బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఊహించడం రానురానూ కష్టంగా మారుతోంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు దేవి నాగవల్లి, కుమార్ సాయిని పంపించేయడం, అనారోగ్య కారణాలతో గంగవ్వ, నోయల్ స్వచ్ఛందంగా బయటకు రావడంతో అసలు ఎప్పుడేం జరుగుతుందనేది అర్థం కాక ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. నిజానికి గతవారం తక్కువ ఓట్లు పడ్డ అమ్మ రాజశేఖర్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి ఉంది. కానీ కాలు నొప్పితో బాధపడుతున్న నోయల్ అకస్మాత్తుగా షో నుంచి నిష్క్రమిస్తూ ఎవరినీ ఎలిమినేట్ చేయవద్దని కోరాడు. అలా ఆ వారం తప్పించుకున్న మాస్టర్ ఈసారి మళ్లీ నామినేషన్‌లో ఉన్నారు. ఆయనతో పాటు హారిక, అభిజిత్, మోనాల్, అవినాష్ కూడా నామినేషన్ లిస్టులో ఉన్నారు. (చదవండి: టీఆర్పీలో నాగ్‌ను మించిపోయిన సమంత)
మరో రెండు వారాలు హౌస్‌లోనే..
కానీ వీరిలో మాస్టర్ ఒక్కడే పెద్ద ఎత్తున వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. దీంతో ఈసారి ఆయనను ఎలిమినేషన్ నుంచి ఎవరూ కాపాడలేరు అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలోనే మరో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. మాస్టర్ కెప్టెన్‌గా అవతరించాడని, దీంతో మరో రెండు వారాలు ఇంట్లో పాగా వేసేందుకు రెడీ అయ్యాడని భోగట్టా. అయితే కెప్టెన్ అయిన వ్యక్తికి తర్వాత వారం మాత్రమే నామినేషన్ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ అప్పటికే ఎలిమినేషన్ జోన్‌లో ఉంటే వేటు పడే అవకాశాలు చాలా అరుదనే చెప్పాలి. (చదవండి: బిగ్‌బాస్: ఎలిమినేషన్‌కు బదులు కొత్త ప్రయోగం)
సీక్రెట్ రూమ్‌కు పంపించే అవకాశం?
జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్వవహరించిన రెండో సీజన్‌లో ముమైత్ ఖాన్‌ను రెండు రోజుల పాటు సీక్రెట్ రూమ్‌లోఉంచి తిరిగి హౌస్‌లోకి పంపించారు. కానీ ఆ అవకాశాన్ని ఆమె దుర్వినియోగం చేసుకుంది. ఆమె ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. ఫలితంగా ముమైత్ మళ్లీ ఎలిమినేట్ అయింది. ఆ సమయంలో ఆమె కెప్టెన్ కావడం గమనార్హం. మరి ఈసారి కూడా బిగ్‌బాస్.. అమ్మ రాజశేఖర్ కెప్టెన్సీని పట్టించుకోకుండా ఎలిమినేట్ చేస్తాడా? లేదా అతడిని సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తాడా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఉత్కంఠ రేపుతున్న తొమ్మిదోవారం ఎలిమినేషన్ మీద నాగార్జున ఎలాంటి ట్విస్టులు ఇస్తారో వేచి చూద్దాం.. (చదవండి: బిగ్‌బాస్: ఇవే తగ్గించుకుంటే మంచిది)
Comments
Please login to add a commentAdd a comment