పోలీసుల దాడుల్లో నగదు, కోళ్లు స్వాధీనం | AP Police raiding on Hen racing in districts few arrested | Sakshi
Sakshi News home page

పోలీసుల దాడుల్లో నగదు, కోళ్లు స్వాధీనం

Published Fri, Jan 15 2016 7:57 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

AP Police raiding on Hen racing in districts few arrested

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో కోడి పందాల స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నగదు, కోళ్లతో పాటు పలువురి పందెంరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల వారీగా..


విజయనగరం: భోగాపురం మండలం బసవపాలెంలో ఐదుగురు పందెంరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు కోళ్లు, రూ.16 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం: సంతమాగులూరు, బల్లికురవ మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 25 కోళ్లు, రూ.15 వేలు నగదుతో పాటు కోడి పందేలు నిర్వహిస్తున్న 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా: ఐరాల మండలం గాజులపల్లెలో కోడి పందెలు నిర్వహిస్తున్న 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement