![Director Amma Rajasekhar Thala Movie Review in Telugu](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/movie.jpg.webp?itok=u0PwWvVO)
టైటిల్: తల
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
ఎడిటర్ : శివ సామి
ప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్‌లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. అంకిత నస్కర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తల సినిమా (Thala Movie Review) ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..
కథ
హీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే!
ఎవరెలా నటించారంటే?
అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా చూపించాడు. అయితే తన వయసుకు మించిన యాక్షన్ సీన్స్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ అంకిత బాగా నటించింది. చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్.. హీరో తండ్రి పాత్రకు ప్రాణం పోశారు. ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే ఎస్తర్ నోరోన్హా ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్‌తో ఎమోషన్ పండించింది. మిగతావారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక విశ్లేషణ
ఈ చిత్రానికి కథ ప్రాణమని చెప్పుకోవాలి. ట్రైలర్‌లో చెప్పినట్లుగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న ఈ జనరేషన్‌లో అమ్మకోసం కష్టపడే కొడుకు కథగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే అక్కడక్కడా కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. హింస ఎక్కువగా ఉంది.
చదవండి: క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్
Comments
Please login to add a commentAdd a comment