
హస్తిన ప్రజలపై మరో పిడుగు
న్యూఢిల్లీ: విద్యుత్ సమస్యతో అల్లాడుతున్న హస్తిన ప్రజలపై మరో పిడుగు పడింది. ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 2.5 శాతం వరకు పెంచారు. పరిశ్రమలు, ఢిల్లీ మెట్రో వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీలు 11 శాతం వరకు పెంచారు. బయట రాష్ట్రాల నుంచి విద్యుత్ కోనుగోలు చేస్తున్నందున చార్జీలు పెంచాల్సివచ్చిందని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ సంఘం తెలిపింది.
విద్యుత్ కోతలతో ఇలీవల కాలంలో ఢిల్లీ ప్రజలు అల్లాడారు. కేంద్ర ప్రభుత్వం కూడా హస్తినలో కరెంట్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఢిల్లీ సీఎం పీఠంపై కన్నేసిన బీజేపీ.. విద్యుత్ సమస్య తీర్చి ప్రజలకు చేరువ కావాలని భావిస్తోంది.