Ranam 2
-
మరోసారి యుద్ధం
తొమ్మిదేళ్ల క్రితం గోపీచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వలో వచ్చిన ‘రణం’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రణం-2’ రాబోతోంది. అమ్మ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, నిధి కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర మూవీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస యాదవ్ నిర్మించారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని వాణిజ్య హంగులను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పక విజయం సాధిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరామ్యాన్: శ్రీధర్. -
రెండో రణం
గోపీచంద్ హీరోగా ‘అమ్మ’రాజశేఖర్ తెరకెక్కించిన ‘రణం’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ ‘రణం-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీనివాస యాదవ్ నిర్మాత. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో వి.వి.వినాయక్, గోపీచంద్, సి.కల్యాణ్‌ల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సినిమా విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ -‘‘రెండేళ్లు పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చేశాం. నాలోని పూర్తి స్థాయి దర్శకుణ్ణి ఆవిష్కరించే సినిమా అవుతుందని నా నమ్మకం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: సుద్దాల అశోక్‌తేజ, కెమెరా: శ్రీనాథ్ నార్ల.