
కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాజశేఖర్ ఆ తర్వాత దర్శకుడిగా మారారు. గోపిచంద్ 'రణం', రవితేజ 'ఖతర్నాక్', నితిన్' టక్కరి' చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆన్‌స్క్రీన్ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్ స్క్రీన్ మీద కూడా పాపులర్ అయ్యారు. ఇక 16 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నానని రాజశేఖర్ చెప్పారు. డైరెక్టర్‌గా వచ్చి నెంబర్ వన్‌గా నిలవానుకుంటున్నానని మనసులోని కోరికను బయటపెట్టారు.
కొద్దిరోజులుగా హిట్లు లేవని కొంత గ్యాప్ వచ్చిందన్నారు. ఈ లోటును పూడ్చేందుకు బిగ్‌బాస్‌కు వచ్చానని, ఈ షో ద్వారా మళ్లీ నెంబర్ వన్‌గా నిలవాలనుకుంటున్నానని చెప్పారు. గత సీజన్‌లో తన శిష్యుడు బాబా భాస్కర్ వచ్చారని, ఇప్పుడు తాను రావడం సంతోషంగా ఉందన్నారు. వస్తూనే ఈ సాంగ్ నాగార్జునకు డెడికేట్ చేస్తున్నా అంటూ కింగ్ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేశాడు. మరి ఇతని ప్రయాణం బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా సాగుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment