
ఇమ్మార్టెల్, అమ్మ రాజశేఖర్, అలీషా, షాలిని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎస్.ఎస్.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డెరైక్టర్). కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఈడీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నటి–దర్శకురాలు జీవిత, నటుడు రాజశేఖర్‌లు కెమెరా స్విచాన్ చేయగా, ‘పసుర’ గ్రూప్ ఆఫ్ కంపెనీల యం.డి. ప్రశాంత్ కుమార్ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు.
కట్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీలోని వారి మనస్తత్వాలు, వారి జీవన విధానం, వారి జీవితంలో ఉండే కష్టాలు వంటి వాస్తవ ఘటనల నేపథ్యంలో చిత్రకథ సాగుతుంది’’ అన్నారు. ‘‘ఫుల్‌గా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమిది’’ అన్నారు ఈడీ ప్రసాద్. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కెమెరామేన్ గోవర్ధన్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment