power tariff
-
ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్
ఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. పగలు, రాత్రి వేళ్లలో వేర్వేరు విద్యుత్ ఛార్జీల వసూలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటే 20 శాతం ఛార్జీలు, పగటివేళల్లో తక్కువ ఛార్జీలు వసూలు చేయనుంది. కొత్తగా టైమ్ ఆఫ్ డే టారిఫ్ వ్యవస్థ పేరుతో పగటి వేళ వాడే కరెంట్‌పై వినియోగదారులకు 20 శాతం మేర భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో డిమాండ్ అధికంగా ఉండే రాత్రి వేళ వాడే కరెంట్ ఛార్జీల భారం ఇప్పటికంటే 10-20 శాతం ఎక్కువగా ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. కొత్త నిబంధన 10 కిలో వాట్ లేదా అంతకంటే ఎక్కువ వినియోగం ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వ్యవసాయ వినియోగదారులను మినహాయించి ఇతర వినియోగదారులకు 2025, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం వేళ సోలార్ పవర్ అందుబాటులో ఉండటంతో దాని ధర తక్కువగా ఉంటుందని, అందుకే ఉదయం వేళలను సోలార్ అవర్స్‌గా పేర్కొంటూ.. ఆ సమయంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా విద్యుత్ ఛార్జీలు తక్కువ చేశామని మంత్రి అన్నారు. చదవండి: ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం -
AP: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారులు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వినియోగదారులపై విద్యుత్ భారం పడకుండా చేర్యలు చేపట్టింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ వివరాలను ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని వెల్లడించారు. ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల సబ్సిడీ.. నాయి బ్రహ్మణులు, ఆక్వా రంగం విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మొత్తం రూ. 10,135 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. చార్జీలు భరించడానికి ప్రభుత్వం ముందుకు రావడం సంతోషమన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంశం మీద మాత్రమే చార్జీలు పెంచుతున్నామని తెలిపారు. -
‘లోటు’ పాట్లపై లోతుగా..
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ టారిఫ్ సవరణ(చార్జీల పెంపు) ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు, విద్యుత్‌మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం, ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లను డిస్కంలు గత నెల 30న ఈఆర్సీకి సమర్పించిన విషయం తెలిసిందే. ఏఆర్‌ఆర్‌తోపాటే సమర్పించాల్సిన టారిఫ్ పెంపు ప్రతిపాదనలను అప్పట్లో డిస్కంలు వాయిదా వేసుకున్నాయి. భారీ ఆదాయలోటులో ఉన్న డిస్కంల మనుగడ కోసం చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే ఈఆర్సీ స్పష్టం చేసింది. ఆదాయలోటు పూడ్చుకోవడానికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచేందుకున్న అవకాశాలు ఏమిటి? సబ్సిడీలుపోగా మిగిలి ఉండే లోటు పూడ్చుకోవడానికి ఏ మేరకు టారిఫ్ పెంపు ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించాలి? అన్న అంశాలపై మంత్రులు లోతుగా చర్చించారు. ఆర్థికలోటు పూడ్చడానికి ఉన్న ఇతర మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావులకు సూచించారు. డిస్కంల ఆర్థిక పరిస్థితి, టారీఫ్ ప్రతిపాదనలపై మరో మారు భేటీ కావాలని నిర్ణయించారు. విద్యుత్‌పై భారీగా పెట్టుబడులు.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.వేల కోట్ల పెట్టుబడులు, వ్యయప్రయాసలతో రాష్ట్ర విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థల సామర్థ్యాన్ని భారీగా పెంచినట్టు అధికారులు మంత్రులకు నివేదించారు. జెన్కో స్థాపిత సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 16,623 మెగావాట్లకు పెరిగిందన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.33,722 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో 2,700 మెగావాట్ల లోటు ఉండేదని, కేవలం 6 నెలల్లోనే కోతలు అధిగమించి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామని వివరించారు. సౌర విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 74 మెగావాట్లు నుంచి 3997 మెగావాట్లకు, గరిష్ట విద్యుత్ డిమాండ్ 5,661 మెగావాట్ల నుంచి 13,688 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. వినియోగదారుల సంఖ్య కోటీ 11 లక్షల నుంచి కోటీ 68 లక్షలకు, తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2,012 యూనిట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 19 లక్షల నుంచి 25.92 లక్షలకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరిగాయన్నారు. ట్రాన్స్‌కో పరిధిలోని సబ్ స్టేషన్ల సంఖ్య 233 నుంచి 361కు పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు పెరిగిన ఆర్థిక అవసరాలకు తగ్గట్టు విద్యుత్ సంస్థల విద్యుత్ టారిఫ్ పెంచుకోవడానికి అనుమతికోరినట్టు తెలిసింది. -
పంజాబ్ కొత్త సీఎం హామీలు: ఉచితంగా నీరు.. విద్యుత్ చార్జీలు తగ్గింపు
చండీగఢ్: పంజాబ్‌లో పేద కుటుంబాలకు ఉచితంగా నీరు సరఫరా చేస్తామని, విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తనను తాను ఆమ్ ఆద్మీ(సామాన్యుడు)గా అభివర్ణించుకున్నారు. తాను గతంలో రిక్షా లాగానని, తన తండ్రి టెంట్ హౌస్ నడిపించారని గుర్తుచేశారు. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చన్నీ సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ భన్వరీలాల్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డుకెక్కారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన సుఖ్జిందర్ సింగ్ రంధావా, ఓ.పి.సోని ప్రమాణ స్వీకారం చేశారు. వారిద్దరినీ ఉప ముఖ్యమంత్రులుగా నియమించనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడారు. 200 లోపు చదరపు గజాల్లోపు ఉన్న ఇళ్ల నుంచి నీటి చార్జీలు వసూలు చేయబోమని అన్నారు. విద్యుత్ టారిఫ్ సైతం తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటిదాకా సీఎంగా అమరీందర్ చక్కగా పనిచేశారని చన్నీ కితాబిచ్చారు. పంజాబ్ ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం చన్నీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మోదీ ట్వీట్ చేశారు. చన్నీ, సిద్ధూ సారథ్యంలో ఎన్నికల్లో పోటీ సిద్ధూ ఆధ్వర్యంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పంజాబ్ పార్టీ ఇన్చార్జి హరీష్ రావత్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. ఓట్ల కోసమే దళితుడైన చన్నీని సీఎం చేశారని విమర్శలొచ్చాయి. దీంతో పంజాబ్‌లో రాబోయే ఎన్నికల్లో చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూల సారథ్యంలో తమ పార్టీ పోటీకి దిగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తాజా ప్రకటన చేశారు. చదవండి: తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం -
‘గృహ వినియోగదారుడికి ఇకపై కనీస చార్జీలుండవు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) బుధవారం 2021–22కి విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించింది. ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గనున్నట్లు పేర్కొంది. పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తించనుంది. ఈ సందర్భంగా ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. కులవృత్తుల వారికిచ్చే ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్నారు. కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రూ.1,657 కోట్ల భారం పడుతుందని, రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ► గృహ వినియోగదారుడికి ఇకపై కనీస ఛార్జీలు ఉండవు ► ఛార్జీల స్థానంలో కిలోవాట్‌కు రూ.10 చెల్లిస్తే చాలు ► ఫంక్షన్‌హాళ్లకు కూడా ఇకపై నిర్ధిష్ట ఛార్జీలు ఉండవు ► పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చాం ► గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► రజక సంఘం నడుపుతున్న లాండరీలకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్ ► బీపీఎల్ పరిధిలోని స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► బీపీఎల్‌లో ఉన్న ఎంబీసీ వర్గాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ► యూనిట్ రూ.2.35 పైసలకే ఆక్వారైతులకు రాయితీపై విద్యుత్ ► సబ్సిడీ విద్యుత్ కోసం ప్రభుత్వంపై రూ.9,091.36 కోట్లు భారం పడనున్నట్లు నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. చదవండి: నేడు విద్యుత్ టారిఫ్ ప్రకటన: కీలక విషయాలు -
వరాలు భలే
సినీ పరిశ్రమ మీద వరాల జల్లు కురిపించింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఇబ్బంది నుంచి తిరిగి పుంజుకోవడానికి ఏపీ ఇచ్చిన వరాలు ఎంతో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం గురించి మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, నిర్మాత, ఎగ్జిబిటర్ ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఏపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారు పరిశ్రమకు అండగా నిలబడుతున్నారు. ఆయన చేస్తున్న సాయం ఎనలేనిది. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 3 నెలలు పవర్ టారిఫ్ నుంచి ఉపశమనం కల్పించారు. జగన్‌గారికి, మంత్రి మండలికి, సినీ పెద్దలకు ధన్యవాదాలు’’ అన్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ నటుడు చిరంజీవి, సురేశ్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర వంటి నిర్మాణసంస్థలు, ఇంకా పలువురు తమ సామాజిక వేదికల్లో జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. -
కోవిడ్ నష్టం.. పూడ్చడం కష్టం!
సాక్షి, అమరావతి : వార్షిక, ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్ఆర్) సమర్పించేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నవంబర్ చివరి నాటికి ఏఆర్‌ఆర్‌లు సమర్పించాలని డిస్కమ్‌లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు డిస్కమ్‌లు ఇప్పటి వరకు ఉన్న ఆదాయ వివరాలు, వచ్చే ఏడాదికి కావాల్సిన రెవెన్యూను అంచనా వేస్తున్నాయి. ఏపీఈఆర్సీ ఇచ్చిన గడువులోగానే ఏఆర్‌ఆర్‌లు సమర్పిస్తామని డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. దీనిపై కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, వచ్చే ఏడాదికి అనువైన టారిఫ్‌ను ప్రకటిస్తుంది. ఈ టారిఫ్ వచ్చే ఏప్రిల్ నుంచి అమలులోకి రావాల్సి ఉంది. తగ్గిన రాబడి.. పూడ్చడమెలా? ►ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థల ఆదాయానికి కోవిడ్-19 భారీగా గండికొట్టింది. ఆరు నెలలు గడిచినా పెద్దగా మార్పు కనిపించడం లేదు. సాధారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ఉన్న గణాంకాలనే ఏఆర్‌ఆర్‌లోకి తీసుకుంటారు. దీని ఆధారంగా అంచనాలు రూపొందిస్తారు. ►నిజానికి ఈ ఆరు నెలల కాలంలో డిస్కమ్‌ల ఆదాయం భారీగా తగ్గింది. గత ఏడాది (2019) రూ.11,038.35 కోట్లు ఉంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.9,509.62 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఈ ఆర్ధ సంత్సరంలో రూ.1,528.73 కోట్ల రెవెన్యూ వసూళ్లు పడిపోయాయి. గృహ విద్యుత్ పెరిగినా లాభం లేదు.. ► లాక్డౌన్ కారణంగా ఏప్రిల్-జూన్ నెలల్లో గృహ విద్యుత్ వినియోగం పెరిగింది. 2019 ఆరు నెలల్లో గృహ విద్యుత్ రాబడి రూ.2,726.65 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం ఆరు నెలల్లో రూ.2,831 కోట్లు ఉంది. రూ. 104.35 కోట్లు పెరిగినా, డిస్కమ్‌లకు పెద్దగా ప్రయోజనం లేదు. ఎందుకంటే గృహ విద్యుత్‌ను చాలా వరకు సబ్సిడీపైనే ఇస్తారు. మన రాష్ట్రంలో తక్కువ టారిఫ్ ఉంది. ►డిస్కమ్‌ల నష్టాలను పూడ్చడంలో కీలక పాత్ర పోషించే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ రాబడి ఈసారి గణనీయంగా తగ్గింది. పారిశ్రామిక విద్యుత్ రెవెన్యూ 2019లో రూ.4,771.03 కోట్లు ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.3,754.19 కోట్లు మాత్రమే ఉంది. అంటే 1,016.84 కోట్లు తగ్గింది. వాణిజ్య విద్యుత్ రెవెన్యూ గత ఏడాది రూ.2,272.56 కోట్లు ఉంటే, ఈ సంవత్సరం ఆరు నెలల్లో రూ.1,603.47 కోట్లు ఉంది. రూ.669.09 కోట్లు తగ్గింది. ►విద్యుత్‌ను వినియోగదారుడికి చేరవేయడానికి ప్రతి యూనిట్‌కు దాదాపు రూ.5.05 వరకు ఖర్చవుతుంది. గృహ వినియోగం వల్ల యూనిట్‌కు సగటున రూ.4.05 వరకు వస్తుంది. మిగతా మొత్తాన్ని పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ (క్రాస్ సబ్సిడీ) ద్వారా పూడ్చుకుంటారు. ఈసారి ప్రధాన ఆదాయ వనరులే దెబ్బతిన్నాయి. దీనికి తోడు గత ప్రభుత్వ బకాయిలను అప్పు చేసి మరీ ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా వడ్డీ భారం విద్యుత్ సంస్థలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో డిస్కమ్‌లు సమర్పించే ఏఆర్‌ఆర్‌లు కీలకం కాబోతున్నాయి. -
ఏపీ ప్రజలకు భారీగా విద్యుత్ షాక్!
-
తెలంగాణలోనూ విద్యుత్ ఛార్జీల పెంపు!
-
ఇదీ విద్యుత్ ఛార్జీల బాదుడు!
-
విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించాల్సిందే!
-
ఏపీలో విద్యుత్ ఛార్జీల బాదుడు!
-
నేడు కేబినేట్ భేటీపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం, విద్యుత్ టారిఫ్ ఖరారు, బీపీఎస్, రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఎంసెట్ నిర్వహణ వంటి కీలకమైన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక అంశాలపై సోమవారం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న మంత్రిమండలి సమావేశం చర్చించే అవకాశాలున్నాయి. ఎంసెట్‌ను తామే నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పిన నేపథ్యంలో విడిగా ఎంసెట్ నిర్వహించాలా.. లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా.. అని తర్జనభర్జన పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి రానుంది. అలాగే విద్యుత్ ఏఆర్‌ఆర్‌ను ఈఆర్సీకి సమర్పించినప్పటికీ దాదాపు ఏడువేల కోట్ల రూపాయల మేరకు ఉన్న లోటును భర్తీ చేసుకోవడానికి టారిఫ్‌ను సమర్పించాల్సి ఉంది. ఆ టారిఫ్‌పైన కూడా నేటి మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ విషయాన్ని ఈ భేటీలో చర్చిస్తారా, లేక మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరుపుతోందన్న కారణంతో వాయిదా వేస్తారా అన్నది తేలనుంది. పీఆర్సీ జాప్యంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు, జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆందోళన కోసం కార్యాచరణ రూపొందించాలన్న దిశగా ఆలోచిస్తున్నాయి. మరోవైపు కొంతమేరకైనా చార్జీల వడ్డన తప్పదని డిస్కంలు చెబుతున్న నేపథ్యంలో కరెంట్ చార్జీల పెంపుపై కేబినేట్ ఎలాంటి నిర్ణయానికొస్తుందో నేడు తేలిపోనుంది. -
ఢిల్లీలో పెరిగిన విద్యుత్ చార్జీలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 7 శాతం వరకు పెంచారు. పెంచిన చార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) ఈమేరకు గురువారం నిర్ణయం తీసుకుంది. మూడు ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థల విజ్ఞప్తి మేరకు చార్జీలు పెంచినట్టు డీఈఆర్సీ తెలిపింది. బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ (బీవైపీల్) నుంచి విద్యుత్ వాడుకునే వారిపై 7 శాతం, బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) వినియోగదారులపై 4.5 శాతం, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) వినియోగదారులపై 2.5 శాతం వడ్డించారు. -
హస్తిన ప్రజలపై మరో పిడుగు
న్యూఢిల్లీ: విద్యుత్ సమస్యతో అల్లాడుతున్న హస్తిన ప్రజలపై మరో పిడుగు పడింది. ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 2.5 శాతం వరకు పెంచారు. పరిశ్రమలు, ఢిల్లీ మెట్రో వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలు 11 శాతం వరకు పెంచారు. బయట రాష్ట్రాల నుంచి విద్యుత్ కోనుగోలు చేస్తున్నందున చార్జీలు పెంచాల్సివచ్చిందని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంఘం తెలిపింది. విద్యుత్ కోతలతో ఇలీవల కాలంలో ఢిల్లీ ప్రజలు అల్లాడారు. కేంద్ర ప్రభుత్వం కూడా హస్తినలో కరెంట్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఢిల్లీ సీఎం పీఠంపై కన్నేసిన బీజేపీ.. విద్యుత్ సమస్య తీర్చి ప్రజలకు చేరువ కావాలని భావిస్తోంది. -
విద్యుత్ టారిఫ్ - జగన్ మోహన్ రెడ్డి హామీ!
కరెంట్. వైర్ పట్టుకుంటేనే షాక్ కొట్టడం కాదు.. ఇప్పుడు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేట్టుగా మారింది. ఏనాడో మూడు, నాలుగేళ్ళ క్రితం వాడుకున్న కరెంటుకు కూడా ఇప్పుడు సర్ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అంతేకాదు.. ఏటేటా టారిఫ్ పెంచుతూ.. వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. ప్రస్తుతం నెలకు 150 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారు.. టెలిస్కోపిక్ విధానంలో మొదటి యాభై యూనిట్లకు 130 రూపాయలు, ఆ తర్వాత యాభై యూనిట్లకు 162 రూపాయల యాభై పైసలు.. ఆ తర్వాత మరో యాభై యూనిట్లకు 244 రూపాయలు.. వెరసి మొత్తం రూ. 536 బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అయితే తమ ప్రభుత్వం ఏర్పడితే ఇదే విద్యుత్‌కు కేవలం 100 రూపాయల బిల్లు మాత్రమే వసూలు చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇస్తున్నారు. ఇదే జరిగితే కొన్ని కోట్ల మంది పేదలకు నెలకు 436 రూపాయలు మిగులుతాయి. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ఈ వాగ్దానంపై మీ స్పందన తెలియచేయండి! -
రూ. 100కే ప్రతీ ఇంటా వెలుగుల పంట
-
జనం నెత్తిన విద్యుత్ ఛార్జీల మోత
-
పవర్ రేట్ ‘కట్’!
ముంబై: రాష్ట్రంలో మహావితరణ్ ద్వారా పంపిణీ చేస్తున్న విద్యుత్ టారిఫ్‌ను తగ్గించాలని సోమవారం ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ఆప్ సర్కార్ విద్యుత్ టారిఫ్‌లో 50 శాతం సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి చవాన్ సర్కార్‌పై విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనూ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో గృహ, పారిశ్రామిక, చేనేత రంగాలకు విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న మహావితరణ్ (మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీ) వసూలు చేస్తున్న ధరల్లో 15 నుంచి 20 శాతం తగ్గించాలని పృథ్వీరాజ్ చవాన్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మహావితరణ్పై రూ.7,099 కోట్ల భారం పడనుంది. ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రివర్గం పేర్కొంది. అయితే ముంబై నగరంలో టాటా పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా విద్యుత్ పొందుతున్న ముంబైవాసులకు ఈ నిర్ణయం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని సర్కారు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 21.4 మిలియన్ల వినియోగదారులకు మహావితరణ్ విద్యుత్‌ను పంపిణీ చేస్తోంది. అందులో గృహవినియోగదారులు 14.3 మిలియన్లు కాగా, వ్యవసాయదారులు 3.7 మిలియన్లు, వాణిజ్యసంబంధమైనవి 1.47 మిలియన్లు, 12 వేల హైటెన్షన్ వినియోగదారులతో సహా 3.7 లక్షల పరిశ్రమలు ఉన్నాయి. వీటి అవసరాలకు ప్రతి నెలా 1 ఎం.డబ్ల్యూ విద్యుత్ అవసరమవుతోంది. ప్రస్తుతం పరిశ్రమలకు మహావితరణ్ యూనిట్‌కు రూ.8.32 వసూలు చేస్తుండగా, 20 శాతం సబ్సిడీ (87 పైసలు) తగ్గించి రూ.7.45 పైసలే వసూలు చేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయదారులకు ఏడాదికి రూ.10,500 కోట్లు, మరమగ్గాలకు రూ.1,100 కోట్లు సబ్సిడీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ మంత్రి నారాయణ రాణే నేతృత్వంలో ఏర్పడిన కమిటీ నివేదిక ప్రకారం విద్యుత్ టారిఫ్ తగ్గింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందిన అనంతరం మహావితరణ్ మిగిలిన చర్యలు తీసుకుంటుంది..’ అని పేర్కొన్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి పృథ్వీరాజ్ సర్కార్‌పై స్థానికుల నుంచి విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం వినతులు వెల్లువెత్తాయి. దాంతో మహారాష్ట్ర సర్కారు విద్యుత్ టారిఫ్ తగ్గింపునకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే మహావితరణ్ వసూలు చేస్తున్న విద్యుత్ టారిఫ్ 20 నుంచి 50 శాతం ఎక్కువగా ఉందని ఇప్పటికే వివిధ పారిశ్రామిక వర్గాలు వాదిస్తున్నాయి. కాగా, నగరంలో విద్యుత్ టారిఫ్‌ను తగ్గించాలని ఆర్-ఇన్ఫ్రా విద్యుత్ పంపిణీ కంపెనీకి వ్యతిరేకంగా ఈ నెలారంభంలో ముంబైకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సంజయ్ నిరుపమ్, ప్రియాదత్ ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. టారిఫ్ తగ్గించాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌కు నిరుపమ్ లేఖ కూడా రాశారు. అలాగే కేంద్ర మంత్రి మిలింద్ దేవరా సైతం విద్యుత్ చార్జీల తగ్గింపు కోసం ఆదివారం డిమాండ్ చేసిన విషయం విదితమే. విద్యుత్ టారిఫ్ తగ్గింపు ప్రైవేట్ సెక్టార్లకే లాభం: బీజేపీ విద్యుత్ టారిఫ్‌ను 20 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంవల్ల ప్రైవేట్ కంపెనీలకే తప్ప వినియోగదారులకు ఎటువంటి ఉపయోగం ఉండదని బీజేపీ విమర్శించింది.‘ప్రభుత్వ నిర్ణయం ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే వారే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఖర్చులు భరిస్తారు కాబట్టి..’ అంటూ అసెంబ్లీలో విపక్ష నేత వినోద్ తావ్డే ఆరోపించారు. -
త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం:మహారాష్ట్ర సీఎం
నాగ్‌పూర్:ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలను పెంచడం మాత్రమే తరచు చూస్తూ ఉంటాం. కానీ మహారాష్ట్రలో అందుకు భిన్నంగా విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయి. త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చౌహాన్.. విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. విద్యుత్ ఛార్జీలపై పారిశ్రామిక శాఖా మంత్రి నారాయణ్ రానే అధ్యక్షతన నవంబర్ 19వ తేదీన ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా ఓ నివేదిక రూపొందించిందన్నారు. దీనిపై జనవరి 20వ తేదీన ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉందని చౌహాన్ తెలిపారు. కాగా టోల్ ఛార్జీలపై ఈ వారంలో సమీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అంశంపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆ శాఖకు చెందిన మంత్రి నుంచి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించామన్నారు. -
విద్యుత్ ఛార్జీల పెంపు, వినియోగదారుడిపై 9,339 కోట్ల భారం
-
బడుగు జీవికి భారీ షాక్
-
విద్యుత్ చార్జీల వాతలకు మరో నెల గడువు
ఈఆర్సీని కోరిన డిస్కంలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేందుకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీ ఈఆర్సీ)ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కోరాయి. ఈ మేరకు ఈఆర్సీ కార్యదర్శికి తాజాగా లేఖ రాశాయి. 2014-15లో ఎంత మేర లోటు ఏర్పడుతుందనే అంశంపై డిస్కంలు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. దీని ప్రకారం ఏకంగా రూ.12 వేల కోట్ల మేరకు లోటు ఉంది. ఈ మొత్తాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే వరుసగా నాలుగేళ్ల నుంచి విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు సర్దుబాటు చార్జీలు వడ్డించటంతో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఎన్నికల సమయంలో చార్జీలు పెంచితే ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేమనే ఆందోళన అధికార పార్టీలో నెలకొంది. ఈ నేపథ్యంలో లోటు తగ్గించే అవకాశాలను పరిశీలించడంతోపాటు భారాన్ని తగ్గించేందుకు వీలుగా మరో నెల సమయాన్ని కోరినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31 నాటికి విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను సమర్పిస్తామని డిస్కంలు కోరాయి. ఒకవేళ ఆ గడువు నాటికి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించకుంటే ఈఆర్సీ సుమోటోగా చార్జీలను నిర్ణయించనుంది.