
సినీ పరిశ్రమ మీద వరాల జల్లు కురిపించింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. లాక్‌డౌన్ వల్ల ఏర్పడ్డ ఇబ్బంది నుంచి తిరిగి పుంజుకోవడానికి ఏపీ ఇచ్చిన వరాలు ఎంతో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం గురించి మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, నిర్మాత, ఎగ్జిబిటర్ ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఏపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారు పరిశ్రమకు అండగా నిలబడుతున్నారు.
ఆయన చేస్తున్న సాయం ఎనలేనిది. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 3 నెలలు పవర్ టారిఫ్ నుంచి ఉపశమనం కల్పించారు. జగన్‌గారికి, మంత్రి మండలికి, సినీ పెద్దలకు ధన్యవాదాలు’’ అన్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ నటుడు చిరంజీవి, సురేశ్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర వంటి నిర్మాణసంస్థలు, ఇంకా పలువురు తమ సామాజిక వేదికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment