ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్'. మోహన్ రాజా దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ''గాడ్ ఫాదర్'' విలేఖరుల సమావేశంలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'గాడ్ ఫాదర్‌కు అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాను ఎవరికీ అమ్మలేదు. మేమే సొంతంగా విడుదల చేశాం. కలెక్షన్స్ మేము ఊహించినదాని కంటే అద్భుతంగా వున్నాయి. తెలుగు రాష్ట్రాలలో 60 కోట్ల షేర్ వచ్చింది. మా బ్యానర్‌కు మైల్ స్టోన్ సినిమా. లూసిఫర్‌ను అందరూ చూశారు. ఆ సినిమాను రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. తమిళనాడులో పోన్నియిన్ సెల్వన్ అద్భుతంగా ఆడుతోంది. వారి కల్చర్ మూవీకి గౌరవం ఇచ్చి అక్కడ గాడ్ ఫాదర్ రిలీజ్‌ను ఆపుకున్నాం. అక్టోబర్ 14న గాడ్ ఫాదర్‌ను తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం.
రామ్ చరణ్ ఆలోచన వల్లే ఈ సినిమా మొదలైయింది. విడుదల తర్వాత ఆయన ఆనందం మాటల్లో చెప్పలేం. చరణ్ తన సొంత సినిమా కంటే ఎక్కువ ఆనందపడ్డారు. గాడ్ ఫాదర్ లాంటి విజయం ఇండస్ట్రీకి అవసరం. ఇలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ వుంటుంది. ఎగ్జిబిటర్స్ అందరికి కూడా ఒక పండగలాంటి సినిమా గాడ్ ఫాదర్' అని చెప్పుకొచ్చాడు ఎన్వీ ప్రసాద్.
చదవండి: నిన్ను చంపేస్తా.. నటుడి భార్యకు నటి వార్నింగ్
పంజాబీ నటితో సింగర్ డేటింగ్
Comments
Please login to add a commentAdd a comment