బిగ్‌బాస్‌: టాస్క్‌లో ప‌డిపోయిన అవినాష్‌ | Bigg Boss 4 Telugu: Avinash Suddenly Fell Down During Task | Sakshi
Sakshi News home page

స్వాతి విష‌యంలో అభిజిత్‌ను నిల‌దీసిన హారిక‌

Published Wed, Sep 30 2020 11:17 PM | Last Updated on Thu, Oct 1 2020 8:38 PM

Bigg Boss 4 Telugu: Avinash Suddenly Fell Down During Task - Sakshi

కాయిన్లు సంపాదించాల‌నేది బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌. దొంగ‌త‌నం చేయ‌డం కూడా టాస్క్‌లో ఓ భాగమే. కానీ రాత్రిపూట కూడా నిద్ర‌పోకుండా జాగారం చేసి మ‌రీ అంద‌రి కాయిన్లు నొక్కేసినందుకు సోహైల్‌పై మిగ‌తా హౌస్‌మేట్స్ అరిచారు. పైగా ఎవ‌రి కాయిన్లు తీయ‌ను అంటూ అంద‌రినీ న‌మ్మిస్తూనే నొక్కేసిన మాస్ట‌ర్.. త‌న కాయిన్లు పోయినందుకు సోహైల్‌పై క‌క్ష క‌ట్టాడు. అస‌లే అతిగా ఆవేశ‌ప‌డే అత‌డు.. అంద‌రూ త‌న‌నే టార్గెట్ చేయడంతో క‌థ వేరే ఉంట‌ది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక‌ ఈ ఆట‌లో గంగ‌వ్వ పాల్గొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

గుట్టు ర‌ట్ట‌వుతుంద‌ని మాస్ట‌ర్ కంగారు
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా కొంద‌రు క‌ష్ట‌ప‌డి కాయిన్లు సేక‌రిస్తుంటే మ‌రికొంద‌రు వాటిని నొక్కేయ‌డంపైనే దృష్టి సారించారు. అలా హారిక కాయిన్ల‌ను సోహైల్‌ లేపేయగా, అక్క‌డ దాచాన‌ని ఎవ‌రు చెప్పార‌ని అడిగింది. త‌ర్వాత చెప్తానులే అని మెహ‌బూబ్ బ‌దులిచ్చాడు. దీంతో ఎవ‌రెవ‌రు కాయిన్లను ఎక్క‌డెక్క‌డ‌ పెట్టుకున్నార‌నేది అంద‌రికీ జార‌వేస్తున్న‌ మాస్ట‌ర్ త‌న గుట్టు ఎక్క‌డ‌ బ‌య‌ట‌ప‌డిపోతుందోన‌ని భ‌య‌ప‌డ్డాడు. నాతో మాట్లాడ‌కు అంటూ మెహ‌బూబ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అభితో కాస్త దూరంగా ఉంటున్న హారిక ఈ రోజు అస‌లు స‌మ‌స్య‌ను అత‌డి ముందు ఏకరువు పెట్టింది. నువ్వు స్వాతికెందుకు స‌పోర్ట్ చేస్తున్నావు అని నిల‌దీసింది. ఆమె వ‌చ్చి రెండు, మూడు రోజులే అవుతుంది, త‌న‌కిచ్చిన ప‌ని కూడా చేయ‌లేక‌పోతోంది, డేంజ‌ర్ జోన్‌లోనూ ఏమీ లేదు. అలాంటిది ఆమె కోసం కింద‌ప‌డీ, కొట్లాడీ నాణాలు సేక‌రించాల్సిన ప‌నేంట‌ని ప్ర‌శ్నించింది. ఇది నేను జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని చెప్పుకొచ్చింది. నా స్నేహితుడు అయి ఉండి నాకిస్తావ‌నుకున్నా అని చెప్ప‌డంతో అభిజిత్ చేయి ప‌ట్టుకుని సారీ చెప్పాడు. 

రాత్రంతా జాగారం చేసి మ‌రీ దొంగ‌త‌నం
త‌ర్వాత‌ స్విచ్ కాయిన్‌ను మెహ‌బూబ్ చేతులారా కింద‌ప‌డేశాడు. అదే ముఖ్య‌మైన కాయిన్ అని బిగ్‌బాస్ ప్ర‌క‌టించ‌డంతో తెల్ల‌ముఖం వేసిన మెహ‌బూబ్‌కు సోహైల్ క్లాస్ పీకాడు. ఆ త‌ర్వాత అంద‌రూ ప‌డుకున్నాక సోహైల్, లాస్య‌, అరియానా డీల్ మాట్లాడుకుని మాస్ట‌ర్ ద‌గ్గ‌ర ఉన్న మొత్తాన్ని లేపేశారు. ఆనందంతో సోహైల్ తీన్మార్ డ్యాన్స్ చేశాడు. కానీ తిట్లు, అప‌నింద‌లు మాత్రం అత‌డి మీద‌నే వ‌చ్చి ప‌డ్డాయి. సుజాత‌, నోయ‌ల్ ద‌గ్గ‌ర కూడా మెహ‌బూబ్‌ కాయిన్లు తీసుకుని ఉడాయించాడు. అంద‌రూ గుర్రు పెట్టి నిద్ర‌పోతున్నా రాత్రంతా జాగారం చేసి మరీ క‌ష్ట‌ప‌డి దోచుకుని సోహైల్‌, మెహ‌బూబ్ కిలాడీ దొంగ‌ల్లా నిలిచారు. (చ‌ద‌వండి: ఎలిమినేష‌న్: అత‌డు కాదు ఆమె!)

గంగ‌వ్వ మాత్రం సోహైల్‌కే స‌పోర్ట్‌
పొద్దునే త‌న కాయిన్లు క‌నిపించ‌క‌పోయేస‌రికి షాకైన మాస్ట‌ర్‌ సోహైల్‌పై ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. మీరు ఎలా గెలుస్తారో చూస్తాన‌ని స‌వాలు విసిరాడు. చూస్తేనే దొంగ‌ల్లా ఉన్నారంటూ, వాళ్ల‌ను కొట్టేయాల‌న్నంత క‌సితో ర‌గిలిపోయాడు. ఈ కోపం నుంచి బ‌య‌ట‌ప‌డ‌ని మాస్ట‌ర్‌.. కుమార్‌పై త‌న చిరాకు ప్ర‌ద‌ర్శించాడు. అత‌డిని నోరు మెద‌ప‌నీయ‌కుండా చుల‌క‌న‌గా మాట్లాడాడు. అనంత‌రం బ్రాండ్లు క‌నిపించ‌కుండా బ‌ట్ట‌లు ఆరేస్తున్నార‌ని, వాటిని తీసేయాల‌ని బిగ్‌బాస్ లేఖ పంపించాడు. దీంతో అంద‌రూ సోహైల్‌, మెహ‌బూబ్ కాయిన్లపై ప‌రిచిన వస్త్రాన్ని తీసేయాల‌ని గొడ‌వ చేశారు. కానీ గంగ‌వ్వ, అఖిల్‌ మాత్రం స‌పోర్ట్ చేశారు. అక్క‌డ బ్రాండ్ వ‌స్తువులే లేవ‌ని తేల్చి చెప్పారు. అనంత‌రం కిల్ల‌ర్ కాయిన్స్ టాస్క్ మొద‌టి లెవ‌ల్ పూర్తైన‌ట్లు బిగ్‌బాస్ ప్ర‌క‌టించాడు. (చ‌ద‌వండి: నేను పెళ్లి చేసుకోడానికి రాలేదు: అఖిల్‌)

మెహ‌బూబ్‌కే ఎక్కువ పాయింట్లు
ఈ టాస్క్‌లో అవినాష్ 3160, మాస్ట‌ర్ 320, స్వాతి 1930, లాస్య 1560, అభిజిత్ 1770, నోయ‌ల్ 900, హారిక 1450, సోహైల్ 3620, మెహ‌బూబ్ 4360, మోనాల్ 610, అఖిల్ 2570, అరియానా 1850, దివి 110, కుమార్ 1570, సుజాత 340 + స్విచ్ కాయిన్ సంపాదించుకున్నారు. కానీ ఇక్క‌డితో ఆట పూర్త‌వ‌లేదు. ఇప్పుడు వీటిని కాపాడుకోవ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది రెండో ద‌శలో కిల్ల‌ర్ కాయిన్‌ను ఎవ‌రిపై అతికిస్తే వారి స‌గం పాయింట్లు ఆవిరైపోతాయి. అంద‌రూ సోహైల్ మీదే ప‌గ ప‌ట్ట‌డంతో ఒక‌రినే టార్గెట్ చేస్తే క‌థ వేరే ఉంట‌ద‌ని హెచ్చ‌రించాడు. దీంతో మాస్ట‌ర్‌, సోహైల్ ఒక‌రి మీద ఒక‌రు అరుచుకున్నారు. త‌ర్వాత మోనాల్ అవుట్ అయింది. ఇంత‌లో అవినాష్ సొమ్మ‌సిల్లి కింద‌ప‌డిపోయాడు. ఏమ‌య్యిందోన‌ని కంగారు ప‌డిపోగా కాలు బెణికింద‌ని చెప్పాడు. దీంతో అత‌డిని ఎత్తుకుని మెడిక‌ల్ రూమ్‌కు తీసుకెళ్లారు. ఇక మాస్ట‌ర్ కాయిన్లు అందరూ దొంగిలించినా త‌నను మాత్ర‌మే ప్ర‌శ్నించార‌ని మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: రెండో వారం ప‌డిపోయిన టీఆర్పీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement