బిగ్‌బాస్‌: మాస్టర్‌ను ఇంటికి పంపించాల్సిందే.. | Bigg Boss: Netizens Trolling Amma rajasekhar For Captaincy Task | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: మాస్టర్‌పై పెరుగుతున్న నెగిటివిటీ

Published Sat, Nov 7 2020 12:09 PM | Last Updated on Sat, Nov 7 2020 2:51 PM

Bigg Boss: Netizens Trolling Amma rajasekhar For Captaincy Task - Sakshi

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్ల ప్రయాణం సగం ముగిసింది. మిగిలిన రోజుల్లో వారి ఆట మరింత కఠినంగా ఉండనుందని బిగ్‌బాస్‌ ముందే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఎన్నడూలేని విధంగా బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంటి కొత్త కెప్టెన్‌గా ఎన్నికైన అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ నియంతలా మారి హౌజ్‌మెట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు పిల్లిలా ఉన్న మాస్టర్‌ ఇప్పుడు పులిలా పంజా విసురుతున్నారు. తన మాట శాసనం అనేలా ప్రవర్తిస్తున్నాడు. పనుల విభజనలో భాగంగా తనకు నచ్చని వారికి ఎక్కువ పనులు  అప్పజెప్పుతూ, తన స్నేహితులైన అరియానా, మెహబూబ్‌, అవినాష్‌కు చిన్న పనులు చెప్పాడు. ఈ క్రమంలో హౌస్‌లో పెద్ద ర‌భ‌స చోటు చేసుకుంది. మాస్టర్‌ ఇచ్చిన పనులపై ఇంటి సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. తాము ఆ పనులు చేయలేమని ముఖం మీద కొట్టినట్లు చెప్పారు. అయినప్పటికీ మాస్టర్‌ తన పంతా మార్చుకోకుండా అలాగే ప్రవర్తించాడు. దీంతో ఇంట్లోని వాతావరణం మరింత వేడిగా మారింది. చదవండి: 'మాస్ట‌ర్‌' ప్లాన్‌: ఇక హారిక‌, అభిల‌కు చుక్క‌లే..

అయితే మాస్టర్‌ కెప్టెన్సీ విధానంపై ఇంటిలోని సభ్యులతోపాటు నెటిజన్లు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో మాస్టర్‌పై తీవ్ర ట్రోలింగ్‌ చేస్తున్నారు.  కెప్టెన్సీ టాస్కులు అన్ని పరమ చెత్తగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకేందుకు ఈ టాస్క్‌లు డైరెక్ట్‌ అమ్మ రాజశేఖర్‌కు కెప్టెన్‌ ఇవ్వండి అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు. అసలు కెప్టెన్సీ టాస్క్‌ విషయంలోనే మాస్టర్‌ను తప్పుపడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయికి ఫిజికల్‌ టాస్క్‌ ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఇద్దరు అమ్మాయిలతో ఒక మగవారికి టాస్క్‌ ఇవ్వడం వల్ల అమ్మాయిలు కొంచెం ఇబ్బందిగా ఫీల్‌ అవుతారని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మా ఆయ‌న లేక‌పోతే బిగ్‌బాస్ షో లేదు

కాగా పల్లెకు పోదాం ఛలో టాస్క్‌ అనంతరం రింగులో రంగు అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇవ్వగా ఇందులో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ పోటీదారులుగా ఉన్నారు. చేతికి గంతలు కట్టుకొని చేతిని రంగులో ముంచి ఒకరికి మరొకరు రంగును అంటించుకోవాలి. ఈ టాస్క్‌లో అత్యధిక రంగు హారిక టీషర్ట్‌పై, తరువాత అరియానా మీద కూడా కొద్దిగా రంగు పడింది. అసలు రంగు పడకుండా తప్పించుకున్న మాస్టర్‌ ఇంటి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. కెప్టెన్‌ అనంతరం మాస్టర్‌ ప్రవర్తనలో మరింత మార్పు వచ్చింది. ఈ క్రమంలో హౌజ్‌లో అందరి కంటే మాస్టర్‌పై నెగిటివిటీ పెరిగిపోతుందని, అతన్ని ఎలిమినేట్‌ చేయకుండా ఎందుకు సేవ్‌ చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇలా చేయడం వల్ల షోపై జనాలు ఆసక్తి తగ్గిపోతుందని అంటున్నారు. కొంతమంది కంటెస్టెంట్లపై ఫేవరిజం చూపిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవారం ఎలాగైనా తనను ఇంటికి పంపిచేయాల్సిందేనని వాదిస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్‌: కెప్టెన్‌గా మాస్ట‌ర్‌, మ‌రి ఎలిమినేష‌న్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement