మాస్టర్‌ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్‌ | Bigg Boss 4 Telugu : Amma Rajasekhar Sensational Decision | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : మాస్టర్‌ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్‌

Published Sun, Nov 1 2020 6:23 PM | Last Updated on Sun, Nov 1 2020 6:32 PM

Bigg Boss 4 Telugu : Amma Rajasekhar Sensational Decision - Sakshi

బిగ్‌బాస్‌ నాల్గొ సీజన్‌లో ఊహించనవి చాలానే జరుగుతున్నాయి. చాలా వారాల పాటు ఉంటుందనుకున్నదేవి నాగవల్లి మూడో వారంలోనే బయటకు వచ్చేసింది. స్ట్రాంగ్‌ అవుతున్నాడనుకుంటున్న కుమార్‌సాయిని అనూహ్యంగా బయటకు వచ్చేశాడు. ఇక చివరి వరకు ఉంటుదనుకుంటున్న గంగవ్వ, టాప్‌ 5లో ఉంటాడనుకున్న నోయల్‌ అనారోగ్యంతో అర్థాంతరంగా బయటకు వెళ్లిపోయారు. నోయల్‌ వెళ్లడంతో ఇక ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదనుకుంటున్న తరుణంలో తాజా ప్రోమో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వారం మరో ఎలిమినేషన్‌ ఉటుందన్నట్లుగా హింట్‌ ఇస్తూ ప్రోమో విడుదల చేశారు.
(చదవండి : బిగ్‌బాస్‌ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే)

తాజా ప్రోమో ప్రకారం అమ్మ రాజశేఖర్‌, మెమబూబ్‌ డేంజర్‌ జోన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మోనాల్‌, అరియానాను సేవ్‌ చేసి ఈ ఇద్దర్నీ మాత్రం కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు నాగార్జున. ‘ఒకరు డాన్సర్.. మరొకరు డాన్స్ మాస్టర్. ఒకరు గురువు.. మరొకరు శిష్యుడు.. ఈ ఇద్దరిలో ఎవరు హౌజ్‌కు అవసరం.. ఎవరు అవసరం లేదో మీరే నిర్ణయించుకోండి’ అని ఎలిమినేషన్‌ కత్తిని వారి చేతికే ఇచ్చేశాడు.ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి మెహబూబ్ మాత్రమే బయటికి వచ్చాడు. రాజశేఖర్‌ మాస్టర్‌ కనిపించడం లేదు.. మరోవైపు అమ్మ రాజశేఖర్‌ను చూస్తూ మెహబూబ్ భోరున ఏడ్చేస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తుంటే మాస్టర్‌ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడేమో అనిపిస్తుంది. మరి ఇది నిజమా కాదా అని తెలియాలంటే మరికొన్ని గంటలు వేడి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement