నో కట్స్‌.. | Mahesh Babu's 'Spyder' passed with U/A certificate | Sakshi
Sakshi News home page

నో కట్స్‌..

Published Tue, Sep 19 2017 12:54 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

నో కట్స్‌.. - Sakshi

నో కట్స్‌..

ఇటు టాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌ జనాల్లో, సినీ వర్గాల్లో ఇప్పుడు బాగా నానుతోన్న సినిమా ‘స్పైడర్‌’. మహేశ్‌బాబు, ఎ.ఆర్‌. మురుగదాస్‌ వంటి క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావడం.. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాతో మహేశ్‌ తమిళ చిత్రసీమలో అడుగుపెడుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మించిన ఈ భారీ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. సింగిల్‌ కట్‌ లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

దసరా కానుగా ఈ నెల 27న ‘స్పైడర్‌’ విడుదల కానుంది. ‘‘హేరిస్‌ జయరాజ్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలకు మంచి లభిస్తోంది. ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మహేశ్‌ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శక–నిర్మాతలు అన్నారు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌ శివన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement