మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్‌ఫాదర్ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం ప్రధాన బలంగా మారింది. ఊహించినదానికంటే ఎక్కువే కలెక్షన్స్ వచ్చాయని నిర్మాతలు సైతం సంతోషంగా ఉన్నారు. తాజాగా గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా సినిమా సక్సెస్‌ను మీడియాతో పంచుకున్నారు. పలువురు సెలబ్రిటీలు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారని తెలిపాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాకు మొదట రామ్‌చరణ్ ఫోన్ చేశాడు. అంతేకాక ఉదయం ఆరు గంటలకే నా దగ్గరకు వచ్చి అరగంటసేపు మాట్లాడారు. ఇది చాలు నాకనిపించింది. అల్లు అర్జున్ నాతో 21 నిమిషాలు మాట్లాడారు. పిచ్చెక్కించేశారు, సినిమా లడ్డూలా ఉందన్నారు. సాయిధరమ్ తేజ్ అయితే ఏకంగా ఆఫీస్‌కే వచ్చేసి అభినందించారు' అని చెప్పుకొచ్చాడు మోహన్ రాజా.
చదవండి: గరికపాటి వివాదంపై స్పందించిన చిరంజీవి
సినిమా ఛాన్స్ అని ఇంటికి పిలిచి..: నటి
Comments
Please login to add a commentAdd a comment