
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారంటే అందరూ అమ్మ రాజశేఖర్ అని టక్కున చెప్పేస్తారు. అన్ని ఆన్‌లైన్ పోల్స్ కూడా అదే నిజమంటున్నాయి. అదృష్టం బాగుండి ఇన్నాళ్లు తప్పించుకుని తిరుగుతున్న మాస్టర్ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సిందే అని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలను అమ్మ రాజశేఖర్ భార్య రాధ పుకార్లుగా కొట్టిపారేశారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. "మా ఆయన బిగ్‌బాస్ షోకు ఎందుకు వెళ్లాడు? ఎంటర్‌టైన్ చేయడానికా? మూగవాడిలా కూర్చోడానికా? హౌస్‌లోని ఇంటిసభ్యుల మీద జోకులు వేస్తున్నారు, కానీ ప్రేక్షకుల మీద కాదు. మంచి జోకులో, కుళ్లు జోకులో ఏదో ఒకటి చేస్తున్నాడు కానీ కొందరు కంటెస్టెంట్లలా ఏమీ చేయకుండా ఊరికే కూర్చోవడం లేదు కదా! ఆయన ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు" (చదవండి: బిగ్‌బాస్: నామినేట్ చేసినవాళ్లపై మాస్టర్ ప్రతీకారం!)
"ఆయన ఎమోషన్స్‌ను దాచలేడు. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడలేడు. మా ఆయన కచ్చితంగా ఎలిమినేట్ కావడం లేదు. ఎందుకంటే ఆయన లేకపోతే బిగ్‌బాస్ షో లేదు. ఆయన వెళ్లిపోతే షో చప్పగా అయిపోతుంది. అందుకనే షో నిర్వాహకులు ఆయన్ను హౌస్‌లోనే ఉంచుతున్నారు. తప్పకుండా ఆయన విన్నర్‌గా నిలుస్తారు. ఒకవేళ ఆయన ఎలిమినేట్ అయితే మాత్రం షో చూడటమే మానేస్తా. మా ఆయన విన్నర్ కాకపోతే అవినాష్ లేదా అరియానా విజేతగా నిలిచే అవకాశముంది. వారికి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఇక మిగతా వాళ్లతో పోలిస్తే మా ఆయన చాలా బెటర్. వయసు మీద పడ్డా ప్రతి టాస్కూ బాగా ఆడుతున్నాడు. అందుకే తొమ్మిది వారాలు హౌస్‌లో ఉండగలిగాడు. గేమ్ ఆడుతున్నాడు కాబట్టి కోపం రావడం సహజం. దాన్ని ఎవరూ ఆపలేదు. బాగా ఆడుతున్న మా ఆయనకే సపోర్ట్ చేయండి" అని రాధ ప్రేక్షకులను కోరారు. (చదవండి: మోనాల్‌కు 30, అఖిల్‌కు 25, పెళ్లి చేయలేం)
Comments
Please login to add a commentAdd a comment