
మరోసారి యుద్ధం
తొమ్మిదేళ్ల క్రితం గోపీచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వలో వచ్చిన ‘రణం’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రణం-2’ రాబోతోంది. అమ్మ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, నిధి కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస యాదవ్ నిర్మించారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని వాణిజ్య హంగులను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పక విజయం సాధిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరామ్యాన్: శ్రీధర్.