ప్రియమైన అతిథి | One of our beloved guest arrived. | Sakshi
Sakshi News home page

ప్రియమైన అతిథి

Published Sun, Jul 9 2017 11:50 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

ప్రియమైన అతిథి - Sakshi

ప్రియమైన అతిథి

మహేశ్‌బాబు గుడ్‌ ఫాదర్‌. ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం టైమ్‌ కేటాయిస్తారు. ఎక్కువ రోజులు షూటింగ్‌కి సెలవులు దొరికితే భార్యా–పిల్లలతో విదేశాలకు చెక్కేస్తారు. ఒకవేళ లోకల్‌లో ఉంటే, అప్పుడప్పుడూ పిల్లలను షూటింగ్‌ లొకేషన్‌కి తీసుకెళుతుంటారు. షాట్‌ గ్యాప్‌లో పిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేస్తారు. అలా ‘స్పైడర్‌’ సెట్‌కి కూతురు సితారను తీసుకెళ్లారు మహేశ్‌. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌ ‘స్పైడర్‌’ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రానికి సంతోష్‌ శివన్‌ ఛాయాగ్రాహకుడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మహేశ్‌–రకుల్‌పై ఓ సెట్‌ సాంగ్‌ తీస్తున్నారు. ‘‘మా సెట్‌కు ప్రియమైన అతిథి ఒకరు వచ్చారు. ఆ గెస్ట్‌ ఎవరో చూడండి’ అంటూ సంతోష్‌శివన్‌ తన కెమెరాలో బంధించిన తండ్రీకూతుళ్లు మహేశ్‌–సితార  చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే సితారతో దిగిన ఫొటోను చిత్రకథానాయిక రకుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. మొత్తానికి చిన్నారి సితార షూటింగ్‌ లొకేషన్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అయింది. ‘స్పైడర్‌’ యూనిట్‌కి ప్రియమైన అతిథి అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement