‌జ‌బ‌ర్ద‌స్త్‌లోకి మ‌ళ్లీ రానిచ్చేది లేద‌న్నారు: అవినాష్ | Bigg Boss 4 Telugu: No Immunity For Nominated Members | Sakshi
Sakshi News home page

ఏయ్ హారిక‌, నోర్మూయ్‌: చెల‌రేగిన మాస్ట‌ర్

Published Tue, Nov 3 2020 11:32 PM | Last Updated on Wed, Nov 4 2020 2:46 PM

Bigg Boss 4 Telugu: No Immunity For Nominated Members - Sakshi

సోమ‌వారం గ‌రంగ‌రంగా ప్రారంభ‌మైన నామినేష‌న్ ప్ర‌క్రియ నేడు పీక్స్‌కు వెళ్లింది. మిస్ట‌ర్ కూల్ అభిజిత్ ఎదుటివాళ్ల మాట వినిపించుకోని మాస్ట‌ర్‌పై త‌న ప్ర‌తాపాన్ని చూపించాడు. అఖిల్ త‌ను ఎంతో ఇష్ట‌ప‌డే మోనాల్‌ను నామినేట్ చేశాడ‌న్న మాటే కానీ ఆమె బాధ‌ప‌డుతుంటే చూడ‌లేక‌పోయాడు. సోహైల్‌, మెహ‌బూబ్‌తో గొడ‌వ పెట్టుకున్నాడు. ద‌గ్గ‌ర‌కు వెళ్లి ముఖానికి ప‌ట్టిన దుమ్మును తొల‌గించాడు. కానీ ఆమె మ‌నుసులో ర‌గులుతున్న ఘోష‌ను అర్థం చేసుకోలేక‌పోయాడు. మరి నేటి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

నా లైఫ్‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నారు: మాస్ట‌ర్‌
నిన్న అవినాష్‌ను నామినేట్ చేసిన అభిజిత్ నేడు అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై కోడిగుడ్డు ప‌గ‌ల‌గొట్టాడు. దీంతో అస‌హ‌నంతో ఊగిపోయిన మాస్ట‌ర్‌ అభికి మాట్లాడే చాన్సివ్వ‌కుండా అర్థం ప‌ర్థం లేని మాట‌ల‌న్నీ అనేశాడు. న‌న్ను మాట్లాడ‌నివ్వ‌క‌పోతే ఊరుకోను అని అభి హెచ్చ‌రించ‌డంతో న‌న్ను కొడ‌తావా? అని మాస్ట‌ర్ మ‌రింత రెచ్చ‌గొట్టాడు. అంద‌రూ నా జీవితాన్ని అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌లో దూరేందుకు అవినాష్ ప్ర‌య‌త్నించ‌గా హారిక మ‌ధ్య‌లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికింది. అప్ప‌టికే నిప్పు క‌ణంలా ఎగిరెగిరి ప‌డుతున్న మాస్ట‌ర్ ఆవేశంలో హారిక‌ను నోరు మూర్మోయ్ అంటూ నోరు జారాడు. అటు అభిని కూడా కుర్చీలో కూర్చోవ‌డం కాదు, ద‌మ్ముంటే టాస్కు ఆడు అని స‌వాలు విసిరాడు. అంద‌రి మీద అరిచి చివ‌ర‌లో మాత్రం నేను ఎవ‌రినీ నామినేట్ చేయ‌నంటూ విసురుగా వెళ్లిపోయి ఏడ్చేయ‌డం గ‌మ‌నార్హం. 

మోనాల్‌ను త‌న‌వైపు తిప్పుకుంటున్న మాస్ట‌ర్‌!
త‌ర్వాత హారిక అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌ను, లాస్య అవినాష్‌, మోనాల్‌ను, మోనాల్‌.. సోహైల్‌, లాస్య‌ను, అమ్మ రాజ‌శేఖ‌ర్‌.. అభిజిత్‌, అఖిల్‌ను, మెహ‌బూబ్‌.. హారిక‌, అవినాష్‌ను నామినేట్ చేశారు. మీరు పోతా పోతా అన్న‌ప్పుడు పంపించ‌డానికి రెడీ అని అఖిల్ మాస్ట‌ర్ మీద గుడ్డు ప‌గ‌ల‌గొట్టాడు. లాస్ట్ టాస్క్‌లో ప‌ర్ఫామ్ చేయ‌లేదు, నీకు క్లారిటీ లేదు అనిపించింది అని మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్ అయిన మోనాల్ శిలా విగ్ర‌హంలా నిల్చుండిపోయింది. దొరికిందే ఛాన్స్ అనుకున్న మాస్ట‌ర్‌ ఈ గొడ‌వ‌ను త‌గ్గించడానికి బ‌దులు పెంచే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు క‌నిపించింది. నీ గేమ్ నువ్వు ఆడు అని మొద‌టి నుంచే చెప్తున్నా, ఇక నుంచి నీకు నేను స‌పోర్ట్‌గా ఉంటా అని మోనాల్‌కు హామీ ఇచ్చాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : నోయల్‌కు వచ్చిన వ్యాధి ఇదే)

నామినేష‌న్‌లో ఉన్న‌వారికి బిగ్‌బాస్ ఆఫ‌ర్‌
అయితే అఖిల్ ఇచ్చిన ట్విస్టు నుంచి తేరుకోని మోనాల్ ఆవేద‌న‌లో ఏదేదో మాట్లాడేసింది. అబ్బాయి- అమ్మాయి ఫ్రెండ్‌షిప్ అంటే ఫ్రెండ్స్ కారు. కొంచెం మోర్ కావాలి. అదే ప్రాబ్ల‌మ్ అని పేర్కొంది. మ‌నుషుల‌ను త‌ప్పుగా అంచ‌నా వేశాన‌ని బాధ‌ప‌డింది. తాను ఒంట‌రినంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. కానీ ఇంత జ‌రిగినా ఆమెకు అఖిల్ మీద ఇసుమంత ప్రేమ త‌గ్గ‌లేదు. రాత్రి ఒళ్లు మ‌రిచి నిద్ర‌పోతున్న‌ అఖిల్‌కు చ‌లి పెట్ట‌కుండా దుప్ప‌టి క‌ప్పింది. కాగా మొత్తంగా మోనాల్‌, అభిజిత్‌, హారిక‌, అవినాష్‌, అమ్మ రాజశేఖ‌ర్ నామినేష‌న్‌లో నిలిచారు. వీరిలో ఒక‌రు ఇమ్యూనిటీ పొంది సేవ్ అయ్యేందుకు బిగ్‌బాస్‌ "ముఖం జాగ్ర‌త్త" అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. ఎండ్ బ‌జ‌ర్‌కు ఎవ‌రి త‌ల స్టాండ్ మీద ఉంటే వారు నామినేష‌న్ నుంచి సేఫ్. 

కొట్టుకున్నంత ప‌ని చేసిన అఖిల్‌, సోహైల్‌
ఇక టాస్క్‌లో భాగంగా మిగ‌తా ఇంటిస‌భ్యులు నామినేట్ అయిన‌వాళ్ల‌ను ఐస్ గ‌డ్డ‌లు, నీళ్లు, గ‌డ్డి, మ‌ట్టి ఉప‌యోగిస్తూ  నానార‌కాలుగా హింసించారు. అంద‌రి క‌న్నా కాస్తంత ఎక్కువ‌గా మోనాల్‌ను హింసించిన‌ట్లు క‌నిపించింది. అది చూసి త‌ట్టుకోలేక‌పోయిన అఖిల్.. మోనాల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఆమె ముఖం శుభ్రం చేశాడు. దీంతో మెహ‌బూబ్‌ మాస్ట‌ర్‌కు సాయం చేస్తే ఎందుకు వ్య‌తిరేకించావ‌ని సోహైల్ అఖిల్ మీద‌ అరిచాడు. అలా వీళ్లిద్ద‌రూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. అరియానా మ‌రోసారి రాక్ష‌సిగా మారి అంద‌రినీ రాచిరంపాన పెట్టింది. కానీ ఎండ్ బ‌జ‌ర్ మోగేస‌రికి టీ స్టాండ్ మీద మోనాల్‌, అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ స్ట‌డీగా ఉన్నారు. దీంతో ఒక్క‌రి క‌న్నా ఎక్కువ మంది ఉన్న కార‌ణంగా ఎవ‌రికీ ఇమ్యూనిటీ ల‌భించ‌లేదు. (చ‌ద‌వండి: సోనూ సూద్‌, ప్లీజ్‌ మోనాల్‌ను కాపాడండి)

ఎన్నో అవ‌మానాలు ప‌డి వ‌చ్చాను: అవినాష్‌
ఇంత‌వ‌ర‌కు ప‌డ్డ క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయ్యింద‌ని అవినాష్ బాధ‌ప‌డ్డాడు. ఎన్నో అవ‌మానాలు ప‌డి వ‌చ్చాను. మ‌ళ్లీ ఆ షో(జ‌బ‌ర్ద‌స్త్‌)లోకి తీసుకోమ‌ని చెప్పారు. అవ‌న్నీ గుర్తొచ్చాయ‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ త‌న‌లాగే ఇక్క‌డ అంద‌రూ స్ట్రాంగ్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉంద‌న్నాడు. మ‌రోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. నేను హ‌ర్ట్ అయ్యాను అఖిల్, నువ్వు న‌న్ను న‌మ్మ‌నందుకు బాధ‌ప‌డుతున్నాన‌ని ఒంటరిగా త‌న క‌న్నీళ్ల‌ను జార‌విడిచింది. (చ‌ద‌వండి: కాబోయే భార్య ఎలా ఉండాలంటే..: అఖిల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement