
ఏ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేశారు: శ్రీధర్ బాబు
కరీంనగర్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను స్వాగతిస్తున్నామనీ, శాస్త్రీయ పద్దతిలో జిల్లాల ఏర్పాటు జరగలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్
నేత శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటు చేసి, ఉద్యోగులను కేటాయిస్తున్నారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. చారిత్రాత్మక కరీంనగర్ జిల్లా ఉనికి కోల్పోయేలా విభజన జరిగిందని ఆరోపించారు. ప్రత్యేక జిల్లాల కోసం పారాడిన వారిపై కేసులను ఎత్తివేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.