
నటుడు విశాల్ తనపై చేసిన ఫిర్యాదు ఎంతో బాధించిందని ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆర్.బి.చౌదరిపై స్థానిక టి.నగర్ పోలీసుస్టేషన్‌లో విశాల్ ఫిర్యాదు చేశారు. దీంతో విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరిలను వివరణ కోరుతూ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా విశాల్ ఫిర్యాదుపై నిర్మాత ఆర్.బి.చౌదరి స్పందించారు. విశాల్ తన నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన విషయం వాస్తవమేనన్నారు. అయితే ఆయన ఇచ్చిన హామీ పత్రాలు, చెక్కులు దర్శకుడు శివకుమార్ వద్ద భద్రపరిచినట్లు చెప్పారు.
ఆయన హఠాత్తుగా మరణించడంతో ఆ పత్రాలు కనిపించలేదని తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా విశాల్ తనపై ఫిర్యాదు చేసి ఉంటారని అన్నారు. అయితే ఈ విషయమై ఆయన తనతో మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు. ఇన్నేళ్ల తన సినీ జీవితంలో ఇలాంటి ఫిర్యాదును తాను ఎదుర్కోలేదన్నారు. విశాల్ చేసిన ఫిర్యాదు తనను ఎంతగానో బాధించిందన్నారు. విశాల్‌కు సంబంధించిన చెక్కులు, హామీ పత్రాలను శివకుమార్ ఎవరికైనా ఇచ్చివుంటే వాటిని తనకు లేదా విశాల్‌కు గాని, లేదా పోలీసులుకు అందించాలని విజ్ఞప్తి చేశారు. దుర్వినియోగం చేయాలని భావిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: దొంగతనం కేసులో ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్ యాక్టర్స్ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment