- ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు
ప్రకాశ్‌రాజ్ వివాదం వ్యవహారంపై ఆ యా సంఘాల వారికి ఫిర్యాదులు అందాయనీ, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి సంబంధిత సంఘాలు ప్రయత్నిస్తున్నాయనీ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి పేర్కొంది. ఈ వ్యవహారంలో ఒకరిపై మరొకరు మీడియాకు ఎక్కడం ద్వారా చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠ దెబ్బతింటోందంటూ మండలి అధ్యక్షుడు ఎన్.వి. ప్రసాద్ శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమకు వెన్నెముక అయిన నిర్మాతల ప్రతిష్ఠ మసకబారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆ యా సంఘాలు ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్నారు.
ప్రతిష్ఠ దెబ్బతింటోంది!
Published Sat, Apr 26 2014 11:03 PM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM
Advertisement
Advertisement