వెన్నుపోటు పొడిచిన మాస్ట‌ర్‌పై స్వాతి బిగ్‌బాంబ్‌ | Bigg Boss 4 Telugu: Swathi Dixith Bigg Bomb On Amma Rajaseker | Sakshi
Sakshi News home page

మాస్ట‌ర్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌

Published Sun, Oct 4 2020 11:11 PM | Last Updated on Mon, Oct 5 2020 5:12 PM

Bigg Boss 4 Telugu: Swathi Dixith Bigg Bomb On Amma Rajaseker - Sakshi

పోయిన వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌ను సాద‌రంగా ఆహ్వానించి దేవ‌త అని కీర్తించిన మాస్ట‌ర్ ఆమె ఫేక్‌గా అనిపిస్తోంద‌ని నామినేట్ చేశాడు. కానీ అందుకు విరుద్ధంగా ఆమెతో మాత్రం అంద‌రితో క‌లిసిపోవాల‌ని, నువ్వెలాగో సేవ్ అయిపోతావ‌ని నామినేట్ చేసిన‌ట్లు క‌ప్పి పుచ్చాడు. కానీ మాస్ట‌ర్ ఏమ‌న్నాడ‌నేది నేటి ఎపిసోడ్‌లో చూపించ‌డంతో ఆయ‌న‌ అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డింది. వెన్నుపోటు పొడిచిన అమ్మ రాజ‌శేఖ‌ర్‌పై స్వాతి బిగ్‌బాంబ్ ద్వారా ప్ర‌తీకారం తీర్చుకుంది. ఇక నేడు కూడా ఎలిమినేష‌న్ ఉంద‌ని కంటెస్టెంట్ల‌ను భ‌య‌పెట్టించిన నాగ్ చివ‌రి నిమిషంలో అంద‌రూ సేఫ్ అని ప్ర‌క‌టించారు. జంబ‌ల‌కిడి పంబ‌లో అమ్మాయిల క‌న్నా కూడా ఆడ‌ వేషం క‌ట్టిన అబ్బాయిలే బాగా ప‌ర్‌ఫార్మ్ చేశారు. మ‌రి నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేయండి..

లాస్య అవ‌కాశ‌వాది, మోనాల్ ఏమార్చే వ్య‌క్తి
నిన్న ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ నేడు స్టేజీ పైకి రాగా, ఆమెతో నాగ్ గేమ్ ఆడించారు. అందులో భాగంగా కుమార్‌ను న‌క్క తోక తొక్కిన వ్య‌క్తిగా పేర్కొంది. అన్నం పెట్టిన అమ్మ రాజ‌శేఖర్ మోసం చేశార‌ని స్వాతి వాపోయింది. న‌మ్మ‌క‌ద్రోహం చేశాడ‌ని బాద‌ప‌డింది. దీంతో‌ సేఫ్ గేమ్ ఆడకూడ‌ద‌న్న విష‌యం త‌న‌కు బోధ‌ప‌డింద‌ని మాస్ట‌ర్ చెప్పుకొచ్చాడు. ఆ త‌ర్వాత స్వాతి.. సుజాత‌ను పుకార్ల పుట్ట‌గా అభివ‌ర్ణించింది. సోహైల్‌ను దొంగ‌గా, లాస్య‌ను అవ‌కాశ‌వాదిగా, నోయ‌ల్‌ను గుడ్డిగా న‌మ్ముతాడ‌ని, మోనాల్‌ను గుడ్డిగా న‌మ్మ‌కూడ‌ద‌ని, ఆమె ఏమార్చే వ్య‌క్తి అని, మెహ‌బూబ్ మిగ‌తావాళ్ల‌ను అనుస‌రిస్తున్నాడ‌ని చెప్పుకొచ్చింది. అరియానా ఓవ‌ర్ కాన్ఫిడెన్స్, హారిక ట్యూబ్‌లైట్, అభిజిత్ అహంకారి‌, గంగ‌వ్వ‌ చాడీల చిట్టా, అఖిల్ గ‌మ్యం లేని వ్య‌క్తిగా అభిప్రాయ‌ప‌డింది. అవినాష్ త‌న‌కు హౌస్‌లో ఫేవ‌ర్‌రెట్ అని పేర్కొంది. కెప్టెన్సీ రేసులో మాస్ట‌ర్‌ పాల్గొన‌డానికి వీలు లేద‌ని అత‌డిపై బిగ్‌బాంబ్ వేసింది. (చ‌ద‌వండి: బిగ్‌ బాస్‌: సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి?)

సోహైల్‌ను చూసి విజిలేసిన నాగ్‌
బిగ్‌బాస్ హౌస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు అంద‌రూ స‌మాన‌మే అని నాగ్ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని రుజువు చేసేందుకు ఇంటిస‌భ్యులంద‌రితో జంబ‌ల‌కిడి పంబ స్కిట్‌ చేయించారు. అంటే ఆడవాళ్లు మ‌గ‌వాళ్లుగా, మ‌గ‌వాళ్లు ఆడ‌వాళ్లుగా త‌యార‌య్యారు. వాళ్ల పేర్ల‌ను కూడా మార్చేశారు. అనంత‌రం ఒక్కొక్క‌రిని గార్డెన్ ఏరియాలోకి ర‌మ్మ‌న్నారు. సోనాల్‌(సోహైల్‌) న‌డుస్తూ ఉంటే మాత్రం నాగ్ విజిల్ వేస్తూ అమ్మాయిని పిల‌వ‌లేదు క‌దా అని భ్రమ‌‌ప‌డ్డారు. (చ‌ద‌వండి: మీరు సిగ్గుప‌డితే చ‌చ్చిపోవాల‌నుంది: నాగ్‌)

ఖుషీ సీన్‌ను ఖూనీ చేసిన హారిక‌, అవినాష్‌
అమ్మాయిల్లో ఎవ‌రు మీకు బాగా న‌చ్చార‌న్న ప్ర‌శ్న‌కు అరియానా సోహైల్‌ను, దివి మెహ‌బూబ్‌ను, గంగ‌వ్వ కుమార్‌ను, మోనాల్ సోహైల్‌ను, లాస్య మెహ‌బూబ్‌తో పాటు సోహైల్‌ను‌, సుజాత అమ్మ రాజ‌శేఖ‌ర్ ఇష్ట‌మ‌ని చెప్పింది. త‌ర్వాత లాస్య‌, మెహ‌బూబ్‌లు జంట‌గా డ్యాన్సు చేశారు. హారిక, అవినాష్ "ఖుషీ" సినిమాలోని న‌డుము సీన్ స్కిట్‌ను స‌ర్వ‌ నాశ‌నం చేశారు. ఈ అవ‌కాశం పోతే మళ్లీ రాద‌న్న‌ట్లుగా మోనాల్‌, అఖిల్ క‌లిసి రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. సుజాత‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ "చూడాల‌ని ఉంది" చిత్రంలో చిరంజీవి, సౌంద‌ర్య‌ల సీనును క‌ళ్ల ముందు ఉంచారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అందుకే గంగ‌వ్వ‌ను గెలిపించారా?)

క‌బ‌డ్డీ ఆట‌లో మెహ‌బూబ్ టీమ్‌దే గెలుపు
గంగ‌వ్వ‌, కుమార్ సాయి 'ముత్యాలు వ‌స్తావా..' డ్యాన్స్ చేస్తుంటే కుమార్‌ది విగ్గు, చీర ఊడిపోవ‌డంతో అంద‌రూ ఘొల్లుమ‌ని న‌వ్వారు. దివి, నోయ‌ల్ అత‌డులో మ‌హేశ్‌బాబు, త్రిష సీనును రక్తి క‌ట్టించారు. అరియానా, సోహైల్ 'ర‌త్తాలు ర‌త్తాలు' పాట‌కు ఇర‌గ‌దీశారు. అభిజిత్‌, హారిక 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' పాట‌కు సాల్సా డ్యాన్స్ చేశారు. మిమ్మ‌ల్ని ఇలా చూసి త‌న‌కేం క‌ల‌లు వ‌స్తాయోన‌ని నాగ్ భ‌య‌ప‌డ్డారు. అనంత‌రం డ్యాన్స్‌లో అరియానా, సీనులో అమ్మ రాజ‌శేఖ‌ర్‌, సుజాత‌ల‌ను బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్లుగా ప్ర‌క‌టించారు. త‌ర్వాత ఎప్ప‌టిలా సాధార‌ణ వేషానికి వ‌చ్చిన‌ ఇంటిస‌భ్యుల‌తో 'బెలూన్ క‌బ‌డ్డీ' ఆట ఆడించారు. మెహ‌బూబ్‌, సోహైల్‌, దివి, మోనాల్‌, హారిక‌, అరియానా, నోయ‌ల్ ఏ టీమ్ కాగా మిగ‌తా వాళ్లంతా బీ టీమ్‌గా ఏర్పడ్డారు. అవినాష్ కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. త‌ర్వాత టీమ్ ఏ గెలిచిన‌ట్లు నాగ్‌ ప్ర‌క‌టించారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మాస్టర్‌ కాళ్లు పట్టుకున్న సోహైల్‌)

మొద‌టి స్థానంలో అభిజిత్ ఏక‌గ్రీవం
నామినేష‌న్‌లో ఉన్న హారిక‌,  కుమార్ సాయి, అభిజిత్‌, సోహైల్‌, మెహ‌బూబ్‌, లాస్య‌ల‌కు ఎలిమినేష‌న్ ఉందంటూ నాగ్‌ చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఈ ఆరుగురిని హౌస్‌లో వారి ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి నిల‌బ‌డ‌మ‌న్నారు. దీంతో తొలుత‌ అభిజిత్‌, రెండో స్థానంలో మెహ‌బూబ్‌, మూడో స్థానంలో లాస్య నిల‌బ‌డ్డారు. మిగిలిన స్థానాల్లో నిల‌బ‌డే విష‌యంలో మాత్రం బేధాభిప్రాయాలు వ‌చ్చాయి. దీంతో అరియానా వారి ప‌నితీరు ఆధారంగా కుమార్‌, సోహైల్‌, హారిక‌ల‌ను వ‌రుస‌గా 4,5,6 స్థానాల్లో నిల‌బెట్టింది. అవినాష్, అఖిల్‌ మాత్రం సోహైల్ నాలుగో స్థానంలో ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ప్రేక్ష‌కులు మాత్రం ఇక్క‌డున్న స్థానాల‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌ని నాగ్ బాంబు పేల్చారు. కానీ వాళ్లే మీ అంద‌రినీ సేఫ్ చేశార‌ని చెప్ప‌డంతో ఈ వారం గండం గ‌ట్టెక్కామ‌ని నామినేటెడ్ కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement