'ఎన్నాళ్లో వేచిన హృదయం.. ఈ వారం ఎదురవుతుంటే..' అని బిగ్‌బాస్ ప్రేమికులు సోమవారం నుంచి తెగ పాటలు పాడేసుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. కొంతకాలంగా నామినేషన్‌లోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్న అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ఈ వారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చేశారు. వీళ్లిద్దరిలో బయటకు వచ్చే ఛాన్సులు మాస్టర్‌కే ఎక్కువగా ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పెట్టుకుంటూ, క్యారెక్టర్‌ను నిందిస్తూ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నాడు. మొదట్లో అతి చేసినట్లు అనిపించిన మెహబూబ్ ఈ మధ్య తగ్గి ఉంటున్నాడు. అలానే టాస్కుల్లోనూ ఇరగదీస్తుండటంతో ఎలిమినేషన్ నుంచి బయటపడే చాన్సులు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాస్టర్ మాత్రం తన గొయ్యి తానే తవ్వుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. (చదవండి: బిగ్‌బాస్: మాస్టర్ కాళ్లు పట్టుకున్న సోహైల్)
రేషన్ మేనేజర్ అయితే ఎలిమినేషన్ నుంచి సేఫా?!
ఇలాంటి క్లిష్ట సమయంలో అమ్మ రాజశేఖర్ టాస్క్‌లు బాగా ఆడుతూ, కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఓట్లను ఆకర్షించాల్సి ఉంటుంది. కానీ ఆయన దానికి బదులు వేరే రూటు ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ ప్రారంభంలో సేఫ్ గేమ్ ఆడి అడ్డంగా దొరికిపోవడంతో అప్పటి నుంచి గేమ్‌కు స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించాడు. అయితే ఇప్పుడు మరో ఎమోషనల్ డ్రామా ఆడుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి టాస్క్‌లో మెహబూబ్‌తో పాటు మాస్టర్.. అరియానాకు సపోర్ట్ చేశాడు. చివరికి కెప్టెన్ అయిన అరియానా.. మోనాల్‌ను రేషన్ మేనేజర్(RM)గా నియమించింది. ఇది ఆయనకు అస్సలు మింగుడుపడలేదు. సపోర్ట్ చేసిన తనకు ఆ బాధ్యతను అప్పజెప్పాల్సిందని అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అసలే నామినేషన్‌లో ఉన్న తనకు RM ఇస్తే సపోర్ట్ అయ్యేదని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. దీంతో ఆయన అసలు బాధ అర్థమైన అరియానా RM అయితే సేవ్ అవుతారని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. (చదవండి: విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టినట్లు ఉంది: మాస్టర్)
కెమెరాల ముందు మాస్టర్ యాక్టింగ్!
ఈ వ్యవహారంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రేషన్ మేనేజర్ అయితే సేఫ్ అవుతారా? ఇది చూసి నాగార్జున కూడా షాక్ అవుతారేమోనని సెటైర్లు విసురుతున్నారు. అరియానాపై నోటికొచ్చినట్లు అరిచి చివర్లో కెమెరాల ముందు బలవంతంగా కన్నీళ్లు పెట్టుకోవడం దేనికని మాస్టర్‌ను విమర్శిస్తున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల ఎవరూ ఓట్లు వేయరని చెప్తున్నారు. నిజంగా ఆయన రేషన్ మేనేజర్ అవ్వాలనుకుంటే.. ఆ విషయాన్ని ముందే అరియానాకు చెప్తే సరిపోయేది. అలా చెప్పినప్పటికీ నియమించకపోతే ఇంత సీను చేసినదానికి ఓ అర్థంపర్థం ఉండేదని అభిప్రాయపడుతున్నారు. టాస్కుల్లో ఎలాగో స్పోర్టివ్‌నెస్ లేదు, మళ్లీ దీనికి పనికిరాని గొడవలు పెట్టుకోవడమెందుకని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటివి తగ్గించుకుంటే కాస్తైనా ఓట్లు రాలుతాయని సూచిస్తున్నారు. (చదవండి: కాస్త క్లోజ్‌గా ఉంటే లవ్వా?: మాస్టర్ భార్య)
Comments
Please login to add a commentAdd a comment