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇది పూర్తి స్థాయి రీమేక్ సినిమా కాదు. ఒరిజినల్ పాయింట్ తీసుకుని చిరంజీవిగారి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథను మార్చి, తెరకెక్కిస్తాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అశ్వినీదత్, డీవీవీ దానయ్యలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్. -
చిరంజీవితో సినిమా నా అదృష్టం: దర్శకుడు
మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగులో రీమేక్‌కు రెడీ అయింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చేస్తున్న ఈ 153వ సినిమా చిత్రీకరణ బుధవారం ఉదయం ఫిలిం నగర్‌లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ‘ఆచార్య’ వీడియోని షేర్ చేసిన చిరంజీవి) ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ .. "ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా అద్భుతంగా స్క్రిప్ట్ సిద్ధం చేసారు. ఇది మెగాస్టార్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలుస్తుంది'' అన్నారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ- 'చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం, మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అన్నారు. (చదవండి: గనిగా వరుణ్ తేజ్.. పంచ్ మాములుగా లేదుగా) ఈ చిత్రానికి సమర్పణ : సురేఖ కొణిదెల, సంగీతం : ఎస్ ఎస్ తమన్, కెమెరా : నీరవ్ షా, రచయిత : లక్ష్మి భూపాల్, ఆర్ట్ : సురేష్ సెల్వరాజన్, లైన్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావు, నిర్మాతలు : ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్, స్క్రీన్ ప్లే - దర్శకత్వం : మోహన్ రాజా, బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ Megastar @KChiruTweets new film kickstarted with a Pooja today Presented by @KonidelaPro, @MegaaSuperGood1 & NVR Films 🎬 : @jayam_mohanraja 🎥: Nirav Shah 🎼 : @MusicThaman 🎨 : @sureshsrajan ✍️ : #LakshmiBhoopal Regular shoot commences from February 2021. #Chiru153 pic.twitter.com/qEgmv1FZfz — BARaju (@baraju_SuperHit) January 20, 2021 -
వరాలు భలే
సినీ పరిశ్రమ మీద వరాల జల్లు కురిపించింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఇబ్బంది నుంచి తిరిగి పుంజుకోవడానికి ఏపీ ఇచ్చిన వరాలు ఎంతో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం గురించి మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, నిర్మాత, ఎగ్జిబిటర్ ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఏపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారు పరిశ్రమకు అండగా నిలబడుతున్నారు. ఆయన చేస్తున్న సాయం ఎనలేనిది. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 3 నెలలు పవర్ టారిఫ్ నుంచి ఉపశమనం కల్పించారు. జగన్‌గారికి, మంత్రి మండలికి, సినీ పెద్దలకు ధన్యవాదాలు’’ అన్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ నటుడు చిరంజీవి, సురేశ్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర వంటి నిర్మాణసంస్థలు, ఇంకా పలువురు తమ సామాజిక వేదికల్లో జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. -
సంచలనం సృష్టిస్తుందని నమ్ముతున్నాం
రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.ఓ’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా గత గురువారం (నవంబర్ 29) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్.వి.ఆర్. సినిమా సంస్థ విడుదల చేసింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత ఎన్.వి. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘2.ఓ’ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.110 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 21.5 కోట్లు వసూలు చేసి, దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. అన్ని ఏరియాల్లో అన్ని థియేటర్స్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమా చరిత్రలోనే ‘2.ఓ’ సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2.ఓ’ చిత్రాన్ని ప్రసాద్‌గారు, మేము, యు.వి.క్రియేషన్స్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాం. ఈ చిత్రాన్ని నేను మూడు సార్లు చూశాను. ఈ మధ్యకాలంలో ఏ సినిమానీ అన్నిసార్లు చూడలేదు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.21.5 కోట్లు వసూలు చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. శంకర్‌గారు ఈ సినిమాని విజువల్‌గా హాలీవుడ్ స్థాయిలో చూపించారు. ఇండియన్ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకూ రాలేదు. ‘మహర్షి’ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ‘ఏం తీశారండీ శంకర్‌గారు. చాలా బాగుంది.. గౌతమ్ మళ్లీ చూడాలంటున్నాడు’ అని మహేశ్‌బాబుగారు అన్నారు. ఈ మాట వినగానే పిల్లలు ఈ చిత్రాన్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమైంది’’ అన్నారు. -
నో కట్స్..
ఇటు టాలీవుడ్లో అటు కోలీవుడ్ జనాల్లో, సినీ వర్గాల్లో ఇప్పుడు బాగా నానుతోన్న సినిమా ‘స్పైడర్’. మహేశ్‌బాబు, ఎ.ఆర్. మురుగదాస్ వంటి క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సినిమా కావడం.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాతో మహేశ్ తమిళ చిత్రసీమలో అడుగుపెడుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన ఈ భారీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొంది. సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. దసరా కానుగా ఈ నెల 27న ‘స్పైడర్’ విడుదల కానుంది. ‘‘హేరిస్ జయరాజ్ స్వరపరచిన ఈ సినిమా పాటలకు మంచి లభిస్తోంది. ట్రైలర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మహేశ్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శివన్. -
మహేశ్‌ని ఎవరితోనూ పోల్చలేను..ఎందుకంటే?
- మురుగదాస్ ‘‘హీరో మందు తాగి ఫ్రెండ్స్‌తో సరదాగా అమ్మాయిలను ఏడిపిస్తే... సినిమాలో కామెడీగా ఉండొచ్చు. కానీ, రియల్ లైఫ్‌లో అలా చేస్తే ట్రాజెడీగా ఉంటుంది. విలన్ అలాంటి పనులు చేస్తే నెగిటివ్ షేడ్స్ అంటారు. మరి, హీరో చేస్తే ఓకేనా? అందుకే నా సినిమాల్లో అలాంటి సీన్స్ అవాయిడ్ చేస్తున్నా. పెద్ద హీరోలకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే... కోట్లాదిమంది వాళ్లను గుడ్డిగా అనుసరిస్తున్నారు. అమ్మను ప్రేమించాలి, మహిళలను గౌరవించాలి... వంటి అంశాలను సినిమాల్లో చూపిస్తే ప్రేక్షకులు ప్రభావితమవుతారు. క్రియేటర్లుగా దర్శకులు, హీరోలు బాధ్యతగా నడుచుకోవాలి’’ అన్నారు ఏఆర్ మురుగదాస్. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘స్పైడర్’. ఈ సినిమా, మహేశ్ గురించి మురుగదాస్‌తో ఇంటర్వ్యూ.. ∙‘స్టాలిన్’ తర్వాత పదేళ్లకు తెలుగులో మీరు చేస్తున్న మూవీ ‘స్పైడర్’... ‘స్టాలిన్’ టైమ్‌లో పరుచూరి వెంకటేశ్వరరావుగారు నన్ను మహేశ్‌కు పరిచయం చేశారు. అప్పటికే మహేశ్ ‘ఒక్కడు’ చూశా. సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన్ను కలసినప్పుడు మీతో సినిమా చేయాలనుందన్నా. సరే అన్నారు. ఇప్పుటికి కుదిరింది. తెలుగులో సూపర్‌స్టార్ అయిన మహేశ్‌ను తమిళ్‌కు పరిచయం చేస్తున్నాననే ఒత్తిడేమైనా? డబ్బింగ్ సినిమాలు, ఇంటర్నెట్ వల్ల మహేశ్ తమిళ ప్రేక్షకులకూ తెలుసు. తమిళంలో మహేశ్‌కు ఇది మొదటి సినిమా కాబట్టి క్యారెక్టర్ బ్యాలెన్సింగ్‌గా ఉండాలనుకున్నా. తెలుగు, తమిళ సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని మోడ్రన్ స్క్రిప్ట్ రెడీ చేశా. అలాగే, మహేశ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆశించే హీరోయిజమ్, కమర్షియల్ అంశాలతో స్క్రిప్ట్ రాశా. తమిళంలో మహేశే డబ్బింగ్ చెప్పారు. టీజర్లో డబ్బింగ్ బాగుందంటూ మెసేజ్‌లొస్తున్నాయి. ‘సినిమాకు కథే కావాలి. సందేశాలు అవసరం లేదు’ అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు! కానీ, మీ సిన్మాల్లో ఏదొక సందేశం ఉంటుంది కదా! ఈ ‘స్పైడర్’లోనూ మెసేజ్ ఉందా? ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్... ఎక్కడ చూసినా సందేశాలే. ప్రతి రోజూ ఎవరొకరు ఎక్కడొక చోట సందేశం ఇస్తున్నారు. నేను కూడా మెసేజ్ అంటే ప్రేక్షకులంతా ‘ఇంకో సందేశమా?’ అనుకుంటారు. మనం మెసేజ్ ఇవ్వకున్నా ఫర్వాలేదు. కానీ, డ్రింకింగ్, స్మోకింగ్ వంటి చెడు సందేశాలను పంపకూడదు. మహేశ్‌లాంటి స్టార్ స్క్రీన్‌పై సిగరెట్ తాగితే ఆయన్ను గుడ్డిగా ఫాలో అయ్యే వీరాభిమానులు టెమ్ట్ అవుతారు. అందుకే, నేను అలాంటివి అవాయిడ్ చేస్తున్నా. ‘స్పైడర్’లో మానవత్వం గురించి చెప్పా. ఈ రోజుల్లో ప్రజలంతా త్వరగా ఓ అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను హీరోని చేసి, సడన్‌గా జోకర్‌ను చేస్తారు. అన్నా హజారేను హీరో చేస్తారు. ఆ తర్వాత ఆయన సభలో జనాలు కనిపించరు. ఎంత త్వరగా ఇష్టపడుతున్నారో అంతే త్వరగా అయిష్టం పెంచుకుంటున్నారు. మానవత్వం లేనిచోట, ఇతరుల్ని ప్రేమించలేని పరిస్థితుల్లో తీవ్రవాదం, అవినీతి పెరుగుతాయి ఇందులో అలాంటి మెసేజ్ ఇచ్చా. సినిమాను ఆలస్యంగా తీసినట్టున్నారు? బైలింగ్వల్ అంటే... ‘వన్ మోర్ టేక్’ చేయడమే అనుకున్నా. తెలుగులో ఓ సీన్ తీశాక, వెంటనే తమిళ సీన్ పూర్తవుతుందనుకున్నా. కానీ, స్టార్ట్ చేశాక ‘వన్ మోర్ టేక్’ కాకుండా ‘వన్ మోర్ ఫిల్మ్’ అయ్యింది. డైలాగులు ఉన్నా లేకున్నా ప్రతి ఫ్రేమ్, షాట్‌ను రెండు భాషల్లో తీశాం. దాంతో ఆలస్యమైంది. ∙లేటవుతోంటే మహేశ్ ఏం అనలేదా? ఒక్క మాట కూడా అనలేదు. ‘మీరు 5 సీన్లు తీసేసి, మరో 5 సీన్లు కలుపుదామంటే రెడీ. డేట్స్ ఇస్తా. ఈ షూటింగ్ పూర్తయితేనే నెక్ట్స్ సిన్మాకు వెళ్తా’ అనేవారు. సూపర్‌స్టార్స్ అందరితో వర్క్ చేశా. మహేశ్‌ను ఎవరితోనూ పోల్చలేను. దర్శకులందరూ మహేశ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనేది నా కోరిక. నేనింతవరకు ఆయనలాంటి హీరోను చూడలేదు. మహేశ్ దర్శకుల నటుడు. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే గురించి చెప్పాక నా వర్క్‌లో ఇన్వాల్వ్ కాలేదు. ఇండియాలో మిగతా హీరోలెవరూ ఇంత కోపరేట్ చేస్తారనుకోవడం లేదు. మహేశ్ లేకుండా మరో హీరోతో ‘స్పైడర్’ను ఊహించుకోలేను. ఈ సిన్మా వస్తుందని కూడా అనుకోలేను. మరి, నిర్మాతలు ఏమనేవారు? ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు... డబ్బులు పెట్టడం మాత్రమే కాకుండా సినిమాను ప్రేమించే నిర్మాతలు. నాకు మధుగారు 12 ఏళ్లుగా తెలుసు. ఓసారి మహేశ్‌గారు ‘మధు, ‘తిరుపతి’ ప్రసాద్ (ఎన్వీ ప్రసాద్) అయితే మీకు హ్యాపీనా?’ అనడిగారు. ‘నాకు వాళ్లు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నో ప్రాబ్లమ్’ అన్నా. ముందు అనుకున్న దానికంటే సినిమా గ్రాండ్‌నెస్ పెరిగింది. క్లైమాక్స్‌తో పాటు కొన్ని సీన్లు బెటర్‌గా చేశా. నిర్మాతలు ఫుల్ సపోర్ట్ చేశారు. తెలుగు లిరిక్స్ విషయంలో ఎంతో హెల్ప్ చేశారు. ష్... భయపెట్టడం మాకూ తెలుసు! గ్లింప్స్ ఆఫ్ స్పైడర్: మే 31న (కృష్ణ బర్త్‌డే సందర్భంగా) విడుదల చేశారు. ∙సుమారు కోటిన్నరకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు. హైలైట్: సింగిల్ డైలాగ్ లేదు. సినిమా థీమ్‌ను పరిచయం చేసేలా ఓ ఎలక్ట్రానిక్ స్పైడర్‌ను చూపించారు. మహేశ్ ‘ష్...’ అనడం నచ్చింది. స్పైడర్ ఫస్ట్ సింగిల్–‘బూమ్ బూమ్’: ఆగస్టు 2న విడుదల చేశారు. తెలుగు–తమిళ భాషల్లో కలిపి సుమారు 50 లక్షలమంది చూశారు. ∙హైలైట్: హ్యారీస్ జయరాజ్ స్వరపరిచిన పెప్పీ అండ్ మోడ్రన్ ట్యూన్, ‘స్పై..’ అంటూ సాగే లిరిక్స్ జనాలకు నచ్చాయి. ముఖ్యంగా మహేశ్ కుమార్తె సితార ఈ పాట పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్పైడర్ టీజర్: ఆగస్టు 8న విడుదల చేశారు. ∙తెలుగులో 80 లక్షలు, తమిళంలో సుమారు 30 లక్షలకు పైగా (యూట్యూబ్‌లో) చూశారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్... డిజిటల్ ఫ్లాట్ఫార్మ్స్తో కలుపుకుంటే 15 మిలియన్ (కోటిన్నర) వ్యూస్ వచ్చాయి. హైలైట్: ‘పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు గవర్నమెంట్, భూకంపం, సునామి, నేనూ ఒక భాగమే’ అని డైలాగ్ చెబుతున్న ముసుగు విలన్‌ను పరిచయం చేశారు. అతడికి కౌంటర్‌గా ‘నీలాంటి వాడు ఉన్న ఒక ఊరిలోనే ఇలాంటోడు ఒకడుంటాడు’ అని మహేశ్‌ను గూఢచారిగా పరిచయం చేశారు. ‘భయపెట్టడం మాకూ తెలుసు’ అని మహేశ్ చెప్పిన డైలాగ్, స్టైలిష్ మేకింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. ‘‘తెలుగు, తమిళ భాషల్లో తీసిన ‘స్పైడర్’ను మలయాళంలో, అరబిక్‌లో అనువదిస్తున్నాం. సెప్టెంబర్ 27నే గల్ఫ్ కంట్రీస్‌లో అరబిక్ భాషలో, కేరళలో మలయాళంలో విడుదలవుతుంది’’ -
లెక్క తర్వాత తేలుస్తారు!
మహేశ్‌బాబు అభిమానులకు, ప్రేక్షకులకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఓ ప్రామిస్ చేస్తున్నారు. అందరికీ కొత్త మహేశ్‌ను చూపిస్తానంటున్నారు. మహేశ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు, ఎన్వీ ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణ జరుగుతోంది. గతంలోనే మహేశ్-మురుగదాస్ ఓ చిత్రం చేయాలనుకున్నారట. ఇప్పటికైనా కుదిరినందుకు మురుగదాస్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘మహేశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడూ బాగుంటుంది. కానీ, ఈసారి ప్రేక్షకులు విభిన్నమైన మహేశ్‌ను చూస్తారు’’ అని మురుగదాస్ తెలిపారు. సుమారు వంద కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారనీ, మహేశ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రమిదనీ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం గురించి మురుగదాస్‌ని అడగ్గా... ‘‘చిత్రీకరణ ప్రారంభమైంది ఇప్పుడే కదా. అప్పుడే బడ్జెట్ గురించి చెప్పడం కష్టమే. ఆ లెక్క తర్వాత తేలుతుంది. దర్శకుడిగా మంచి చిత్రం ప్రేక్షకులకు ఇవ్వాలని ప్రయత్నిస్తాను. ఎప్పుడూ స్క్రిప్టే బడ్జెట్‌ను నిర్ణయిస్తుంది’’ అని చెప్పారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. తమిళ వెర్షన్‌కి మహేశ్‌బాబు స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నారట. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. -
అల ఎగసిపడుతోంది!
సినిమా వెనుక స్టోరీ - 15 ప్రేమ అంటే పచ్చదనం. ప్రేమ ఎప్పుడూ పచ్చగానే ఉండాలి. పెళ్లయిన తర్వాత కూడా..! ‘దిల్ సే’ పోస్ట్ ప్రొడక్షన్. మణిరత్నం ఫుల్ బిజీ. చిన్న టీ బ్రేక్‌లో బాల్కనీలో కూర్చుని రోడ్డు వంక చూస్తుంటే బైక్ మీద ఓ ప్రేమజంట రివ్వున దూసుకుపోతోంది. ప్రేమ ఎవ్వరికీ అంతుబట్టని ఓ మ్యాజిక్. ప్రేమలో అన్నీ ప్లస్సులే ఉంటాయా? లేదు... మైనస్సులూ ఉంటాయ్. అయితే అదేంటో... అవి పెళ్లయ్యేవరకూ కనబడవు. అప్పుడే గ్యాప్ మొదలవుతుంది. మణిరత్నం మనసు ఇలా రక రకాలుగా ఆలోచిస్తోంది. అందరూ పెళ్లితో ఎండ్ అయ్యే ప్రేమకథలే చేస్తున్నారు. ఆ తర్వాతి జీవితాన్ని ఎందుకు వదిలేయాలి? కోపాలూ తాపాలూ, ప్లస్సులూ మైనస్సులూ, వసంతాలూ శిశిరాలూ - ఇవన్నీ చూపించే కథ. ఆత్మ, హృదయం రెండూ ఉండే కథ. రైటర్ సుజాతకు ఫోన్ చేశాడు మణి. సుజాత తమిళంలో ఫేమస్ రైటర్. రిటైర్డ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్. ‘సుజాత’ అనేది ఆయన కలంపేరు. మణిరత్నానికి బాగా నమ్మక మైన మనిషి. ‘‘భార్య కనిపించకపోవడం, భర్త వెతు క్కుంటూ వెళ్లడం, ఈ అన్వేషణలో భార్య లేని లోటు, ఆమెతో జ్ఞాపకాలు గుర్తుకు రావడం... వీటన్నిటితో కథ చేద్దామను కుంటున్నా...’’ చెప్పాడు మణిరత్నం. ‘‘గో ఎ హెడ్’’ అని ఉత్సాహపరిచాడు సుజాత. మనసుపడి తీసిన తమిళ ‘ఇరువర్’ (తెలుగులో ‘ఇద్దరు’) అట్టర్ ఫ్లాప్. ఎంతో కష్టపడి చేసిన హిందీ ‘దిల్ సే’కి ఎదురు దెబ్బ. మణిరత్నం కదిలిపోయాడు. ఎక్కడో తేడా జరుగుతోంది. కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉండాల్సిందే! తప్పటడుగులు పడినప్పుడో, లక్ష్యం నుంచి దారి మళ్లినప్పుడో... బ్యాక్ టూ బేసిక్స్‌కి రావాలి. గొప్ప మేనేజ్మెంట్ సూత్రం. ఇండియాలోని టాప్ బిజినెస్ స్కూల్ జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టి ట్యూట్లో ఎంబీఏ చేసిన మణిరత్నానికి ఈ సూత్రమే గుర్తొచ్చింది. ఇప్పుడు తను కూడా బ్యాక్ టూ బేసిక్స్. నో ఎక్స్పెరి మెంట్స్. రొమాన్స్ అంటే మణిరత్నంలా ఎవ్వరూ తీయలేరు. ఇది ఆయనకున్న బ్రాండ్. ఇప్పుడదే మళ్లీ వాడాలి. సుజాతకు చెప్పిన స్టోరీలైనే తనకు శ్రీరామ రక్ష. ఆర్.సెల్వరాజ్‌ను పిలిచాడు. సూపర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే రైటర్. ఇద్దరూ కూర్చుని స్క్రిప్ట్ చేస్తున్నారు. మధ్య మధ్యలో సుహాసిని జాయినవుతున్నారు. మామూలుగా అయితే స్క్రిప్ట్ వర్కులో ఎవ్వర్నీ ఎంటర్ కానివ్వడు మణిరత్నం. రిలేషన్ రిలేషనే. స్క్రిప్టు స్క్రిప్టే. కానీ సుహాసినికి మాత్రం ఎగ్జెంప్షన్. ఎందు కంటే సుహాసిని చాలా షార్ప్. నటిగా బోలెడంత అనుభవం, సమాజాన్ని చదివిన అనుభవం... దానికి తోడు భర్తకేం కావాలో ఆమెకు బాగా తెలుసు. ‘రోజా’, ‘దళపతి’, ‘బొంబాయి’, ‘ఇద్దరు’, ‘దిల్ సే’... ఇలా మణిరత్నం ప్రతి సినిమాలోనూ సుహాసిని కంట్రి బ్యూషన్ కంపల్సరీ. ఈ స్క్రిప్టులో అయితే సుహాసిని ఐడియాలు చాలా ఎక్కువే. హీరో అమ్మానాన్నలు, హీరోయిన్ అమ్మానాన్నలు కలుసుకునే సీన్ ఐడియా సుహాసినిదే. ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీకెళ్లే సీన్, తండ్రి చనిపోయాక హీరోయిన్ తల్లిని చూడ్డానికి వెళ్లిన సీన్, ‘అలై పొంగెరా’ పాట సన్నివేశం... ఇదంతా సుహాసిని క్రెడిట్టే. తమిళంలో ‘అలై పాయుదే’ (అంటే ‘అల ఎగిసిపడుతోంది’ అని అర్థం) అనే టైటిల్ పెట్టారు. తెలుగు వెర్షన్ టైటిల్ ‘సఖి’. షారుక్ ఖాన్‌తో చేస్తే బాగుంటుంది... మణిరత్నానికి ఎవరో సలహా ఇచ్చారు. కానీ మణిరత్నం ఆల్రెడీ ఫిక్సయిపోయారు... న్యూ ఫేస్‌తో ఈ సినిమా చేయాలి. ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అయితే నేచురాల్టీ మిస్సవుతుంది. ఎవరా అదృష్టవంతులైన హీరో, హీరోయిన్లు? ‘శాండల్‌వుడ్’ సోప్ యాడ్ షూట్ చేస్తున్నారు. తీసేది ఫేమస్ కెమేరామన్ కమ్ డెరైక్టర్ సంతోష్ శివన్. చేసేది నటుడు ఆర్.మాధవన్. మణిరత్నానికి సంతోష్ శివన్ బాగా క్లోజ్. ఆ విషయం మాధవన్‌కు తెలుసు. అందుకే అడిగాడు... ‘‘సార్... నన్ను మణిగారికి ఇంట్రడ్యూస్ చేయండి.’’ సంతోష్ శివన్ ‘ఎస్’ అనలేదు, ‘నో’ అనలేదు. కానీ మాధవన్కి చెప్పకుండానే మణికి ఫొటోలు పంపించాడు. అప్పుడు మణిరత్నం ‘ఇరువర్’ తీసే పనిలో ఉన్నాడు. మాధవన్‌ని పిలిపించారు. ‘ఇరువర్’కి పనికొస్తాడేమోనని మేకప్ టెస్ట్ చేయించారు. నో యూజ్. మాధవన్ నిరాశగా వెళ్లిపోయాడు. తను మళ్లీ ‘జీ’ టీవీ సీరియల్స్‌లో బిజీ. ‘ఇస్ రాత్‌కీ సుబహ్ నహీ’ (హిందీ), ‘ఇన్ఫెర్నో’ (ఇంగ్లిషు) సినిమాల్లో చిన్న చిన్న వేషాలు. ఓ రోజు అనుకోని విధంగా మాధవన్కి మణిరత్నం నుంచి పిలుపు. ‘‘నా ‘సఖి’కి నువ్వే హీరో’’ - చెప్పాడు మణి. మాధవన్ కడలి అల కన్నా ఎక్కువ ఎగిరాడు సంబరంతో. వసుంధరాదాస్‌ను పిలిచారు.. హీరోయిన్ క్యారెక్టర్ కోసం! ఆమె సింగర్. కమల్‌తో ‘హే రామ్’లో చేస్తోంది. మణిరత్నం స్క్రీన్ టెస్ట్ చేయిం చాడు. ప్చ్! ఇంకా క్యూట్‌గా కావాలి. చైల్డ్ ఆర్టిస్టుగా టాప్ రేంజ్‌కెళ్లిన బేబీ షాలిని ఇప్పుడు హీరోయిన్గా అజిత్ పక్కన ‘అమర్కళమ్’ (తెలుగులో ‘అద్భుతం’గా అనువాదమైంది) చేస్తోంది. మణికి షాలిని నచ్చేసింది. ఆమెకూ ఈ ఆఫర్ నచ్చింది. కథ నచ్చింది. కానీ రొమాంటిక్ సీన్స్‌కీ, గ్లామర్ డ్రెస్‌లు వేయడానికీ అబ్జక్షన్ చెప్పింది. ఎందుకంటే ఆమె అప్పటికే అజిత్‌తో లవ్‌లో ఉంది. మణిరత్నం ‘డోంట్ వర్రీ’ అన్నాడు. ఇక షాలినికి వర్రీ ఏముంటుంది! షాలిని అక్క పాత్రకు స్వర్ణమాల్య సెలెక్టెడ్. ఆమెను పెళ్లిచూపులు చూడడాని కొచ్చే పాత్రను ఎవరైనా హీరోతో గెస్ట్‌గా చేయిస్తే? హీరో విక్రమ్‌ను అడిగారు. మరీ ఇంత చిన్న వేషమా? పెద్దదైతే చేస్తా అన్నాడు విక్రమ్. దాంతో ఆ పాత్రకు నార్మల్ యాక్టర్‌ను తీసేసుకున్నారు. ఈ సినిమాలో మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పాపులర్ సీనియర్ యాక్ట్రెస్ కావాలి. వాళ్లకు దొరికిన బెస్ట్ చాయిస్ జయసుధ. ఇంకో ఇంపార్టెంట్ రోల్. కుష్బూ ఓకే. ఆమె పక్కన ఎవరు బాగుంటారు? షారుక్‌ఖాన్... మమ్ముట్టి... మోహన్‌లాల్. ఫైనల్‌గా అరవింద్‌స్వామి ఓకే. ‘రోజా’తో తనను హీరోను చేసిన మణి అడిగితే, అరవింద్‌స్వామి కాదన గలడా? సినిమాలు వదిలేసి బిజినెస్‌లో బిజీ అయినవాడు కూడా గురువు కోసం వచ్చేశాడు. అప్పటి వరకూ మణిరత్నం సినిమాలకు లెనిన్ లాంటివాళ్లు ఎడిటింగ్ చేశారు. ఎందుకో మణి మార్పు కోరుకు న్నాడు. ఈ విషయం శ్రీకర్ ప్రసాద్‌కి తెలిసింది. అప్పటికే ఆయన నేషనల్ అవార్డు సినిమాలకు వర్క్ చేశాడు. మణిరత్నం, శ్రీకర్ ప్రసాద్ ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. తన మనసుకు నచ్చే టెక్నీషియన్ అనిపించింది మణిరత్నానికి. పీసీ శ్రీరామ్ టాప్ కెమేరామన్. మణిరత్నంతో కలిశాడంటే మ్యాజిక్కులే మ్యాజిక్కులు. ‘రోజా’ నుంచి రెహమాన్ చేయి వదలడం లేదు మణి. దీనికి మాత్రం వదులుతాడా? చడీచప్పుడు లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసేశాడు మణిరత్నం. పూజలు, ముహూర్తపు షాట్లు కూడా లేవు. జయసుధ మీద ఫస్ట్ షాట్. నాలుగు నెలల్లో సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేసేయాలి. మణిరత్నం టార్గెట్. చెన్నై, కననూర్, ముంబై, శ్రీనగర్, పోర్ట్‌బ్లెయిర్, మహేశ్వర్, ఆగ్రా, ధోల్పూర్... ఇలా అన్నీ బ్యూటిఫుల్ లొకేషన్స్. పీసీ తన షాట్స్‌తో మేజిక్ చేయడం మొదలుపెట్టాడు. టైటిల్సాంగ్ ‘అలై పొంగెరా...’ పాట తీస్తున్నారు. అంతా పెళ్లి సందడి. పేరంటాళ్ల హడావిడి కావాలి. సుహాసిని తన బంధువులందర్నీ పిలిచారు. వాళ్ల అమ్మను కూడా! వాళ్లపై మణి ఈ పాట తీయాలి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సిగ్గుపడుతూనే ఈ పాట పూర్తి చేశాడు. మాధవన్, షాలిని పెళ్లయ్యాక కాపురం పెట్టడానికి ఓ ఇల్లు కావాలి. అది కూడా ఫినిష్ కానిది. చెన్నైలో ఓ పది బిల్డింగ్లు చూసి, ఒకటి సెలెక్ట్ చేశారు. కావాలనే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఇలాంటి అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఎంచుకున్నారు. వీళ్ల మధ్య బంధం కూడా ఇలా అన్ఫినిష్డ్గానే ఉందని రిప్రజెంటేషన్ అన్నమాట. ‘పచ్చదనమే...’ పాటను రకరకాల రంగులతో కలర్ఫుల్గా ప్లాన్ చేసి తీశారు. ‘దిల్ సే’లోని ‘సత్ రంగీరే’ పాటకు ఓ రకంగా ఇది కొనసాగింపు. ‘కాయ్ లవ్ చెడుగుడు...’ పాటను రివర్స్ టెక్నిక్ యూజ్ చేసి తీశారు. కొంత వెర్షన్ తీశాక యావిడ్లో చెక్ చేసి చూస్తే లిప్ సింక్ కావడం లేదు. దాంతో మాధవన్‌ను ఆ పాటను రివర్స్‌లో పాడమన్నారు. మాధవన్ కష్టపడి బట్టీపట్టి మరీ నేర్చుకున్నాడు. తెలుగు వెర్షన్ హక్కులు ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎన్.వి. ప్రసాద్ తీసుకున్నాడు. తెలుగులో తన కెంత క్రేజుందో మణికి బాగా తెలుసు. ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వాళ్లకు కలగకూడదు. అందుకే ప్రతి సినిమాకీ స్పెషల్ కేర్ తీసుకుంటాడు. పాటలన్నీ వేటూరితో రాయించుకున్నాడు. వేటూరి అంటే మణికి చాలా ఇష్టం. గీతాంజలి, బొంబాయి సినిమాలకు వేటూరే పాటలు రాశారు. తెలుగు డైలాగ్స బాధ్యత అంతా శ్రీరామకృష్ణకే అప్ప గించారు. ‘బొంబాయి’ సినిమా నుంచి మణి టీమ్‌లో ఆయన పర్మినెంట్ మెంబర్. ‘సఖి’కి అందరూ గులామ్. ప్రేమజంట పెళ్లయ్యాక ఎలా బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్‌కి ఆడియన్స్ ఫిదా. అసలు మణిరత్నం టేకింగ్ ఎక్స్ట్రార్డినరీ. క్లైమాక్స్‌లో హాస్పిటల్ బెడ్ మీద మాధవన్, షాలిని మళ్లీ ‘ఐ లవ్యూ’ చెప్పుకోవడం, వాళ్ల ఎక్స్ప్రెషన్స్, చిన్న చిన్న డైలాగులు... ఇలాంటివన్నీ మణి మాత్రమే తీయగలడనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్‌తోనూ, రీరికార్డింగ్ తోనూ చెలరేగిపోయాడు. చాలా గ్యాప్ తర్వాత జానకమ్మ పాడిన ‘సెప్టెంబర్ మాసం అక్టోబర్ మాసం’ పాటను వింటుంటే పాత బాధలన్నీ మర్చిపోతాం. చాలా రోజుల గ్యాప్ తర్వాత జానకమ్మ ఆలపించిన పాట ఇది. పీసీ శ్రీరామ్ అయితే ఈ సినిమాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. కెమెరాను కలంగా మార్చి సెల్యులాయిడ్‌పై రొమాంటిక్ పొయిట్రీ రాసేశాడాయన. సినిమాలో ప్రతి ఫ్రేమూ ఐ ఫీస్టే. అందుకే ‘బెస్ట్ సినిమాటోగ్రాఫర్’గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. డీటీఎస్ మిక్సింగ్ చేసిన హెచ్.శ్రీధర్‌కూ బెస్ట్ ఆడియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డు. మణిరత్నం అంటేనే బాక్సాఫీస్‌కి పచ్చదనం. అందుకే మణిరత్నం ఎప్పుడూ పచ్చగానే ఉండాలి! ఆయన తీసిన ప్రేమకథల్లో ‘సఖి’ కూడా అప్పటికీ, ఇప్పటికీ ఒక ఆకుపచ్చని జ్ఞాపకం! వెరీ ఇంట్రస్టింగ్... * సాఫ్ట్వేర్ బూమ్ గురించి తొలిసారిగా సెల్యులాయిడ్ మీద చర్చించిన సినిమా ఇదే. * మాధవన్కి శ్రీనివాసమూర్తి, షాలినికి సరిత డబ్బింగ్ చెప్పారు. ‘పిరమిడ్’ నటరాజన్‌కు సీనియర్ నటుడు నర్రా వెంకటేశ్వరరావు గాత్రదానం చేశారు. - పులగం చిన్నారాయణ -
స్నేహమేరా జీవితం!
ఆ యువకుడికి తన స్నేహితుడంటే ప్రాణం. అనుకోకుండా ఆ స్నేహితునికి కష్టం ఎదురైంది. అప్పుడతను తన స్నేహితుణ్ణి ఎలా కాపాడుకున్నాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘టైగర్’. సందీప్‌కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్యతారలుగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వి.ఐ. ఆనంద్ దర్శకుడు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. స్నేహం, ప్రేమ, యాక్షన్ - ఇలాంటి విభిన్న అంశాల సమాహారమే ఈ చిత్రం. సందీప్ కిషన్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం ఇది’’ అని సమర్పకులు ‘ఠాగూర్’ మధు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె నాయుడు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్:జి. నాగేశ్వరరావు. -
శ్రీవారి సేవలో శృతిహాసన్
సాక్షి, తిరుమల: సినీ నటి శృతిహాసన్ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌తో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. శృతిహాసన్‌ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. -
ప్రతిష్ఠ దెబ్బతింటోంది!
- ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రకాశ్‌రాజ్ వివాదం వ్యవహారంపై ఆ యా సంఘాల వారికి ఫిర్యాదులు అందాయనీ, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి సంబంధిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయనీ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి పేర్కొంది. ఈ వ్యవహారంలో ఒకరిపై మరొకరు మీడియాకు ఎక్కడం ద్వారా చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠ దెబ్బతింటోందంటూ మండలి అధ్యక్షుడు ఎన్.వి. ప్రసాద్ శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమకు వెన్నెముక అయిన నిర్మాతల ప్రతిష్ఠ మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ యా సంఘాలు ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్నారు.