ఢిల్లీ: విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. విద్యుత్ ఛార్జీల నిబంధనల్లో కేంద్రం భారీ మార్పులు చేసింది. పగలు, రాత్రి వేళ్లలో వేర్వేరు విద్యుత్ ఛార్జీల వసూలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటే 20 శాతం ఛార్జీలు, పగటివేళల్లో తక్కువ ఛార్జీలు వసూలు చేయనుంది.
కొత్తగా టైమ్ ఆఫ్ డే టారిఫ్ వ్యవస్థ పేరుతో పగటి వేళ వాడే కరెంట్‌పై వినియోగదారులకు 20 శాతం మేర భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో డిమాండ్ అధికంగా ఉండే రాత్రి వేళ వాడే కరెంట్ ఛార్జీల భారం ఇప్పటికంటే 10-20 శాతం ఎక్కువగా ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అన్నారు.
కొత్త నిబంధన 10 కిలో వాట్ లేదా అంతకంటే ఎక్కువ వినియోగం ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వ్యవసాయ వినియోగదారులను మినహాయించి ఇతర వినియోగదారులకు 2025, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉదయం వేళ సోలార్ పవర్ అందుబాటులో ఉండటంతో దాని ధర తక్కువగా ఉంటుందని, అందుకే ఉదయం వేళలను సోలార్ అవర్స్‌గా పేర్కొంటూ.. ఆ సమయంలో వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా విద్యుత్ ఛార్జీలు తక్కువ చేశామని మంత్రి అన్నారు.
చదవండి: ఒడిషా రైలు ప్రమాదం.. రైల్వే బోర్డు సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment