రెండో రణం | 'Amma' Rajasekhar turns hero with Ranam 2 | Sakshi
Sakshi News home page

రెండో రణం

Published Mon, Dec 29 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

రెండో రణం

రెండో రణం

 గోపీచంద్ హీరోగా ‘అమ్మ’రాజశేఖర్ తెరకెక్కించిన ‘రణం’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ‘రణం-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీనివాస యాదవ్ నిర్మాత. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో వి.వి.వినాయక్, గోపీచంద్, సి.కల్యాణ్‌ల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమా విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ -‘‘రెండేళ్లు పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చేశాం. నాలోని పూర్తి స్థాయి దర్శకుణ్ణి ఆవిష్కరించే సినిమా అవుతుందని నా నమ్మకం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: శ్రీనాథ్ నార్ల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement