బిగ్‌బాస్‌: గెలవడం‌ కోసం ఆమె ఏమైనా చేస్తుంది! | Bigg Boss 4 Telugu: Amma Rajasekhar Furious On Devi | Sakshi
Sakshi News home page

అరవ భాష వదిలేసి తెలుగులో మాట్లాడితే బాగుంటుంది

Published Mon, Sep 21 2020 3:30 PM | Last Updated on Mon, Sep 21 2020 8:42 PM

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar Furious On Devi - Sakshi

కరోనా లాక్ డౌన్ అనంతరం మొదలైన బిగ్‌బాస్ సీజన్ 4కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీన్ని ప్రసారం చేస్తున్న స్టార్ మాకు మంచి రేటింగ్ ను సంపాదించి పెట్టింది. బ్రాడ్ కాస్టింగ్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బార్క్‌) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, తొలివారం బిగ్ బాస్ లాంచ్‌ని 4.5 కోట్ల మంది ప్రేక్షకులు వీక్షించినట్లు పేర్కొంది. ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ లాంచ్‌ ఇంతకుముందెన్నడూ లేని రేటింగ్స్‌ సాధించింది. దీంతో బిగ్ బాస్ తెలుగు 4 రసవత్తరంగా మారింది. బుల్లితెరపై ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు కంటెస్టెంట్‌లకు పెద్దగా శిక్షలు వేయని బిగ్‌బాస్ కూడా ఇప్పుడు పనిష్మెంట్‌లను ప్రారంభించారు. ఈ క్రమంలో హౌస్‌మెట్స్‌ అంతా కాస్తా గాడిలో పడినట్లు కన్పిస్తోంది. (బిగ్‌బాస్‌: ఒక‌రు సేఫ్‌, మ‌రొక‌రు నామినేట్‌)

తాజాగా విడుదల చేసిన ప్రోమోను చూస్తుంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ కోపంగా కనిపిస్తున్నారు. అరియానా వద్ద కూర్చొని దేవి మీద చిటపటలాడాడు. దేవి తనతో ప్రతిదీ పోల్చుకుంటుందని, నేను డైరెక్టర్‌ అయితే తాను రిపోర్టర్‌ అని అరించిందన్నారు. దేవి  మామూలిది కాదు, విజేత అవ్వడం కోసం ఎవ్వరిని ఏమైనా చేస్తుందని తెలిపారు. అయితే శనివారం నాగ్‌ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా దేవి మాస్టర్‌పై ఫైర్‌ అవుతూ అతన్ని జీరోగా ప్రకటించిన విషయం తెలిసిందే. లాస్య కూడా మాస్టర్‌ జీరో అని తెలపడంతో ఆయన కొంచెం భావోద్వేగానికి లోనయ్యాడు. అందుకే ఈ రోజు ఎపిసోడ్‌లో తన మనసులోని కోపానంతా అరియానా ముందు వెల్లబోసుకున్నాడు. రాజశేఖర్‌ మాస్టర్‌ ఇలా కొత్త అవతారం ఎత్తడంతో గేమ్‌ మరో మలుపు తిరగబోతుందని అర్థమవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మాస్టర్‌లో ఈ కోణం కూడా ఉందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. (బిగ్‌బాస్‌: కాళ్లు మొక్కినా క‌నిక‌రించ‌లేదు!)

ఇదిలా ఉండగా మాస్టర్‌ ఎక్కువ తమిళ పదాలతోనే మాట్లాడుతుండంపై జనాలు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో సగం జనాలకు అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అరవ భాష వదిలేసి తెలుగులో మాట్లాడితే బాగుంటాందని వ్యంగ్యంగా చెబుతున్నారు. అంతేగాక మాస్టర్‌ పోయిపోయి దేవికి పెద్ద విరాభిమాని అయిన అరియానా దగ్గర దేవి గురించి మాట్లాడటంతో ఈ రోజు రాత్రికి ఆమె అన్ని విషయాలు పూస గుచ్చినట్లు దేవితో చెప్పేస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి మాస్టర్‌ కోపానికి రావడానికి అసలైన కారణం ఏంటో తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ సీజన్‌ 4 చూసే వరకు ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement