రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.
మెయినాబాద్: రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. బాలాజీ దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు ఉదయం 6 గంటల నుంచే క్యూలు కట్టారు. రద్దీ అధికంగా ఉండటంతో భక్తులను గర్భగుడిలోకి అనుమతించకుండా మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రదక్షణలు చేసి స్వామిని దర్శించుకున్నారు.