
నటుడు విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరిలకు పోలీసులు శనివారం సమన్లు జారీ చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్‌బీ చౌదరిపై స్థానిక టి.నగర్ పోలీసుస్టేషన్‌లో విశాల్ ఫిర్యాదు చేశారు. తాను కథానాయకుడిగా నటించి నిర్మించిన ఇరుంబు తిరై చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత ఆర్.బి.చౌదరి నుంచి కొంత రుణం తీసుకున్నానని తెలిపారు. ఆయనకు డాక్యుమెంట్లు, చెక్కులను అందించినట్లు చెప్పారు. నగదు తిరిగి చెల్లించినా డాక్యుమెంట్లు, చెక్కులను ఇవ్వలేదని ఆరోపించారు. అడిగితే అవి మిస్ అయ్యాయని బదులిచ్చారన్నారు.
విశాల్ ఆరోపణలపై స్పందించిన నిర్మాత ఆర్.బి.చౌదరి.. విశాల్ తనతో పాటు తిరుపూర్ సుబ్రమణ్యం వద్ద అప్పు తీసుకున్నారన్నారు. ఆయన ఇచ్చిన డాక్యుమెంట్స్, చెక్కుల వ్యవహారాలను ఆయుధ పూజ చిత్ర దర్శకుడు శివకుమార్ చూసుకునేవారన్నారు. ఇటీవల శివకుమార్ గుండెపోటుతో మరణించడంతో ఆయన భద్రపరచిన డాక్యుమెంట్‌లను తాము గుర్తించలేకపోయామన్నారు. విశాల్ అప్పు చెల్లించేశాడని..అయితే పత్రాలు లేకపోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయని విశాల్ భయపడుతున్నారని ఆర్‌బీ చౌదరి వివరణ ఇచ్చారు. విశాల్ ఫిర్యాదు మేరకు టీ.నగర్ పోలీసులు స్టేషన్‌కు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా నటుడు విశాల్, నిర్మాత ఆర్.బి.చౌదరికి శనివారం సమన్లు జారీ చేశారు.
చదవండి:
కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ...
విక్రమ్ మరో ప్రయోగం.. ‘కోబ్రా’ నయా లుక్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment