ప్రియురాలా? స్నేహితుడా? | Sundeep Kishan Tiger Movie Released in this mouth second week | Sakshi
Sakshi News home page

ప్రియురాలా? స్నేహితుడా?

Published Thu, Apr 30 2015 11:19 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

ప్రియురాలా? స్నేహితుడా? - Sakshi

ప్రియురాలా? స్నేహితుడా?

 ఒకవైపు ప్రియురాలు.. మరోవైపు స్నేహితుడు..     ఈ ఇద్దరూ ఆ కుర్రాడికి రెండు కళ్లులాంటివాళ్లు. ఈ ఇద్దరిలో ఎవరు కావాలి? అనడిగితే.. తేల్చుకోలేడు. ఇంతకీ     ఈ కుర్రాడు ఎవరు? ఏం చేస్తాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘టైగర్’. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా, పూర్తి స్థాయి మాస్ పాత్రలో సందీప్ కిషన్ నటించిన చిత్రం ఇది. స్నేహితుడి పాత్రలో రాహుల్ రవీంద్రన్, ప్రేయసిగా సీరత్ కపూర్ నటించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్ నిర్మించారు.
 
 దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ, సందీప్‌ది చాలా ఎనర్జిటిక్ కారెక్టర్ అనీ ఎన్వీ ప్రసాద్ తెలిపారు. సందీప్ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రమిదనీ, వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రేమ, స్నేహం, యాక్షన్ ఉంటాయనీ ‘ఠాగూర్’ మధు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement