నేను ఒక్కసారి కమిట్‌ అయితే ప్రాణం పెడతా! | Spider movie Pre-release Function | Sakshi
Sakshi News home page

నేను ఒక్కసారి కమిట్‌ అయితే ప్రాణం పెడతా!

Published Sat, Sep 16 2017 1:01 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

నేను ఒక్కసారి కమిట్‌ అయితే ప్రాణం పెడతా! - Sakshi

నేను ఒక్కసారి కమిట్‌ అయితే ప్రాణం పెడతా!

– మహేశ్‌బాబు

‘‘నేను మద్రాస్‌కి వెళ్లినప్పుడు దర్శక–నిర్మాత చక్రపాణిగారి రైట్‌హ్యాండ్‌ కుటుంబారావుగారితో మాట్లాడుతున్నప్పుడు మా ముందు  ఓ కారు ఆగింది. ‘ఎవరీ అబ్బాయి’ అని ఆయన్ను దర్శకులు శ్రీధర్‌ అడిగారు. ‘ఊరు తెనాలి. సినిమాల్లో నటిద్దా’మని వచ్చాడన్నారు. రేపు ఆఫీసుకి వచ్చి కలవమని చెప్పడంతో వెళ్లా. ‘నా సినిమాలో మీరే హీరో’ అంటే, నాకు తమిళం రాదన్నా. ఓ నెల ట్యూటర్‌ని పెట్టి తమిళ్‌ నేర్పించేందుకు ప్రయత్నించారు. కానీ, నాకు రాకపోవడంతో మా ఊరు వెళ్లిపోయా.

అదే ‘కాదలిక్క నేరమిల్లై’. సూపర్‌డూపర్‌ హిట్‌’’ అన్నారు సూపర్‌స్టార్‌ కృష్ణ. మహేశ్‌బాబు, రకుల్‌ జంటగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ‘స్పెడర్‌’ ఈ నెల 27న విడుదలవుతోంది. శుక్రవారం ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. కృష్ట మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు మహేశ్‌ మద్రాస్‌లో ఉండటం వల్ల తమిళం బాగా వచ్చు. తన తొలి తమిళ సినిమా మురుగదాస్‌ దర్శకత్వంలో చేయడం సంతోషంగా ఉంది.

కచ్చితంగా ఈ  సిని మా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. మహేశ్‌ తమిళ్‌ బాగా మాట్లాడాడు’’ అన్నారు విజయనిర్మల. ‘‘తమిళ సినిమా చేయాలనే మహేశ్‌ కోరిక ‘స్పైడర్‌’తో నెరవేరింది. మురుగదాస్‌ మినిమమ్‌ గ్యారంటీ డైరెక్టర్‌’’ అన్నారు నిర్మాత జి. ఆదిశేషగిరిరావు. ‘‘మహేశ్‌ ఫ్యాన్స్‌ గర్వపడేలా, తలెత్తుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇండస్ట్రీలోని సూపర్‌హిట్‌ సినిమాల్లో ‘స్పైడర్‌’ ఒకటిగా నిలుస్తుంది’’ అన్నారు ఎన్వీ ప్రసాద్‌.

మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘రెండు భాషల్లో సినిమా తీయడం అంత ఈజీ కాదు. అది గ్రేట్‌ డైరెక్టర్స్‌ వల్లే అవుతుంది. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్, ప్యాషన్‌ ఉండాలి. అది ఈ చిత్రనిర్మాతలకు ఉంది. సంతోష్‌ శివన్‌గారితో పనిచేయాలనే నా కోరిక మురుగదాస్‌ వల్ల తీరింది. నేను ఒక్కసారి కథ ఒప్పుకుని సినిమా కమిట్‌ అయితే ప్రాణం పెట్టి చేస్తా. నా డైరెక్టర్లు నాకు దేవుళ్లతో సమానం. దర్శకులను నమ్మినందుకే ‘అతడు, పోకిరి, శ్రీమంతుడు, ఒక్కడు’ వంటి సినిమాలు వచ్చాయి.

అందువల్లే ఇంతవాణ్ణి అయ్యా. మీలాంటి అభిమానులు నాకు తెలిసి ఏ హీరోకూ ఉండరు. ఎందుకంటే.. నా సినిమా నచ్చితేనే చూస్తారు.. నచ్చకపోతే మీరే చూడరు. మీరెప్పుడూ అలాగే ఉండాలి. మీకోసం మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా’’ అన్నారు. ‘‘ఓ డైరెక్టర్‌కి మంచి స్ట్రెంత్‌ హీరో. అది మహేశ్‌లో ఉంది. ఏడాదిలో ఆర్నెల్లు నైట్‌ షూట్‌ చేశాం. ఏ రోజూ తను ఆలస్యంగా రాలేదు. త్వరగా వెళ్లలేదు. మహేశ్‌ డెడికేషన్‌కి ఈ ఫిల్మ్‌ డెడికేట్‌ చేస్తున్నా. నిర్మాతలు ఈ సినిమాకి పిల్లర్లు’’ అన్నారు మురుగదాస్‌.

‘‘నా కెరియర్‌లో బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘స్పైడర్‌’. నా డ్రీమ్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ అని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పా. కథ వినకుండా ఈ సినిమా ఓకే చేశా. మరోసారి మహేశ్‌తో పని చేయాలనుకుంటున్నా’’ అన్నారు రకుల్‌. ‘‘స్పైడర్‌’ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటుంది. చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్‌లో ‘మీకేం కావాలి’ అని మహేశ్‌ని అడిగినప్పుడు ‘ఈ జన్మకి నా ఫ్యాన్స్‌ చాలు’ అన్నారు. రజనీకాంత్‌గారికి ‘చంద్రముఖి’లా మహేశ్‌కి ‘స్పైడర్‌’ మిగిలిపోతుంది’’ అన్నారు ఎస్‌.జె.సూర్య.

నిర్మాతలు సి. అశ్వినీదత్, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, శానం నాగ అశోక్‌కుమార్, డీవీవీ దానయ్య, ‘దిల్‌’ రాజు, దర్శకులు కొరటాల శివ, వంశీ పైడిపల్లి, తమిళ నిర్మాత రాజు మహాలింగం, రిలయన్స్‌ సీఈఓ సుభాశిష్, ఎంపీ గల్లా జయదేవ్, నమ్రతా శిరోద్కర్, హీరో సుధీర్‌బాబు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు హ్యారీస్‌ జయరాజ్, కెమెరామెన్‌ సంతోష్‌ శివన్, ఫైట్‌మాస్టర్‌ పీటర్‌ హెయిన్, ‘ప్రేమిస్తే’ భరత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement