
శ్రీవారి సేవలో శృతిహాసన్
సాక్షి, తిరుమల: సినీ నటి శృతిహాసన్ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిర్మాత ఎన్‌వీ ప్రసాద్‌తో కలసి ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. శృతిహాసన్‌ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు.