యూరప్‌లో ఆటాపాటా | The release of Spider movie as Vijayadashmi gift | Sakshi
Sakshi News home page

యూరప్‌లో ఆటాపాటా

Published Thu, Jul 27 2017 3:03 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

యూరప్‌లో ఆటాపాటా - Sakshi

యూరప్‌లో ఆటాపాటా

ఆగస్ట్‌ ఫస్ట్‌ వీక్‌ మహేశ్‌బాబు హైదరాబాద్‌లో ఉండరు. మరెక్కడ ఉంటారు? అంటే, యూరప్‌లో. అక్కడ రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఆటాపాటాతో బిజీగా ఉండబోతున్నారు. ఈ బిజీ అంతా ‘స్పైడర్‌’ సినిమా కోసమే. ఈ ఇద్దరూ పాల్గొనగా యూరప్‌లో ఓ పాట చిత్రీకరించనున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 

ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఆగస్ట్‌ 1న యూరప్‌లో పాట చిత్రీకరణ మొదలుపెడతాం. అక్కడి బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేస్తాం. ఈ సాంగ్‌ చిత్రీకరణతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్‌తో ‘స్పైడర్‌’ నిర్మిస్తున్నాం. మిక్సింగ్, గ్రాఫిక్స్‌ పనులూ వేగంగా జరుగుతున్నాయి. విజయదశమి కానుకగా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్‌’ మధు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement