స్నేహమేరా జీవితం! | friendship is a life | Sakshi
Sakshi News home page

స్నేహమేరా జీవితం!

Published Tue, Jun 16 2015 11:59 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

స్నేహమేరా జీవితం! - Sakshi

స్నేహమేరా జీవితం!

ఆ యువకుడికి తన స్నేహితుడంటే ప్రాణం. అనుకోకుండా ఆ స్నేహితునికి కష్టం ఎదురైంది. అప్పుడతను తన స్నేహితుణ్ణి ఎలా కాపాడుకున్నాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘టైగర్’. సందీప్‌కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్యతారలుగా ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్ సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వి.ఐ. ఆనంద్ దర్శకుడు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

‘‘పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. స్నేహం,  ప్రేమ, యాక్షన్ - ఇలాంటి విభిన్న అంశాల సమాహారమే ఈ చిత్రం. సందీప్ కిషన్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం ఇది’’ అని సమర్పకులు ‘ఠాగూర్’ మధు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె నాయుడు, మాటలు: అబ్బూరి రవి, లైన్ ప్రొడ్యూసర్:జి. నాగేశ్వరరావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement