బిగ్‌బాస్‌ : ‘అ‍మ్మ’బాబోయ్‌.. ఊహించని ట్విస్ట్‌ ఇది | Bigg Boss 4 Telugu : Double Bonanza For Amma Rajasekhar | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : ‘అ‍మ్మ’బాబోయ్‌.. హౌస్‌లో ఊహించని ట్విస్ట్

Published Sun, Nov 1 2020 10:45 PM | Last Updated on Mon, Nov 2 2020 5:25 AM

Bigg Boss 4 Telugu : Double Bonanza For Amma Rajasekhar - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లను ఇస్తుంటాడు బిగ్‌బాస్‌. ఇది ప్రతి సీజన్‌లో జరుగుతుంది. అయితే నాల్గో సీజన్‌లో మాత్రం ఇప్పటి వరకూ సాదా సీదా ట్విస్ట్‌లే ఇస్తూ వచ్చిన బిగ్‌బాస్‌.. ఎనిమిదో వారం ఎండింగ్‌ మాత్రం దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. అమ్మ రాజశేఖర్‌కు డబుల్‌ బొనాంజా, అవినాష్‌కోసం ప్రత్యేక టాస్క్‌, మోనాల్‌ ముద్దులు, సోహైల్‌, హారిక చిందులతో ఈ వీకెండ్‌ ఎపిసోడ్‌ రచ్చ రచ్చగా మారింది. ఇంకా బిగ్‌బాస్‌ హౌస్‌లో నేడు చోటు చేసుచేసుకున్న ట్విస్ట్‌లేంటో చదివేయండి మరి.


ఊగిపోయిన అమ్మ, అవినాష్‌.. చిందులేసిన హౌస్‌మేట్స్‌
నిన్నటి నోయల్‌ వ్యాఖ్యలు హౌస్‌లో హీట్‌ను పెంచాయి. టెంపరరీ ఫ్రెండ్‌ అన్నందుకే నన్ను బ్యాడ్‌ చేశాడు అంటూ అనినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నోయల్‌ అసలు క్యారెక్టర్‌ బయటపడిందంటూ అమ్మ రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు. ఇక సండే ఫన్‌డే కావడంతో అందరిని కూల్‌ చేసే పనిలో పడ్డారు హోస్ట్‌ నాగార్జున. ఇంటి సభ్యులందరిని గార్డెన్‌ ఏరియాలోకి పిలిపించి సాంగ్స్‌ అండ్‌ డాన్స్‌ టాస్క్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్‌మేట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టాడు. టీమ్‌ ఏ లో అభిజిత్(లీడర్‌)‌, హారిక, అమ్మ రాజశేఖర్‌, అరియానా, మెహబూబ్‌, టీమ్‌ బీలో అఖిల్‌(లీడర్‌), అవినాష్‌, సోహైల్‌, లాస్యలు ఉన్నారు. పాటకు సంబందించిన మ్యూజిక్‌ ప్లే అయితే.. వెంటనే పాటని గెస్‌ చేసి బజర్‌ ప్రెస్‌ చేయాలని సూచించారు.

ఇరు జట్ల లీడర్లు బజర్‌ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. మొదటగా హలోబ్రదర్‌ సినిమాలోని ప్రియ రాగాలే పాట మ్యూజిక్‌ ప్లే కాగా (టీం ఏ) లీడర్‌ అభిజిత్‌ బజర్‌ నొక్కాడు. దీంతో అమ్మ రాజశేఖర్‌, హారిక వచ్చి డాన్స్‌ చేశారు. రెండోసారి ‘దారి చూడు.. దుమ్ము చూడు మామ’  పాటను టీమ్‌ బీ లీడర్‌ అఖిల్‌ గెస్‌ చేశాడు. దీంతో సోహైల్‌, మోనాల్‌ తమదైన శైలీలో స్టెప్పులేస్తూ అందరిని అలరించారు. ఇలా మొత్తం తొమ్మిది రౌండ్లలో పలు పాటలకు హౌస్‌ మేట్స్‌ అంతా చిందులేశారు. మొత్తానికి ఈ టాస్క్‌లో అఖిల్‌ టీమ్‌ గెలిచినట్లు నాగార్జున ప్రకటించారు.

ఇకపై మోనాల్‌ని నామినేట్‌ చేయను : అభిజిత్‌
అనంతరం నామినేషన్‌లో ఉన్న మోనాల్‌, అరియానా, అమ్మరాజశేఖర్‌, మోహబూబ్‌ని స్టేజ్‌ మీద నిల్చోపెట్టి.. ఒకరిని సేవ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. బుట్టలో కొన్ని ఆపిల్స్‌ తెచ్చి అభిజిత్‌తో కట్‌ చేయించాడు. ఆపిల్స్‌ని కట్‌ చేస్తే.. అందులో ఎవరి ఫోటో​ వస్తుందో వారి సేవ్‌ అవుతారని నాగార్జున ప్రకటించారు. దీంతో అభిజిత్‌ ఆపిల్స్‌ని కోయడం మొదలు పెట్టాడు. రెండో ఆపిల్‌ కట్‌ చేయగానే మోనాల్‌ ఫోటో వచ్చింది.దీంతో మోనాల్‌ సేవ్‌ అని నాగార్జున ప్రకటించారు. ఇకపై మోనాల్‌ని నామినేట్‌ చేయనని అభిజిత్‌ ప్రకటించారు. 

అవినాష్‌ కోసం ప్రత్యేక టాస్క్‌
నిన్నటి ఎపిసోడ్‌లో మిమిక్రీ చేసేవాళ్లను నోయల్‌ కించపరిచాడు అంటూ అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మిమిక్రీ ఆర్టిస్టులను కించపర్చలేదని, వాళ్ల కోసమే ముఖ్యంగా అవినాష్‌ కోసమే ఓ ప్రత్యేక టాస్క్‌ను బిగ్‌బాస్‌ టీం‌ క్రియేట్‌ చేసిందని చెప్పారు కింగ్‌ నాగార్జున. హౌస్‌మేట్స్‌లో ఒక్కొక్కరిని ఇమిటేట్‌ చేసి చూపించాలని సూచించాడు నాగార్జున. మొదటగా మోనాల్‌ అవినాష్‌ని ముద్దు పెట్టాక ఎలా బిహేవ్‌ చేస్తాడో చేసి చూపించాలని అరియానాను కోరాడు. దీంతో అరియానా చక్కగా ఇమిటేట్‌ చేసి చూపించింది. అయితే నేను అంటే ఇంకా బాగా చేస్తానంటూ అవినాష్‌ చెప్పడంతో ఆయనతోనే మరోసారి ఇమిటేట్‌ చేయించాడు. ఈ సమయంలో మోనాల్‌ వచ్చి అవినాష్‌కు ముద్దు పెట్టింది. దీంతో అవినాష్‌ సంతోషంతో చిందుచేశాడు. వెంటనే నాగార్జున కలుగజేసుకొని అవినాష్‌కి పిల్లను ఇవ్వాలనుకుంటున్న వాళ్లంతా ఈ షో చూడండి అంటూ ఆట పట్టించాడు.


మోనాల్‌ని కిస్‌ అడిగిన అఖిల్‌
తర్వాత మోనాల్‌, అరియానాలను అవినాష్‌ ప్లర్ట్‌ చేసేటప్పుడు ఎలా బిహేవ్‌ చేస్తాడో అఖిల్‌ చేసి చూపించాడు. మోనాల్‌ దగ్గరికి వెళ్లి కిస్‌ ఇవ్వగా అని అడిగాడు. పక్క ఉన్న అరియానా..అవినాష్‌ అంటూ దగ్గరకు రాగా .. మోనాల్‌ నాకు కిస్‌ ఇస్తా అంటే వద్దు అంటున్న అంటూ అఖిల్‌(అవినాష్‌) మాట మారుస్తాడు. అచ్చం అవినాష్‌ చేసినట్లే అఖిల్‌ చేయడంతో హౌస్‌మేట్స్‌తో పాటు నాగార్జున కూడా పగలపడి నవ్వాడు. అలాగే హారిక లాగా అవినాష్‌ ఇమిటేట్‌ చేస్తూ చిన్న పిల్లలా పరిగెడుతూ.. అభిజిత్‌ను హగ్‌ చేసుకున్నాడు. ఇక రాజశేఖర్‌ మాస్టర్‌లాగా సోహైల్‌, అవినాష్‌లు ఇమిటేట్‌ చేస్తూ కోపంలో మాస్టర్‌ ఎలా మాట్లాడుతారో చూపించారు. ఇక అరియానా, లాస్యలను ఇమిటేట్‌ చేసిన అవినాష్‌.. ఓ రేంజ్‌లో నవ్వులు పూయించారు. 


నవ్వులు పూయించిన లాస్క ‘పప్పు’ ఇష్యూ
ఇక లాస్య వంటపై కంప్లైట్‌ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చూపించాలని నాగార్జున కోరగా.. అవినాష్‌ ఓ రేంజ్‌లో రెచ్చిపోయి ఇమిటేట్‌ చేశాడు. లాస్య కోపంలో కూడా ఎలా నవ్వుతూ ఉంటుందో చేసి చూపించాడు. ముఖ్యంగా ‘పప్పు’ ఇష్యూని అయితే లాస్య ఎలా ప్రవర్తించిందో అచ్చుగుద్దినట్లే చేసి చూపించాడు. దీంతో అందరితో పాటు లాస్య కూడా పగడబడి నవ్వింది. అవినాష్‌ ఇమిటేట్‌కు పదికి పది మార్కులు పడ్డాయి. ఇక ఏదైనా గాసిప్స్‌ వస్తే లాస్య ఎలా బిహేవ్‌ చేస్తుందో హారిక చేసి చూపించింది. ఆ తర్వాత ఓ ఫజిల్‌ టాస్క్‌ ఇచ్చి సోహైల్‌ ద్వారా అరియానాను సేవ్‌ చేయించాడు. 

కాలర్‌ ఆఫ్‌ ది వీక్‌తో సర్‌ప్రైజ్‌
ఇక ఈ వారం కొత్తగా కాలర్‌ ఆఫ్‌ ది వీక్‌ను పరిచయం చేశాడు నాగార్జున. దీంతో భాగంగా బయట ఆడియన్స్‌ నుంచి తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ నుంచి కాల్‌ వస్తుందని చెప్పాడు. ఈ వారం అభిజిత్‌కు కాల్‌ వచ్చింది. ఓ మహిళా అభిమాని అభిజిత్‌కు ఫోన్‌ చేసి ప్రతివారం నామినేట్‌ అవుతుంటే ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించారు. దీనికి అభిజిత్‌ సమాధానం ఇస్తే.. ప్రేక్షకుల దయతో ఇప్పటి వరకూ సేవ్‌ అవుతూ వస్తున్నానని, ఓట్లు వేసిన అందరికి రుణపడి ఉంటానని చెప్పాడు. 

మాస్టర్‌కు ఆరు.. మోహబూబ్‌కు రెండు
 నామినేషన్‌లో ఉన్న అమ్మ రాజశేఖర్‌, మెహబూబ్‌లను కన్ఫెషన్‌ రూమ్‌లోకి రమ్మని నాగార్జున సూచించడంతో ఇద్దరు అక్కడి వెళ్లారు. అనంతరం షో రూమ్‌లో నుంచి బోర్డుని తెప్పించి దానిపై ఇద్దరి ఫోటోలు పెట్టి ఎవరు అవసరం.. ఎవరు అవసరం లేదో చెప్పాలని హౌస్‌మేట్స్‌ ఒపీనియన్‌ అడిగాడు. దీంతో అఖిల్‌, అభిజిత్‌, సోహైల్‌, మోనాల్‌, లాస్య, హారిక మెహబూబ్‌ ఉండాలని కోరగా, అవినాష్‌,  అరియానాలు మాత్రం మాస్టర్‌కు సపోర్ట్‌ చేశాడు. దీంతో అమ్మ రాజశేఖర్‌ వెళ్లిపోవాలని ఆరుగురు, మెహబూబ్‌ వెళ్లిపోవాలని ఇద్దరు కోరారని, అందుకే మాస్టర్‌ ఎలిమినేట్‌ అని చెప్పేశాడు. దీంతో మెహబూబ్‌ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఇంట్లోకి వచ్చాడు. మాస్టర్‌ మాత్రం కన్ఫెనెషన్‌ రూమ్‌లోనే ఉండిపోయాడు. 

మాస్టర్‌కు డబుల్‌ బోనాంజా..
అమ్మరాజశేఖర్‌ ఎలిమినేట్‌ అయ్యారని చెబుతూ మోహబూబ్‌ భోరున విలపించాడు. ఇంటి సభ్యులంతా అతన్ని ఓదార్చారు. ఇక మాస్టర్‌ కూడా కంటతడి పెడుతూ కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి బయటకు ఇంట్లోకి వచ్చాడు. ఇంటి సభ్యులంతా అతని దగ్గరకు వెళ్లగా..అందరిని చీదరించుకున్నాడు. బట్టలు సర్దుకొని బయటకు వెళ్తుండగా.. నాగార్జున చిన్న ట్విస్ట్‌ ఇచ్చాడు. మాస్టర్‌ కూడా సేవ్‌ అయినట్లు ప్రకటించాడు. అనారోగ్యం కారణంగా నోయల్‌ ఈ వారం బయటకు వచ్చాడని, అతని విజ్ఞప్తి మేరకే మాస్టర్‌ని సేవ్‌ చేస్తున్నట్లు నాగ్‌ ప్రకటించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అంతా సంతోషంతో చిందులేయగా, మాస్టర్‌ మాత్రం నేను వెళ్తా అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే నాగార్జున కలుగజేసుకొని మీకు ఎక్కువ ఓట్లు వచ్చిన కారణంగా వచ్చేవారం కెప్టెన్సీ పోటీకి నేరుగా ఎంపికయ్యారంటూ మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. దీంతో మాస్టర్‌ చెప్పాల్సిన విషయం మర్చిపోయి.. సంతోషంతో ఆనందభాష్పాలు చిందించాడు. మొత్తానికి అమ్మ రాజశేఖర్‌కి డబుల్‌ బొనాంజా తాకడంతో ఈ ఎపిసోడ్‌ ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement